Volkswagen Wagon
-
అగ్రస్థానం నుంచి దిగిన టయోటా
గత ఏడాది ఫోక్స్ వ్యాగన్దే టోక్యో: ప్రపంచవ్యాప్తంగా అధికంగా కార్ల విక్రయిస్తున్న కంపెనీ ఖ్యాతిని జపాన్‌కు చెందిన టయోటా కోల్పోయింది. గత ఏడాది కార్ల విక్రయాల్లో అగ్ర స్థానాన్ని ఫోక్స్‌వ్యాగన్ చేజిక్కించుకుంది. పర్యావరణ నిబంధనలకు సంబంధించి మోసానికి పాల్పడి అపఖ్యాతి పాలయినప్పటికీ, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌కు ఈ అగ్రస్థానం దక్కడం విశేషం. గత ఏడాది తమ కార్ల అమ్మకాలు 3.8 శాతం పెరిగాయని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. 2015లో 99.3 లక్షలకు పడిపోయిన తమ అమ్మకాలు గత ఏడాది 1.03 కోట్లకు పెరిగాయని, చైనాలో విక్రయాలు జోరుగా ఉన్నాయని వివరించింది. కాగా టయోటా కంపెనీ గత ఏడాది తమ అమ్మకాలు 0.2 శాతం వృద్ధితో 1.01 కోట్లకు పెరిగాయని పేర్కొంది. -
ఫోక్స్ వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ ‘అమియో’
ధర రూ.5.24 -7.05 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ: జర్మనీ కార్ల కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ కొత్త కాంపాక్ట్ సెడాన్‌ను ఆదివారం మార్కెట్లోకి తెచ్చింది. అమియో పేరుతో పెట్రోల్ వేరయింట్లో మాత్రమే ఈ కారును అందిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్ తెలిపింది. ధరలు రూ.5.24 లక్షల నుంచి రూ.7.05 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని. ఫోక్స్ వ్యాగన్ ఫ్యాసింజర్ కార్స్ ఇండియా డెరైక్టర్ మైకేల్ మేయర్ చెప్పారు. భారత మార్కెట్‌కు అనుగుణంగా ఈ కారును రూపొందిం చామని, తామందిస్తున్న తొలి 4 మీటర్లలోపు సెడాన్ ఇదని పేర్కొన్నారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ముందు వరుసలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త అలాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, రెన్ సెన్సింగ్ వైపర్స్, టచ్‌స్క్రీన్ మల్టీ మీడియా మ్యూజిక్ సిస్టమ్, వెనక బాగంలో ఏసీ వెంట్లు, వంటి ప్రత్యేకతలున్నాయి. వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని మైకేల్ తెలిపారు. -
వాహన విక్రయాల్లో ఫోక్స్‌వ్యాగన్ నంబర్‌వన్
{పథమార్ధంలో 50.4 లక్షల వాహనాల విక్రయం రెండో స్థానానికి టయోటా టోక్యో : అంతర్జాతీయంగా అత్యధికంగా వాహనాల విక్రయాల్లో టయోటాను వెనక్కి తోసి ఫోక్స్‌వ్యాగన్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది జనవరి-జూన్ మధ్యలో జపాన్ సంస్థ టయోటా 50.2 లక్షల వాహనాలు అమ్మగా, జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ 50.4 లక్షల వాహనాలు విక్రయించింది. 48.6 లక్షల విక్రయాలతో జనరల్ మోటార్స్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. దాదాపు దశాబ్ద కాలం అగ్రస్థానంలో కొనసాగిన జనరల్ మోటార్స్‌ను తోసిరాజని 2008లో టయోటా నంబర్ వన్ ప్లేస్‌ను దక్కించుకుంది. కానీ 2011లో జపాన్‌లో భూకంపం, సునామీల తాకి డికి ఉత్పత్తి పడిపోవడం తదితర పరిణామాల కారణంగా స్థానాన్ని కోల్పోయింది. ఆ తర్వాత ఏడాది నుంచి మళ్లీ నంబర్‌వన్‌గా నిలుస్తూ వస్తోంది. అయితే, ప్రస్తుతం వాహనాల్లో భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన వివాదాలు చుట్టుముట్టడం, జపాన్‌లో పరిస్థితులు అంత మెరుగ్గా లేకపోవడం తదితర అంశాల కారణంగా ఈ ఏడాది అమ్మకాలు తగ్గొచ్చని టయోటా అంచనా వేస్తోంది. 2014లో 1.02 కోట్ల వాహనాలు విక్రయించిన టయోటా ఈ ఏడాది 1.01 కోట్లకు పరిమితం కావొచ్చని భావిస్తోంది. -
లగ్జరీ కొనుగోళ్లూ ఆన్లైన్లోనే!
న్యూఢిల్లీ: ఆన్లైన్లో పెన్‌డ్రైవ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకి మాత్రమే పరిమితమైన కొనుగోలుదారులు ప్రస్తుతం లక్షలు, కోట్లు ఖరీదు చేసే వాటిని కూడా కొనడం మొదలుపెట్టారు. నగలు మొదలుకుని బైక్‌లు, వింటేజ్ కార్ల దాకా కొనేస్తున్నారు. రూ. 3.5 కోట్లు విలువ చేసే సోలిటెయిర్ చెవి దుద్దులు, రూ. 30 లక్షలు విలువ చేసే ఫోక్స్‌వ్యాగన్ కారు (ఐపీఎల్ టీమ్ కెప్టెన్లు సంతకాలు చేసినది), రూ. 7 లక్షల ఆస్టిన్ రూబీ వింటేజ్ కారు, రూ. 15 లక్షల ఖరీదు చేసే హార్లే డేవిడ్సన్ నైట్ రాడ్ మోటార్ సైకిల్... ఇలా ఒకటేమిటి అనేక లగ్జరీ వస్తువులు ప్రస్తుతం ఆన్లైన్లో కొనేందుకు కొనుగోలుదారులు సందేహించడం లేదు. మెట్రోల్లాంటి ప్రధాన నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ ఈ ధోరణి పెరుగుతోంది. ఈబే, శ్నాప్‌డీల్, ఓఎల్ఎక్స్ వంటి ఆన్లైన్ రిటైలింగ్ వెబ్సైట్లు ఇందుకు మాధ్యమాలుగా ఉపయోగపడుతున్నాయి. బెల్గామ్, బులంద్‌షహర్ వంటి ప్రాంతాల నుంచి కూడా భారీ విలువ చేసే లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆన్లైన్ ప్రయోజనాలు.. సాధారణంగా వింటేజ్ కార్లు, డైమండ్లు మొదలైన వాటి విషయాల్లో ఆఫ్‌లైన్ కన్నా ఆన్లైన్లోనే పారదర్శకత ఎక్కువగా ఉంటోందని ఆన్లైన్ సంస్థలు చెబుతున్నాయి. పైగా ఎంపిక చేసుకునేందుకు విస్తృతమైన శ్రేణి కూడా అందుబాటులో ఉంటుంది. ఆయా విక్రేతల విశ్వసనీయతకు సంబంధించి ఇతర కొనుగోలుదారుల నుంచి వచ్చే సమీక్షలు సైతం తగిన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాల వల్లే కొనుగోలుదారు ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గుచూపుతున్నారని ఇటైలింగ్ సంస్థలు తెలిపాయి. పెరుగుతున్న లావాదేవీల విలువ.. సంపన్న దేశాలతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ ఆన్లైన్లో కొనుగోళ్లకు సంబంధించి విలువపరంగా లావాదేవీ పరిమాణం కూడా ఇటీవలి కాలంలో భారీగాా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్యకాలంలో ప్రతి ఆర్డరుపై సగటు బిల్లు విలువ సుమారు 25 శాతం మేర పెరిగినట్లు శ్నాప్‌డీల్ వర్గాలు తెలిపాయి. శ్నాప్డీల్లో అమ్ముడైన అత్యంత ఖరీదైన టీవీ (సోనీ బ్రావియా) విలువ సుమారు రూ. 3.75 లక్షలు. ఈబేలో ప్రతి నెలా 1,200 టీవీలు అమ్ముడవుతున్నాయి. తమకి వచ్చే ప్రతి పది ఆర్డర్లలో ఆరు ఆర్డర్లు చిన్న పట్టణాల నుంచే వస్తున్నాయని శ్నాప్‌డీల్ వర్గాలు తెలిపాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తుల స్టోర్లు చిన్న పట్టణాల్లో ఉండవు కాబట్టి.. అలాంటి వాటికోసం ఆయా ఊళ్లలో వారు ఇప్పటిదాకా పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఈటైలింగ్ సైట్ల కారణంగా ఈ ధోరణి మారుతోంది. ఇంటి దగ్గరే కూర్చుని ఆన్లైన్లో ఎంత ఖరీదైనవైనా ఆర్డరు ఇచ్చేస్తున్నారు. రాడో, రోలెక్స్ వంటి ఖరీదైన వాచీలకు కూడా ఈటైలింగ్ సైట్లలో ఎక్కువగా గిరాకీ ఉంటోందని కన్సల్టెన్సీ సంస్థ లగ్జరీ కనెక్ట్ వర్గాలు వివరించాయి. ఇలా కొనుగోళ్లు జరిపే వాళ్లలో 40 ఏళ్లు దాటనివారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నాయి. సాధారణంగా పసిడికి సంబంధించి రూ. 2 లక్షలకు మించి కొనుగోళ్లు జరిపితే పాన్ కార్డు తప్పనిసరి అవుతుంది. ఇతరత్రా ఆభరణాలకైతే రూ. 5 లక్షల దాకా వెసులుబాటు ఉంటుంది.