compact sedan
-
హ్యుందాయ్ ఆరా వచ్చేసింది
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ సెగ్మెంట్లో అధికంగా అమ్ముడవుతున్న మారుతీ డిజైర్, హోండా అమేజ్లకు గట్టిపోటీనివ్వగలదని భావిస్తున్న ఆరా ధరలు రూ.5.79 లక్షల నుంచి రూ.9.22 లక్షలుగా (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. బీఎస్ –6 నిబంధనలను పాటించే 1.2 లీటర్ల ఇంజిన్ సామర్థ్యంతో ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ ఎస్.ఎస్. కిమ్ తెలిపారు. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతమున్న తమ మోడల్ ఎక్సెంట్ పెద్దగా అమ్మకాలు సాధించడం లేదంటూనే... ఆరా మాత్రం మంచి అమ్మకాలు సాధించగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పెట్రోల్ కారు 20 కిమీ, డీజిల్ కారు 25 కిమీ. మైలేజీనిస్తాయని తెలియజేశారు. ఈ కారులో వైర్లెస్ ఛార్జర్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. -
హ్యుందాయ్ ఆరా వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తన సరికొత్త ఆరా కాంపాక్ట్ సెడాన్ కారును దేశీయంగా ఆవిష్కరించింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన సెడాన్ కారును మంగళవారం ఆవిష్కరించింది. దీన్ని హ్యుందాయ్ ఐ 10నియోస్ మోడల్‌ను పోలిన స్టయిల్‌తో సరికొత్తగా డిజైన్ చేసింది. ఇప్పటికే (జనవరి 2, 2020) హ్యుందాయ్ "ఆరా" బుకింగ్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ అధీకృత డీలర్లవద్ద రూ. 10వేలు చెల్లించి ఆరా కారును బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల బుకింగ్‌పై 10 శాతం డిస్కౌంట్‌ను అదనగంగా అందిస్తోంది. ఫైరీ రెడ్, పోలార్ వైట్, టైఫూన్ సిల్లార్, టైటాన్ గ్రే, ఆల్ఫా బ్లూ వింటేజ్ బ్రౌన్ 6 కలర్ ఆప్షన్లలో లభ్యం. దీంతోపాటు వండర్ వారంటీని కూడా హ్యుందాయ్ అందిస్తోంది. ఫీచర్లు హ్యుందాయ్ ఆరా డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ , డ్యాష్‌బోర్డు మీద డార్క్ షేడ్స్, ఫ్యాబ్రిక్ అప్హోల్స్ట్రే, సీట్లు బీజీ కలర్ ఫినిషింగ్‌లో వచ్చాయి. డ్యాష్‌బోర్డు మీదున్న సెంటర్ కన్సోల్‌లో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 8.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చింది. 5.3 ఇంచుల డిజిటల్ డిస్ల్పే, అనలాగ్ టాకో మీటర్, క్లైమేట్ కంట్రోల్ కోసం మరో చిన్న డిస్ల్పే కూడా జోడించింది. రియర్ ఏసీ వెంట్స్, స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎయిర్ బ్యాగులు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఆరా కాంపాక్ట్ సెడాన్‌లో బీఎస్-6 ఉద్గార ప్రమాణాల కనుగుణంగా మూడు రకాల ఇంజన్ ఆప్షన్స్ అందిస్తోంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్పి పవర్, 114ఎన్ఎమ్ టార్క్, 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ 100బిహెచ్పి పవర్ , 172ఎన్ఎమ్ టార్క్ , 1.2-లీటర్ డీజల్ ఇంజన్ 75 బిహెచ్పి పవర్ ,190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. వీటిని స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. 1.2-లీటర్ పెట్రోల్ , డీజల్ ఇంజన్లు ఆప్షనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా లభిస్తాయి, అయితే 1.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్ మాత్రం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించదు. హ్యుందాయ్ ఆరా మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ వంటి కాంపాక్ట్ సెడాన్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. ధరలు ప్రారంభ ధర రూ. 5.79 లక్షలు టాప్ వేరియంట్ ధర రూ .9.22 లక్షలు The wait is finally over! The All New #HyundaiAURA shines at an introductory price of INR 5 79 900. Stay tuned for more updates! #MakesYouShine. pic.twitter.com/CU964URi07 — Hyundai India (@HyundaiIndia) January 21, 2020 -
మారుతీ కొత్త డిజైర్ వచ్చేస్తోంది..
మే 16న మార్కెట్లోకి న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా తన ప్రముఖ కాంపాక్ట్ సెడాన్ కారు ‘డిజైర్’లో మూడవ జనరేషన్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త డిజైర్ కార్లు మే 16న మార్కెట్లోకి రానున్నవి. వీటి ద్వారా కంపెనీ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మళ్లీ వృద్ధిని నమోదుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో 4,40,735 యూనిట్లుగా ఉన్న కాంపాక్ట్ సెడాన్ విభాగపు కార్ల విక్రయాలు 2016–17 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం తగ్గుదలతో 4,02,608 యూనిట్లకు క్షీణించాయి. ఇదే సమయంలో మారుతీ డిజైర్ అమ్మకాలు 15 శాతం క్షీణతతో 2,34,242 యూనిట్ల నుంచి 1,99,878 యూనిట్లకు తగ్గాయి. ఒకవైపు విక్రయాలు తగ్గినప్పటికీ కాంపాక్ట్ సెడాన్ విభాగపు అమ్మకాల్లో డిజైర్ 50 శాతం వాటాను ఆక్రమించింది. ఏజీఎస్ ఫీచర్‌తో రానున్న కొత్త డిజైర్ వెర్షన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్ల అందుబాటులో ఉంటుందని మారుతీ సుజుకీ పేర్కొంది. కాగా కంపెనీ ఇప్పటిదాకా 13.81 లక్షల యూనిట్ల డిజైర్ కార్లను విక్రయించింది. మారుతీ సుజుకీ తన డిజైర్ మోడల్‌ను 2008 మార్చిలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. డిజైర్‌కు పోటీగా ఇటీవలే హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన ఎక్సెంట్‌లో కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్ ఆవిష్కరించింది. అలాగే టాటా మోటార్స్ కూడా టిగోర్‌ను తీసుకువచ్చింది. ఇవే కాక డిజైర్ మోడల్ హోండా అమేజ్, ఫోర్డ్ యాస్పైర్, ఫోక్స్వ్యాటన్ అమియో వంటి వాహనాల నుంచి పోటీ ఎదుర్కోనుంది. -
టాటా ‘టైగర్’ ప్రి–బుకింగ్స్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన కంపెనీ టాటా మోటార్స్ తాజాగా తన అప్‌కమింగ్ కాంపాక్ట్ సెడాన్ ‘టైగర్’ ప్రి–బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీ ధ్రువీకృత డీలర్షిప్స్ వద్ద రూ.5,000లతో టైగర్ మోడల్‌ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. కాగా టైగర్ మోడల్ పెట్రోల్, డీజిల్ అనే వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో వరుసగా రెవోట్రాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను, రెవోటార్క్ 1.05 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. -
మెర్సిడెస్ నుంచి కొత్త సీఎల్ఏ వెర్షన్
ప్రారంభ ధర రూ.31.4 లక్షలు ముంబై: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘సీఎల్ఏ’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.31.4 లక్షలు-రూ.34.68 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. అప్డేటెడ్ వెర్షన్లో కొత్త ఫ్రంట్ బంపర్, డైమండ్ పిన్ రాడియేటర్ గ్రిల్, కార్బన్ ఫైబర్ మిర్రర్స్, కొత్త లుక్‌తో కూడిన లెడ్ టెరుుల్ ల్యాంప్స్, 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సమిషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. పెట్రోల్ వేరియంట్లో 2.0 లీటర్ ఇంజిన్‌ను, డీజిల్ వేరియంట్లో 2.2 లీటర్ ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొంది. -
అమ్మకాల్లో అదరగొడుతున్న హోండా అమేజ్
