
ముంబై: టాటా మోటార్స్ తన టియాగో శ్రేణిలో ‘‘టియాగో ఎన్‌ఆర్‌జీ’’ పేరుతో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధర రూ.6.57 లక్షలుగా ఉంది. ఎస్‌యూవీ తరహాలో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద టైర్లు, విశాలమైన, ధృడమైన బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ వెర్షన్లలో లభిస్తుంది. పుష్ బటన్ స్టార్ట్, రేర్ పార్కింగ్ కెమెరా, ఆటోఫోల్డ్ ఓఆర్‌వీఎం, బ్లాక్ ఇంటీరియన్స్, ఏబీఎస్ ఈబీడీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ వైపర్ వంటి అధునాతన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అత్యుత్తమ భద్రత ప్రమాణాలను కలిగి ఉంది. టియాగోలానే కొత్త కారు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుందని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా ఆశాభావం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment