ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కంపెనీకు చెందిన 16,000కు పైగా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాహనతయారీ కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించేలా కృషిచేస్తాయి. కొన్నిసార్లు ఆ ఉత్పత్తుల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో తిరిగి వాటిని సరిచేసేందుకు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే ఇంధన పంప్ మోటార్‌లో లోపం ఉన్న విడి భాగాన్ని సరిచేసేందుకు బాలెనో, వ్యాగన్‌ఆర్ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు (రీకాల్) మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది.
2019 జులై 30 నుంచి నవంబరు 1 మధ్య తయారైన 11,851 బాలెనో, 4190 వ్యాగన్‌ఆర్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఇంధన పంప్ మోటార్ భాగంలో లోపం ఉంటే, అరుదుగా ఇంజిన్ నిలిచిపోవడం లేదా స్టార్టింగ్ సమస్య తలెత్తవచ్చని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ అధీకృత డీలర్ వర్క్‌షాప్‌ల నుంచి ప్రభావిత వాహన యాజమానులకు సమాచారం ఇవ్వనుంది. లోపాలు ఉండే అవకాశం ఉన్న విడిభాగాలను ఉచితంగా మార్చనుంది. మునుపెన్నడూ ఈ స్థాయిలో కంపెనీ కార్లను రీకాల్ చేయలేదని తెలిసింది.
మారుతీ సుజుకీ కంపెనీ ఇటీవల ఇన్విక్టో, జిమ్నీ, ప్రాంన్‌క్స్ మోడళ్లను లాంచ్ చేసింది. ఈ కంపెనీ తయారుచేసిన అరెనా, నెక్సా, ట్రూవాల్యూ మోడళ్లకు వినియోగదారుల నుంచి ఆదరణ ఉన్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. 2024 మార్చి మొదటివారం వరకు కంపెనీ 43.82 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్‌ను కలిగి ఉంది. 2020లో అది 31.59 బిలియన్ డాలర్లుగా ఉండేది.
ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు
Comments
Please login to add a commentAdd a comment