న్యూఢిల్లీ : కాంపాక్ట్ సెడాన్ లోకి దూసుకొచ్చిన హోండా అమేజ్ కారు అమ్మకాల్లో అదరహో అనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో 2 లక్షల అమ్మకాల మైలురాయిని హోండా అమేజ్ చేధించింది. 2013 ఏప్రిల్ లో ఈ కారును భారత మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ కారుతో భారత డీజిల్ విభాగంలోకి హోండా ప్రవేశించింది. మూడేళ్ల వ్యవధిలో ఈ కారు 2లక్షల యూనిట్ల అమ్మకాలతో మైలురాయిని తాకాయని, కొత్త కస్టమర్లను ఎక్కువగా ఈ కారు ఆకట్టుకుంటోందని హోండా కార్ల ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్, సేల్స్ అధినేత జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. చిన్న, పెద్ద రెండు పట్టణాల్లో హోండా అమేజ్ బాగా పాపులర్ అయిందని పేర్కొన్నారు. ఈ కాంపాక్ట్ సెడాన్ అప్ గ్రేడెడ్ వెర్షన్ ను వివిధ రకాల ఫీచర్స్ తో మార్చిలో కంపెనీ ప్రవేశపెట్టింది. కంటిన్యూగా వేరియబుల్ ట్రాన్సిమిషన్(సీవీటీ) కలిగి ఉండటం ఈ అప్ డేట్ ప్రధాన ఫీచర్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సామర్థ్యాలు ఈ కారు కలిగి ఉంది. భద్రతపై ఎక్కువగా దృష్టిసారించిన హోండా అప్ గ్రేడెడ్ వెర్షన్ లో డ్యూయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ ను ఈ కారులో పొందుపరిచింది. భవిష్యత్తులో అన్ని హోండా కార్లు డ్యూయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ తోనే వస్తాయని కంపెనీ పేర్కొంది. సీవీటీ ఆప్షన్ ను ఆఫర్ చేసే మొదటి పెట్రోల్ కాంపాక్ట్ సెడాన్ ఈ కొత్త అమేజ్ నే. దీనివల్ల మంచి ఇంధన సామర్థ్యాన్ని అమేజ్ కలిగి ఉంటోంది. ఈ కారు ధర రూ.5.41లక్షల నుంచి రూ.8.31లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీ) మధ్య ఉంటోంది. -
ఫోక్స్ వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ ‘అమియో’
ధర రూ.5.24 -7.05 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను ఆదివారం మార్కెట్లోకి తెచ్చింది. అమియో పేరుతో పెట్రోల్ వేరయింట్లో మాత్రమే ఈ కారును అందిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. ధరలు రూ.5.24 లక్షల నుంచి రూ.7.05 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని. ఫోక్స్ వ్యాగన్ ఫ్యాసింజర్ కార్స్ ఇండియా డెరైక్టర్ మైకేల్ మేయర్ చెప్పారు. భారత మార్కెట్‌కు అనుగుణంగా ఈ కారును రూపొందిం చామని, తామందిస్తున్న తొలి 4 మీటర్లలోపు సెడాన్ ఇదని పేర్కొన్నారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ముందు వరుసలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అలాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, రెన్ సెన్సింగ్ వైపర్స్, టచ్‌స్క్రీన్ మల్టీ మీడియా మ్యూజిక్ సిస్టమ్, వెనక బాగంలో ఏసీ వెంట్లు, వంటి ప్రత్యేకతలున్నాయి. వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని మైకేల్ తెలిపారు. -
ఫోక్స్‌వ్యాగన్ వెంటో.. కొత్త వేరియంట్
♦ ధరలు రూ.7.85-రూ.11.87 లక్షలు ♦ రెండేళ్లలో ఐదు కొత్త మోడళ్లు న్యూఢిల్లీ : ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ వెంటోమోడల్లో కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ మిడ్‌సైజ్ సెడాన్ ధరలు రూ.7.85 లక్షలు నుంచి రూ.11.87 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ఉన్నాయని ఫోక్స్‌వ్యాగన్ డెరైక్టర్(ప్యాసింజర్ కార్స్) మైఖేల్ మేయర్ చెప్పారు. 2010లో వెంటోను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 1.1 లక్షల వెంటో కార్లను విక్రయించామని వివరించారు. భారత్‌లో అమ్మకాలు పెంచుకోవడమే లక్ష్యంగా రెండేళ్లలో ఐదు కొత్త మోడళ్లను అందించనున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా ఇప్పుడు వెంటోను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొన్నారు. 4 మీ. లోపు కాంపాక్ట్ సెడాన్‌ను వచ్చే ఏడాది అందిస్తామని.. కాంపాక్ట్ సెడాన్ బీటిల్ను మళ్లీ తేనున్నామని చెప్పారు.