After Viagra Ban Pakistani Men Turn To Aphrodisiac Lizard Oil, Details Inside - Sakshi
Sakshi News home page

వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..!

Published Sun, Apr 30 2023 4:10 PM | Last Updated on Sun, Apr 30 2023 5:39 PM

After Viagra Ban Pakistani Men Turn To Aphrodisiac Lizard Oil - Sakshi

ఇస్లామాబాద్‌: వయాగ్రా వినియోగంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో కామోద్ధీపన కోసం ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు అక్కడి యువకులు. ఈక్రమంలో ఉడుం కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉడుములు వేటాడే ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో రావల్పిండి యువకులు ఈ ఉడుం నూనె కోసం పరితపిస్తున్నారు. ఎంత డబ్బైనా వెచ్చింది దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు నూనెలో మేరినేట్ చేసి ఎరుపు రంగు మసాలలలో ఉపయోగిస్తారు. లేదా దీనితో సాందా తైలాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే లైంగిక వాంఛ, సామర్థ్యం పెరిగి పడకగదిలొ రెచ్చిపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రావల్పిండిలోని రాజా బాజార్‌లో ఉడుం నూనె కోసం యువకుల తాకిడి పెరిగింది. 

పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో చాలా ముంది ఉడుముల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉడుములను చంపడం తమకు బాధగా అన్పిస్తోందని, కానీ జీవనోపాధి కోసం తప్పడం లేదని వారు చెబుతున్నారు. దశాబ్దాలుగా వీటిపైనే  ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు.

పాకిస్తాన్‌లో ఎక్కుమంది పిల్లల్ని కంటేనే సమాజంలో ఆ దంపతులను గౌరవం ఉంటుంది. పిల్లలు లేకపోతే పరువు పోతుందని చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా ఉపయోగించేవారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఉడుం నూనెకు డిమాండ్ పెరిగింది. అయితే దీని వల్ల లైంగిక వాంఛ, సామర్థ్యం, పటుత్వం పెరుగుతుందని  ఇప్పటివరకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఉడుం వేటగాళ్లు మాత్రం నిజంగానే దీనిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలున్నాయని చెబుతున్నారు.
చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement