1,492 మారుతీ కార్ల రీకాల్ | Maruti Suzuki to recall 1,492 cars | Sakshi
Sakshi News home page

1,492 మారుతీ కార్ల రీకాల్

Published Thu, Nov 28 2013 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM

1,492 మారుతీ కార్ల రీకాల్

1,492 మారుతీ కార్ల రీకాల్

 న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కంపెనీ 1,492 కార్లను రీకాల్ చేస్తోంది. గత నెల 19-26 తేదీల మధ్య తయారైన ఎర్టిగ(306 కార్లు), స్విఫ్ట్(592), డిజైర్(581), ఏ-స్టార్(13) మోడల్ కార్లు మొత్తం 1,492ను రీకాల్ చేస్తున్నామని కంపెనీ బుధవారం తెలిపింది. స్టీరింగ్ కాలమ్‌లో సమస్యలొచ్చే అవకాశాలున్నందున ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు వివరించింది. పైన పేర్కొన్న తేదీల మధ్య తయారైన కార్లను కొనుగోలు చేసిన వారిని తమ డీలర్లు సంప్రదిస్తారని, ఈ కార్లలో స్టీరింగ్ కాలమ్‌లో ఏదైనా తేడా ఉన్నట్లు తేలితే దానిని మారుస్తారని  పేర్కొంది.
 
  ఈ సేవ ఉచితమని వివరించింది. ఇప్పటికే కొత్త స్టీరింగ్ కాలమ్‌లను డీలర్లకు పంపించామని తెలిపింది. కాగా 2010 ఫిబ్రవరిలో మారుతీ కంపెనీ లక్ష ఏ-స్టార్ కార్లను రీకాల్ చేసింది. ఇంధన పంపుకు సంబంధించి ఒక భాగాన్ని రీప్లేస్ చేసే నిమిత్తం ఆ కార్లను కంపెనీ రీకాల్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement