సాక్షి,ముంబై: టాటా మోటార్స్ టియాగో ఎన్‌ఆర్‌జీ మోడల్‌లో త్వరలోనే కొత్త వేరియంట్‌ను లాంచ్‌చేయనుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో టాటా మోటార్స్ హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌గా, అందుబాటులో ధరలో కొత్త ‘‘టాటా టియాగో ఎన్‌ఆర్‌జీ ఎక్స్‌టి ట్రిమ్’’ టీజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన ధర ఫీచర్ల వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది.
టాటా మోటార్స్ పాపులర్ మోడల్ టియాగో కొనసాగింపుగా ఎక్స్‌జెడ్ ప్లస్ కాకుండా ఎక్స్‌టీ వేరియంట్‌గా ఉంటుందని కొత్త కారు ఉండనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత టియాగో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.అలాగే ధరకు తగ్గట్టుగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు ఆడియో సిస్టమ్, టాటా కనెక్ట్ నెక్స్ట్ యాప్, రియర్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్క్ అసిస్ట్‌లతో డిస్‌ప్లే, ఆటో డోర్ లాక్ ఫాలోమి లాంటి కొన్ని ఫీచర్లు కూడా మిస్ అవుతాయట. కొత్త టాటా టియాగో ఎన్‌ఆర్‌జి ఎక్స్‌టి వేరియంట్ ఫీచర్ల అంచనాలను పరిశీలిస్తే బ్లాక్-అవుట్ బి-పిల్లర్, వెనుక పార్శిల్ షెల్ఫ్, ప్యాసింజర్ వైపు వానిటీ మిర్రర్ , హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీటును అందించవచ్చు.
అయితే ఇంజన్ లో ఎలాంటి లేకుండా 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజనే అమర్చింది. ఇది 86PS పవర్ , 113Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ రెండు ఏరియంట్లలో ఉంటుంది. టాటా టియాగో ఎన్‌ఆర్‌జీ ఎక్స్‌టీ ధర దాదాపు రూ. 6.3 లక్షల నుండి రూ. 6.8 లక్షల వరకు ఉండవచ్చు. టియాగో ఎక్స్‌జెడ్ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్ ధర రూ. 6 లక్షలు, ఏఎంటీ వెర్షన్ ధర రూ. 6.55 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే.
Do you chase the XTraordinary?
— Tata Motors Cars (@TataMotors_Cars) July 31, 2022
Get ready for a dose of XTra eNeRGy coming your way!
Stay tuned!#Tiago #TiagoNRG #SeriouslyFun #LiveDifferent #TataMotorsPassengerVehicles #CarsDaily #Cargram #CarsOfInstagram #Hatchback pic.twitter.com/OmonEJMpAf
Comments
Please login to add a commentAdd a comment