టాటా ‘టియాగో’ బుకింగ్స్ @ 1 లక్ష
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ హ్యాచ్‌బ్యాక్ ‘టియాగో’ తాజాగా దేశీ మార్కెట్‌లో లక్ష బుకింగ్స్‌మైలురాయిని అధిగమించింది. టాటా మోటార్స్ ‘ఇంపాక్ట్ డిజైన్’ థీమ్‌తో గతేడాది ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి వచ్చిన తొలి కారు టియాగో.
డిజైన్, పనితీరు, డ్రైవ్ డైనమిక్స్ వంటి పలు అంశాల్లో టియాగో కారు కంపెనీ పరివర్తనలో కీలక పాత్ర పోషించిందని, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఇది కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసిందని కంపెనీ ప్రెసిడెంట్ (ప్యాసెంజర్ వెహికల్స్ బిజినెస్ విభాగం) మయాంక్ పరేఖ్ తెలిపారు. టాటా మోటార్స్ ఇప్పటికే దేశీ మార్కెట్‌లో 65,000 యూనిట్ల టియాగో కార్లను విక్రయించింది.