
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ టిగోర్ మోడల్‌లో వార్షిక ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. టిగోర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా టిగోర్ బజ్ పేరుతో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను అందిస్తున్నామని టాటా మోటార్స్ తెలిపింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుందని, పెట్రోల్ వేరియంట్ ధర రూ.5.68 లక్షలని, డీజిల్ వేరియంట్ ధర రూ.6.57 లక్షలని (రెండు ధరలు ఎక్స్–షోరూమ్, ఢిల్లీ) టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ ఎస్.ఎస్. బర్మన్ చెప్పారు.
టిగోర్ మోడల్‌కు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోందని, తమ అమ్మకాలు నెలవారీగా వృద్ధి సాధించడానికి టిగోర్ మోడల్ ఇతోధికంగా తోడ్పడిందని చెప్పారాయన. టిగోర్ బజ్ ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment