Namrata Shirodkar Wears Rs 4 Lakh Graphic Print Kurta at a Party - Sakshi
Sakshi News home page

Namrata Shirodkar: స్పెషల్ అట్రాక్షన్‌గా నమ్రత.. ఆమె డ్రెస్ అన్ని లక్షలా?

Published Tue, Jun 6 2023 7:52 PM | Last Updated on Tue, Jun 6 2023 8:35 PM

Namrata Shirodkar Wears Rs 4 Lakh graphic print kurta at a party - Sakshi

టాలీవుడ్‌లో నమ్రతా శిరోద్కర్- మహేశ్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మహేశ్ బాబు సతీమణిగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించారు. ఈ జంటకు సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేశ్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సితార భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు నమ్రత వెల్లడించింది.

(ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. భారీస్థాయిలో ఖర్చు?)

అయితే చాలా రోజుల తర్వాత మహేశ్ బాబు ఫ్యామిలీ ఓ పార్టీకి హాజరైంది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర్ పార్టీకి మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న ఫోటోలను నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ పార్టీలో నమ్రత శిరోద్కర్ సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. 

రూ.4 లక్షల కుర్తా?

అయితే ఈ పార్టీలో నమ్రత ధరించిన ప్రత్యేకమైన కుర్తా ధరపై నెట్టింట చర్చ మొదలైంది. గ్రాఫిక్ డిజైన్‌తో కూడిన కుర్తా దాదాపుగా రూ.4 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ప్రత్యేకమైన జార్జియో అర్మానీ కుర్తాలో నమ్రతా శిరోద్కర్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరవవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం  మహేశ్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 

(ఇది చదవండి: చిన్న సూట్‌కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement