సాక్షి,ముంబై: టాటా మోటార్స్ తన హ్యాచ్‌బ్యాక్ ఎంట్రీ లెవల్ టియాగో లైన్–అప్‌లో ‘‘టాటా టియాగో ఎక్స్‌టీఏ’’ పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కారు ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షలుగా ఉంది. కొత్త వేరియంట్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్(ఏఎంటీ)లో వస్తుంది.
‘‘భారత్‌లో ఆటోమేటిక్ టాన్స్‌మిషన్(ఏటీ) సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోంది, అందుకే ఏటీఎస్ ప్రాధాన్యతను గుర్తించిన కంపెనీ టియాగో ఎక్స్‌టీఏ వెర్షన్ శ్రేణిని మార్కెట్‌కు పరిచయం చేసింది’’ అని టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు. కొత్త వేరియంట్ మిడ్–హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీనివ్వడమే కాకుండా, కస్టమర్లు చెల్లించే ధరకు తగిన సదుపాయాల్ని ఇస్తుందని శ్రీవాస్తవ విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment