Kurta design
-
పారిస్ ఒలింపిక్స్ 2024: టీమ్ ఇండియా దుస్తులను డిజైన్ చేసేదేవరంటే..!
పారిస్ ఒలింపిక్స్ వేడుకల్లో పాల్గొనన్న టీమ్ ఇండియా ధరించే దుస్తులను భారతీయ ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియన్‌కి చెందిన లగ్జరీ బ్రాండ్ రూపొందిస్తోంది. తరుణ్ తహిలియాన్ లగ్జరీ బ్రాండ్ రెడీ టు వేర్ లేబుల్ తస్వా ఈ ప్రతిష్టాత్మకమైన బాధ్యతను చేపట్టింది. అయితే ఈ దుస్తుల డిజైనింగ్‌లో భారత సంప్రదాయ సొబగులకు ఆధునిక స్టైల్‌ని మిళితం చేసి సరికొత్తగా రూపొందించారు. ఈ సరికొత్త డిజైనర్‌వేర్ దుస్తులను క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా జూన్ 30, 2024న ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉషా సమక్షంలో ఆవిష్కరించారు. ముఖ్యంగా ఈ దుస్తుల డిజైనింగ్ భారతీయ సంప్రదాయ దుస్తులకు పెద్ద పీట వేసేలా రూపొందించడం విశేషం. అంతేగాక భారతదేశ సాంస్కృతిక వస్త్రాలకు ఐకాన్‌గా నిలచేలా త్రివర్ణ పతాకానికి సంబంధించిన.. కాషాయం, ఆకుపచ్చ, తెలుపు వంటి కలర్లతో రూపొందించారు. టీమ్ ఇండియా పురుష అథ్లెట్లు కుర్తా బూందీ సెట్, మహిళా అథ్లెట్లు అశోక చక్రాన్ని సూచించేలా.. కుంకుమ, ఆకుపచ్చ, నీలం బటన్ హోల్స్‌లోతో కూడిన తెలుపు చీరను డిజైన్ చేశారు. ఇక్కడ తెలుపు శాంతి, ఐక్యతను సూచించేలా చీర రంగును ఎంచుకోవడం విశేషం. ఈ మేరకు డిజైనర్ తరుణ్ తహిలియాని తాను డిజైన్ చేసిన ఈ దుస్తులు గురించి మాట్లాడుతూ..ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో కలిసి చాలా క్లోజ్‌గా పనిచేయడంతో ఇలా భారతదేశ చరిత్రను చెప్పేలా దుస్తులను డిజైన్ చేశాం. ఈ వస్తాలు చూసేందుకు ఆకర్షణీయంగానే కాకుండా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి కార్యచరణను నిర్థేసిస్తాయి కూడా. ఈ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో ఈ డిజైనర్ వేర్ దుస్తులతో అథ్లెట్స్ ఎంట్రీ అందరీ అటెన్షన్ తమపై ఉండేలా చేయడమే గాకుండా శాంతి, సామరస్యాన్ని చాటి చెబుతాయి. జూలైలో పారిస్ వెచ్చదనానికి అనుకూలమైన తేలికపాటి దుస్తులు ఇవి. ఆ వేదికపై అథ్లెట్లు భారతీయ సంస్కృతికి, వారసత్వానికి రాయబారులుగా వెళ్లాలని కోరుకుంటున్నా. అందుకే వాటి డిజైనింగ్ విషయంలో ఇంతలా శ్రద్ధ తీసుకున్నాం"అని తరుణ్ తహిలియాని అన్నారు. ఇక కుర్తా బూందీ సెట్‌ని తేలికపాటి మెత్తటి కాటన్‌తో రూపొందించినట్లు తెలిపారు. ఇది శ్వాసక్రియ సౌకర్యాన్ని నిర్థారిస్తుంది. అని ఏస్ డిజైనర్ అన్నారు. అలాగే మహిళ కోసం డిజైన్ చేసిన చీర కూడా శ్వాసకు సౌకర్యంగా ఉండేలా విస్కోస్ క్రేప్ మెటీరియల్‌ని ఎంచుకున్నట్లు వివరించారు డిజైనర్ తరుణ్ తహిలియాని. (చదవండి: మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!) -
బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!
టాలీవుడ్లో నమ్రతా శిరోద్కర్- మహేశ్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మహేశ్ బాబు సతీమణిగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించారు. ఈ జంటకు సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేశ్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సితార భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు నమ్రత వెల్లడించింది. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?) అయితే చాలా రోజుల తర్వాత మహేశ్ బాబు ఫ్యామిలీ ఓ పార్టీకి హాజరైంది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర్ పార్టీకి మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న ఫోటోలను నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పార్టీలో నమ్రత శిరోద్కర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రూ.4 లక్షల కుర్తా? అయితే ఈ పార్టీలో నమ్రత ధరించిన ప్రత్యేకమైన కుర్తా ధరపై నెట్టింట చర్చ మొదలైంది. గ్రాఫిక్ డిజైన్‌తో కూడిన కుర్తా దాదాపుగా రూ.4 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ప్రత్యేకమైన జార్జియో అర్మానీ కుర్తాలో నమ్రతా శిరోద్కర్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరవవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూజా హేగ్డే హీరోయిన్గా నటిస్తోంది. (ఇది చదవండి: చిన్న సూట్‌కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
కౌల్ స్టైల్ ట్యూనిక్... యూనిక్
మహిళలకు చాలా సౌకర్యంగా ఉండే డ్రెస్ కుర్తీ. దీంట్లో ఎన్నో రకాల మోడల్స్ వచ్చాయి. ఎప్పటికప్పుడు డిజైనర్లు ఈ కుర్తీ స్టైల్స్‌లో మార్పులు తీసుకువస్తూనే ఉన్నారు. అలా వచ్చిందే ఈ కౌల్ స్టైల్ కుర్తీ. కౌల్ ట్యునిక్గానూ పిలిచే ఈ కుర్తీకి దుపట్టాను కూడా జత చేయడంతో సరికొత్తగా ముస్తాబయ్యింది. ►ఫిష్, ఫ్రెంచ్ స్టైల్ టెయిల్, లూజ్ హెయిర్.. కేశాలంకరణ ఈ ట్యునిక్స్కి బాగా నప్పుతుంది. ►సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపించాలంటే సన్నని గోటా లేస్ ఉన్న దుపట్టాను జత చేసిన ఈ పార్టీవేర్ను ధరిస్తే చాలు. ►సంప్రదాయ, పాశ్చాత్య వేడుకలకు కొత్త హంగులు అద్దుతున్న ఈ స్టైల్‌ను స్త్రీలే కాదు పురుషులూ వేడుకలలో వాడుతున్నారు. సరికొత్తగా ముస్తాబు అవుతున్నారు. ►కౌల్ నెక్ ట్యూనిక్‌కు జరీ లేస్ దుపట్టాను జత చేయడంతో గ్లామరస్‌గా కనిపిస్తోంది. ►ఈ స్టైల్ కుర్తా ఎప్పటి నుంచో బౌద్ధ సన్యాసులు ధరించడం చూస్తుంటాం. సౌకర్యంగా ఉండే ఈ డ్రెస్ ఇప్పుడు కుర్తాగా రూపాంతరం చెంది ఫ్యాషన్ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. ఈ కుర్తీ మోకాళ్ల కింది భాగం అంచులు మడిచినట్టు, పైకి దోపినట్టుగా ఉంటుంది. కుర్తా మెడ భాగం నుంచి వేలాడుతున్నట్టుగా దుపట్టా జత చేసి ఉంటుంది. స్లీవ్స్, స్లీవ్‌లెస్.. రెండు స్టైల్స్‌లో ఉండే ఈ కుర్తాలు ప్లెయిన్, ప్రింట్ కలర్ కాంబినేషన్‌తో డిజైన్ చేయడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. దీనికి బాటమ్‌గా సిగరెట్ ప్యాంట్, ట్రౌజర్ జత చేస్తే చాలు. గెట్ టు గెదర్ వేడుకలలో పాల్గొనడానికి సౌకర్యంగా ఉండటంతో పాటు ప్రత్యేకతను చాటుతుందీ డ్రెస్. -
కుర్తీ డిజైన్
లేడీస్ టైలర్ అందంగా కనిపించాలి.. అదే టైమ్‌లో స్టైలిష్ అనే కాంప్లిమెంట్ రావాలి. దాంతో పాటే కంఫర్ట్ ఉండాలి. ఇవన్నీ ఒక్క కుర్తీతో సాధించేయవచ్చు. గతంలో కుర్తా మగవారు ధరించే దుస్తులలో ఒకటి. అదే కుర్తా కొన్ని రూపురేఖలు మార్చుకొని ఆడవారి వార్డ రోబ్‌లో కంపల్సరీ డ్రెస్‌గా కుర్తీ పేరుతో చేరిపోయింది. క్యాజువల్, పార్టీ వేర్... ఏ తరహా అయినా కుర్తీని మనమే డిజైన్ చేసుకుంటే..!! ఎలా కట్ చేయాలి? ఎలా స్టిచ్ చేయాలి? ఈ వారం తెలుసుకుందాం... బ్లౌజ్ కటింగ్ మాదిరిగానే కుర్తీ డిజైనింగ్‌కి కూడా ముందు పేపర్ మీద డిజైన్ గీసుకుని, తర్వాత దాని కొలతలను బట్టి, క్లాత్‌ను కట్ చేసుకుంటే కటింగ్ సరిగ్గా వస్తుంది. అదీ కాకుండా కొత్తగా ప్రాక్టీస్ చేసేవారు పేపర్‌మీద నేర్చుకోవడం సరైన పద్ధతి. పేపర్ చార్ట్, గుర్తు పెట్టడానికి టైలర్స్ చాక్ (మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా చాక్‌పీస్) తీసుకోండి చార్ట్‌ను నిలువుగా, మధ్యకు మడవాలి మీ ఛాతి చుట్టుకొలత 34 అయితే (కింద అన్ని ఛాతి, వెయిస్ట్, హిప్.. చుట్టుకొలతల చార్ట్ ఇస్తున్నాం. పరిశీలించండి) నడుము భాగం 28, హిప్స్ (పిరుదులు) భాగం 38 తీసుకోవాలి ఎ-బి భాగం = ఫుల్ లెంగ్త్ ఎ-ఇ = ఆర్మ్‌హోల్ (చంకభాగం 2 వైపులా) ఎ-ఎఫ్ = నడుము భాగం ఎ-జి = పిరుదుల భాగం ఇఇ1= ఛాతి చుట్టుకొలత ఎఫ్.ఎఫ్.1 = నడుము కొలత జి.జి.1 = పిరుదల భాగం పై నుంచి కిందవరకు స్ట్రెయిట్ లైన్ ఎ1 నుంచి ఇఇ1-ఇ2 వరకు, ఇక్కడ నుంచి మళ్లీ ఎ1 దగ్గర అర అంగుళం కింద నుంచి ఎ2 వరకు మార్క్ చేసుకోవాలి * ఆర్మ్‌హోల్ మధ్య భాగాన ఎ2 , ఇ2 , ఎ 4 వరకు మార్క్ చేసుకోవాలి. * ఎ4 నుంచి ఎ 5 వరకు మార్క్ చేసేటప్పుడు లోపలి వైపు అర అంగుళం ఎక్కువ వదిలి మార్క్ చేయాలి అలాగే వెనుక భాగం ఆర్మ్‌హోల్ కర్వ్‌ను గీసుకోవాలి. * ఎఎ1 = భుజ భాగం (2 వైపుల) ఎఎ2 = అర అంగుళం భుజం వాలు * ఎఎ3 - మెడ భాగం (2 వైపుల) ఎ3, ఎ2 భుజం వాలు స్ట్రెయిట్ లైన్ * బి1 మార్క్ చేసేటప్పుడు మూలన అర అంగుళం గీయనక్కర్లేదు. * ఎ.హెచ్ = నెక్ డెప్త్‌గా తీసుకోవాలి. చేతుల భాగం: ఎ-బి = స్లీవ్స్ లెంగ్త్ (చేతుల పొడవు) ఎ-ఎ1 = 3 అంగుళాలు ఎఎ2 = ఆర్మ్‌హోల్ రౌండ్ (చంకభాగం చుట్టుకొలత) ఎఎ3 = 1 అంగుళం ఎ3 నుంచి ఎ2 వరకు స్ట్రెయిట్ లైన్, మధ్య భాగం ఎ4 ఎ4 నుంచి అర అంగుళం ఎక్కువ వదులుతూ ఎ5- ఎ6 వరకు మార్క్ చేయాలి వంపు వచ్చేలా ముందు వెనక చంకభాగం వరకు ఎ,ఎ3,ఎ5,ఎ1,ఎ,ఎ3,ఎ6,ఎ1 దగ్గర మార్క్ చేసుకోవాలి చేతుల చుట్టుకొలత = బి-బి1 ఆర్మ్ చుట్టుకొలత ముందుభాగం గీసేటప్పుడు వంపు వచ్చేలా చూసుకోవాలి. ఇందుకు (బి,బి1,ఎ1, ఎ5,ఎ3 నుంచి ఎ నుంచి ఎ1, ఎ6, ఎ3 నుంచి ఎ) ఇలా అంకెలు పెట్టి వంపు వచ్చేలా డ్రా చేసి, కట్ చేయాలి. ఇలా డ్రా చేసుకుంటే కట్ చేసేటప్పుడు కర్వ్ సరిగ్గా వస్తుంది. క్లాత్ మీద: తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని నాలుగు మడతలు వేసుకోవాలి. దీని మీద కొలతల ప్రకారం కట్ చేసిన పేపర్ నమూనాను ఉంచి, క్లాత్‌ను కట్ చేసుకోవాలి. (కట్ చేయడానికి ముందు పేపర్ కన్నా ఒకటిన్నర (1 1/2) అంగుళం సైడ్ మార్జిన్ వదలాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్‌లను మాత్రం విడిగా విడ్త్‌ను బట్టి కట్ చేసుకోవాలి. లైనింగ్ కుర్తీ అయితే: కొలతలను డ్రా చేసుకున్న పేపర్ చార్ట్‌ను ముందుగా లైనింగ్ క్లాత్ మీద పెట్టి, మార్క్ చేసి, కత్తిరించాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్‌ను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి, కట్ చేసుకోవాలి. లైనింగ్, సిల్క్ ఫ్యాబ్రిక్ ఒకేసారి పెట్టి కట్ చేస్తే కొలతల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. 1. పేపర్ చార్ట్ మీద డ్రా చేసుకొని, కట్ చేసిన ముందు, వెనుక భాగాలు 2. కట్ చేసిన పేపర్ నమూనాను క్లాత్ మీద పెట్టి అంగుళం మార్జిన్ వదిలి కట్ చేయాలి. 3. స్లీవ్స్ భాగం కట్ చేసే విధానం. దివ్యా మనిహర్ ఫ్యాషన్ డిజైనర్, ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నోవేషన్ (ఐడిఐ), హిమాయత్‌నగర్, హైదరాబాద్ www.alwaysrupesh@gmail.com