ఫోక్స్ వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ ‘అమియో’ | Volkswagen launches compact-sedan Ameo | Sakshi
Sakshi News home page

ఫోక్స్ వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ ‘అమియో’

Published Mon, Jun 6 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

ఫోక్స్ వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ ‘అమియో’

ఫోక్స్ వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ ‘అమియో’

ధర రూ.5.24 -7.05 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను ఆదివారం మార్కెట్లోకి తెచ్చింది. అమియో పేరుతో పెట్రోల్ వేరయింట్‌లో మాత్రమే ఈ కారును అందిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది.  ధరలు రూ.5.24 లక్షల నుంచి రూ.7.05 లక్షల రేంజ్‌లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని.  ఫోక్స్ వ్యాగన్ ఫ్యాసింజర్ కార్స్ ఇండియా డెరైక్టర్ మైకేల్ మేయర్ చెప్పారు. భారత మార్కెట్‌కు అనుగుణంగా ఈ కారును రూపొందిం చామని, తామందిస్తున్న తొలి 4 మీటర్లలోపు సెడాన్ ఇదని పేర్కొన్నారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ముందు వరుసలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అలాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, రెన్ సెన్సింగ్ వైపర్స్, టచ్‌స్క్రీన్ మల్టీ మీడియా మ్యూజిక్ సిస్టమ్, వెనక బాగంలో ఏసీ వెంట్‌లు,  వంటి ప్రత్యేకతలున్నాయి. వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని మైకేల్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement