
న్యూఢిల్లీ: టియాగో హచ్‌బ్యాక్ అధునాతన వెర్షన్‌ను టాటా మోటార్స్ బుధవారం విడుదల చేసింది. ‘టియాగో ఎన్‌ఆర్‌జీ’ పేరిట విడుదలైన ఈ ఎస్‌యూవీలో మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, ట్యూన్డ్ సస్పెన్షన్ వంటి ఫ్యూచర్లతో పాటు యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఉండడంతో భద్రతా వ్యవస్థ మునుపటి వెర్షన్ల కంటే ఎక్కువని టాటా మోటార్స్ సీఈఓ, ఎండీ గుంటెర్ బుషెక్ వివరించారు.
5–స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలిగిన ఎన్‌ఆర్‌జీని ‘అర్బన్ టఫ్‌రోడ్డర్’గా అభివర్ణించారు. 1.2 పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ధర రూ.5.49 లక్షలు, 1.05 లీటర్ల డీజిల్ ఇంజిన్ వేరియంట్ ధర రూ.6.31 లక్షలుగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment