మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్‌.. నమ్రత ఆసక్తికర పోస్ట్! | Namrata Shirodkar Emotional Post On Mahesh Babu Guntur Kaaram Movie Pre Release Event, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Namrata Shirodkar-Mahesh Babu: 'ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది'.. నమ్రత పోస్ట్ వైరల్!

Published Wed, Jan 10 2024 1:25 PM | Last Updated on Wed, Jan 10 2024 1:39 PM

Namrata Shirodkar Emotional Post Goes Viral On Guntur Kaaram Event - Sakshi

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మరో చిత్రం 'గుంటూరు కారం'. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ కాగా..వ్యూస్ పరంగా యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం మేకర్స్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌ సక్సెస్ కావడంపై మహేశ్ భార్య నమ్రత ఆసక్తికర పోస్ట్ చేశారు. 

నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' మహేశ్‌ సూపర్‌ ఫ్యాన్స్ గురించి మాట్లాడే చివరి వ్యక్తి బహుశా నేనే అనుకుంటా. మన రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. అన్నివేళలా ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తూ మరింత కష్టపడి పనిపడేలా చేశారు. మా సొంత ఊరు గుంటూరులో మీరు చూపించిన ప్రేమను చూసి ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది. మహేశ్‌.. అభిమానులకు మీరొక ఎమోషన్‌. ఈ ప్రేమను కుటుంబసభ్యులుగా మనం ఆదరిస్తాం. ఈ ప్రేమ ఇలాగే మనం జీవించి ఉన్నంత కాలం ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఎల్లప్పుడూ మా ప్రేమను ప్రతిఫలంగా అందిస్తాం. మీరు దానిని స్వీకరిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీ అభిమానానికి నా హృదయం సంతోషంతో నిండుగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది.

కాగా..  గుంటూరులో మంగళవారం జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేశ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి నుంచి నాకు మీరే అన్నీ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన నమ్రత ఈ పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement