మెర్సిడెస్ నుంచి కొత్త సీఎల్ఏ వెర్షన్ | 2017 Mercedes-Benz CLA sedan launched at Rs 31.40 lakh | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ నుంచి కొత్త సీఎల్ఏ వెర్షన్

Published Thu, Dec 1 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

మెర్సిడెస్ నుంచి కొత్త సీఎల్ఏ వెర్షన్

మెర్సిడెస్ నుంచి కొత్త సీఎల్ఏ వెర్షన్

ప్రారంభ ధర రూ.31.4 లక్షలు
ముంబై: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘సీఎల్‌ఏ’లో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.31.4 లక్షలు-రూ.34.68 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. అప్‌డేటెడ్ వెర్షన్‌లో కొత్త ఫ్రంట్ బంపర్, డైమండ్ పిన్ రాడియేటర్ గ్రిల్, కార్బన్ ఫైబర్ మిర్రర్స్, కొత్త లుక్‌తో కూడిన లెడ్ టెరుుల్ ల్యాంప్స్, 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్‌‌సమిషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. పెట్రోల్ వేరియంట్‌లో 2.0 లీటర్ ఇంజిన్‌ను, డీజిల్ వేరియంట్‌లో 2.2 లీటర్ ఇంజిన్‌ను అమర్చినట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement