గణపురం: అందరి కోరికలు తీర్చే గణపేశ్వరుడికి వర్షంలో తడవడం తప్పడం లేదు. కాకతీయుల కళా వైభవానికి ప్రతీ కగా నిలిచిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అపురూప, అద్భుత శిల్పకళతో ఉట్టిపడుతున్న దేవాలయం వర్షం నీటిలో తడిసిపోతుంది. అధికారులకు పరిస్థితిని వివరించినా పట్టించుకున్న వారు లేరు. దేవాలయం పరిరక్షణ కమిటీ ప్రతి సంవత్సరం టార్ఫాలిన్ కవర్లు ఖరీదు చేసి దేవాలయం గోపురం పైన కప్పుతున్నారు.
కేంద్ర పురావస్తు మంత్రిత్వశాఖ నుంచి రెండుకోట్ల 75లక్షల నిధులు మంజూరైన దేవాలయం పై కప్పును సవరించలేకపోయారు. మంజూరైన నిధులు మురిగిపోయాయి. రెండు సంవత్సరాల క్రితం అప్పటి పార్లమెంట్ సభ్యులు కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దేవాలయం పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు కదలలేదు.
అధికారులూ.. ‘శివయ్య’ను పట్టించుకోండి
Published Wed, Jul 6 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement