పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో పాల్గొనన్న టీమ్ ఇండియా ధరించే దుస్తులను భారతీయ ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియన్‌కి చెందిన లగ్జరీ బ్రాండ్ రూపొందిస్తోంది. తరుణ్ తహిలియాన్ లగ్జరీ బ్రాండ్ రెడీ టు వేర్ లేబుల్ తస్వా ఈ ప్రతిష్టాత్మకమైన బాధ్యతను చేపట్టింది. అయితే ఈ దుస్తుల డిజైనింగ్‌లో భారత సంప్రదాయ సొబగులకు ఆధునిక స్టైల్‌ని మిళితం చేసి సరికొత్తగా రూపొందించారు. ఈ సరికొత్త డిజైనర్‌వేర్ దుస్తులను క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా జూన్ 30, 2024న ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉషా సమక్షంలో ఆవిష్కరించారు.
ముఖ్యంగా ఈ దుస్తుల డిజైనింగ్ భారతీయ సంప్రదాయ దుస్తులకు పెద్ద పీట వేసేలా రూపొందించడం విశేషం. అంతేగాక భారతదేశ సాంస్కృతిక వస్త్రాలకు ఐకాన్‌గా నిలచేలా త్రివర్ణ పతాకానికి సంబంధించిన.. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు వంటి కలర్‌లతో రూపొందించారు. టీమ్ ఇండియా పురుష అథ్లెట్లు కుర్తా బూందీ సెట్, మహిళా అథ్లెట్లు అశోక చక్రాన్ని సూచించేలా.. కుంకుమ, ఆకుపచ్చ, నీలం బటన్ హోల్స్‌లోతో కూడిన తెలుపు చీరను డిజైన్ చేశారు. ఇక్కడ తెలుపు శాంతి, ఐక్యతను సూచించేలా చీర రంగును ఎంచుకోవడం విశేషం.
ఈ మేరకు డిజైనర్ తరుణ్ తహిలియాని తాను డిజైన్ చేసిన ఈ దుస్తులు గురించి మాట్లాడుతూ..ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో కలిసి చాలా క్లోజ్‌గా పనిచేయడంతో ఇలా భారతదేశ చరిత్రను చెప్పేలా దుస్తులను డిజైన్ చేశాం. ఈ వస్తాలు చూసేందుకు ఆకర్షణీయంగానే కాకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి కార్యచరణను నిర్థేసిస్తాయి కూడా. ఈ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో ఈ డిజైనర్ వేర్ దుస్తులతో అథ్లెట్స్ ఎంట్రీ అందరీ అటెన్షన్ తమపై ఉండేలా చేయడమే గాకుండా శాంతి, సామరస్యాన్ని చాటి చెబుతాయి.
జూలైలో పారిస్ వెచ్చదనానికి అనుకూలమైన తేలికపాటి దుస్తులు ఇవి. ఆ వేదికపై అథ్లెట్లు భారతీయ సంస్కృతికి, వారసత్వానికి రాయబారులుగా వెళ్లాలని కోరుకుంటున్నా. అందుకే వాటి డిజైనింగ్ విషయంలో ఇంతలా శ్రద్ధ తీసుకున్నాం"అని తరుణ్ తహిలియాని అన్నారు. ఇక కుర్తా బూందీ సెట్‌ని తేలికపాటి మెత్తటి కాటన్‌తో రూపొందించినట్లు తెలిపారు. ఇది శ్వాసక్రియ సౌకర్యాన్ని నిర్థారిస్తుంది. అని ఏస్ డిజైనర్ అన్నారు. అలాగే మహిళ కోసం డిజైన్ చేసిన చీర కూడా శ్వాసకు సౌకర్యంగా ఉండేలా విస్కోస్ క్రేప్ మెటీరియల్‌ని ఎంచుకున్నట్లు వివరించారు డిజైనర్ తరుణ్ తహిలియాని.
(చదవండి: మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment