టాటా ‘టైగర్’ ప్రి–బుకింగ్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన కంపెనీ టాటా మోటార్స్ తాజాగా తన అప్‌కమింగ్ కాంపాక్ట్ సెడాన్ ‘టైగర్’ ప్రి–బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీ ధ్రువీకృత డీలర్‌షిప్స్ వద్ద రూ.5,000లతో టైగర్ మోడల్‌ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
కాగా టైగర్ మోడల్ పెట్రోల్, డీజిల్ అనే వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వరుసగా రెవోట్రాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను, రెవోటార్క్ 1.05 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు.