Tigor Pre-bookings
-
మార్కెట్లోకి మరో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కారు
వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ టిగోర్ ఎలక్ట్ వెహికిల్‌ను(ఈవీ) భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. ప్రయాణికుల వాహనాల విభాగంలో కంపెనీ నుంచి నెక్సన్ ఈవీ తర్వాత ఇది రెండవ ఎలక్ట్రిక్ మోడల్ కావడం గమనార్హం. 55 కిలోవాట్ పవర్, 170 ఎన్ఎం టార్క్‌తో 26 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు 60 కిలోమీ టర్ల వేగాన్ని 5.7 సెకన్లలో చేరుకుంటుంది. 1,60,000 కిలోమీటర్ల వరకు బ్యాటరీ, మోటార్ వారంటీ ఉంది. జిప్ట్రాన్ టేక్నాలజీతో రూపుదిద్దుకుంది. డీలర్ల వద్ద రూ.21వేలు చెల్లించి కొత్త టిగోర్‌ను బుక్ చేసుకోవచ్చని టాటా మోటార్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్ట్ 31 నుంచి డెలివరీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 30కు పైగా కనెక్టెడ్ ఫీచర్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఎలక్టిక్ వాహన విభాగంలో దేశం నెక్సన్ ఈవీక్ 70 శాతం మార్కెట్ వాటా ఉంది. -
మార్కెట్లోకి టాటా ‘టిగోర్’ ఆటోగేర్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ ‘టిగోర్’లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏఎంటీ) వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో రెండు వేరియంట్లు ఉండగా.. ‘ఎక్స్ఎంఏ’ ధర రూ.6.39 లక్షలు, ‘ఎక్స్జెడ్ఏ ప్లస్’ వేరియంట్ ధర రూ.7.24 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో ఈ నూతన కార్లు లభ్యమవుతున్నాయి. తాజాగా విడుదలైన రెండు వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన హర్మాన్ ట్యూన్డ్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, అధునాతన ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉండగా.. భద్రతా పరంగా రెండు ఎయిర్‌బ్యాగులు, యాంటీ– లాక్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్– ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ డిపెండెంట్ ఆటోమేటిక్ డోర్ లాకింగ్ ఫీచర్లున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్) ఎస్.ఎన్.బర్మన్ మాట్లాడుతూ.. ‘కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతనతరం వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాం. ఈ నూతన వెర్షన్ విడుదలతో మా ఆటోమేటిక్ పోర్ట్ ఫోలియో మరింత బలోపేతమైంది’ అని వ్యాఖ్యానించారు. -
టాటా, జయేం రేసింగ్ కార్లు వచ్చేసాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ నాల్గవ అతిపెద్ద వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా రేసింగ్ కార్ల సెగ్మెంట్లోకి దూసుకువచ్చింది. ప్రధానంగా జేటీపీ బ్రాండ్ కింద టాటా మోటార్స్.. దాని ‘టియాగో జేటీపీ’, ‘ టిగోర్ జేటీపీ’ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త మోడల్ కార్లు, బుకింగ్స్ ఈ రోజునుంచే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెలలో డెలివరీ ప్రారంభం కానుంది. హ్యాచ్‌బ్యాక్ టియాగో జేటీపీ ధర రూ. 6.39 లక్షలు, సెడాన్ టిగోర్ జేటీపీ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇవి పరిచయ ధరలని కంపెనీ తెలిపింది. టాటామోటార్స్, కోయంబత్తూరుకు చెందిన జయేం మోటార్స్ సమ భాగస్వామ్యంతో లాంచ్ అయిన మొట్టమొదటి కార్లు ఇవి కావడం విశేషం ఈ రెండు కార్లు మూడు-సిలిండర్ల 1.2 లీటర్ టర్బోచార్జెడ్ న్యూ జనరేషన్ రివోట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. 114 బిహెచ్పీ పీక్ పవర్‌ని అందిస్తుంది. 8 -స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, అల్యూమినియం పెడల్స్, 5000 ఆర్పీఎంతో , 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇతర ఫీచర్లుగగా ఉన్నాయి. -
టాటా టిగోర్ వార్షిక ఎడిషన్ ‘బజ్’..
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ టిగోర్ మోడల్లో వార్షిక ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టిగోర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా టిగోర్ బజ్ పేరుతో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను అందిస్తున్నామని టాటా మోటార్స్ తెలిపింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని, పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.68 లక్షలని, డీజిల్ వేరియంట్ ధర రూ.6.57 లక్షలని (రెండు ధరలు ఎక్స్–షోరూమ్, ఢిల్లీ) టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ ఎస్.ఎస్. బర్మన్ చెప్పారు. టిగోర్ మోడల్‌కు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోందని, తమ అమ్మకాలు నెలవారీగా వృద్ధి సాధించడానికి టిగోర్ మోడల్ ఇతోధికంగా తోడ్పడిందని చెప్పారాయన. టిగోర్ బజ్ ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
టాటా ‘టైగర్’ ప్రి–బుకింగ్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన కంపెనీ టాటా మోటార్స్ తాజాగా తన అప్‌కమింగ్ కాంపాక్ట్ సెడాన్ ‘టైగర్’ ప్రి–బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీ ధ్రువీకృత డీలర్షిప్స్ వద్ద రూ.5,000లతో టైగర్ మోడల్‌ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. కాగా టైగర్ మోడల్ పెట్రోల్, డీజిల్ అనే వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వరుసగా రెవోట్రాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను, రెవోటార్క్ 1.05 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.