న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ ‘టిగోర్’లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఏఎంటీ) వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో రెండు వేరియంట్లు ఉండగా.. ‘ఎక్స్‌ఎంఏ’ ధర రూ.6.39 లక్షలు, ‘ఎక్స్‌జెడ్‌ఏ ప్లస్’ వేరియంట్ ధర రూ.7.24 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో ఈ నూతన కార్లు లభ్యమవుతున్నాయి. తాజాగా విడుదలైన రెండు వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన హర్మాన్ ట్యూన్డ్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, అధునాతన ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉండగా.. భద్రతా పరంగా రెండు ఎయిర్‌బ్యాగులు, యాంటీ– లాక్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్– ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ డిపెండెంట్ ఆటోమేటిక్ డోర్ లాకింగ్ ఫీచర్లున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్) ఎస్.ఎన్.బర్మన్ మాట్లాడుతూ.. ‘కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతనతరం వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాం. ఈ నూతన వెర్షన్ విడుదలతో మా ఆటోమేటిక్ పోర్ట్ ఫోలియో మరింత బలోపేతమైంది’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment