TataMotors
-
సేల్స్ బూస్ట్ టాటా మోటార్స్ టాప్ విన్నర్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌నుంచి 150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 76 పాయింట్లు ఎగిసి 59909 వద్ద, నిఫ్టీ 33పాయింట్లు లాభపడి 17630 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్ అంచనాలకు వ్యతిరేకంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లపై తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. అలాగే 6.5 శాతం జీడీపీ వృద్ది రేటు అంచనాలతో మార్కెట్ సానుకూలంగా స్పందిస్తోంది. దాదాపు అన్ని రంగా షేర్లు లాభపడుతున్నాయి. ప్రధానంగా రియల్టీ షేర్లు జోరుమీదున్నాయి. మరోవైపు సేల్స్ బూస్ట్‌తో టాటా మెటార్స్ దాదాపు 8 శాతం ఎగిసి టాప్ గెయినర్‌గా ఉంది. ఓఎన్జీసీ, లార్సెన్, అదానీ ఎంటర్ప్రైజెస్, టైటన్ లాంటివి భారీగా లాభపడుతుండగా, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్,మారుతి , ఇండస్ ఇండ్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. -
టాటా టియాగో ఈవీ వచ్చేసింది: వావ్...తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అత్యంత సరసమైన టియాగో ఈవీని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా తమ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 10వేల మంది వినియోగదారులకు 8.49 (ఎక్స్-షోరూమ్, ఇండియా) లక్షలకు అందించనుంది. XE, XT, XZ+ XZ+ టెక్ అనే నాలుగు ట్రిమ్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది. టాటా టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్ బుకింగ్‌లు అక్టోబర్ 1 నుండి అందుబాటులో ఉంటాయి. డెలివరీలు జనవరిలో ప్రారంభమవుతాయి. ఈ పండుగ సీజన్లో దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో EVని టాటా మోటార్స్ సంక్రాంతి కానుకగా వినియోగ దారులకు అందించనుండటం మరో విశేషం. -
ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా
సాక్షి,ముంబై: రానున్న పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ దిగ్గజాలు ఆపర్ల వర్షం కురిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్, చిన్న కార్లపై డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో దిగ్గజ సంస్థలు కార్లుపోటీ పడుతుండటం విశేషం. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, రెనాల్ట్ తమ కార్లను తక్కువ ధరల్లోనే కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. మారుతి సుజుకి మారుతి కొన్ని మోడల్‌లు రూ. 50,000 వరకు భారీ ఆఫర్‌తోపాటు, క్యాష్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ల రూపంలో తొమ్మిది నుంచి 60వేల రూపాయల దాకా డిస్కౌంట్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో, వ్యాగన్ ఆర్, క్లెరియో, ఎస్-ప్రెస్సో, స్విఫ్ట్ , డిజైర్ వంటి మోడళ్లపై నగదు తగ్గింపులను అందిస్తోంది. అన్ని మోడల్‌లు కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ లభ్యం. రెనాల్ట్ ఇండియా రెనాల్ట్ ఇండియా క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ MPV, కిగర్ కాంపాక్ట్ SUV తదితర మోడళ్లపై రూ. 60,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా నగదు తగ్గింపులు, స్క్రాపేజ్ ప్రయోజనాలు ,ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో కూడా అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేక ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్ కింద రూ. 5,000 విలువైన యాక్సెసరీలు ఉచితం. అలాగే తన అన్ని మోడళ్లలో యాక్సెసరీలపై పరిమిత ఫ్రీడమ్ కార్నివాల్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. హ్యుందాయ్ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుందాయ్ సాంత్రో, ఐ10 నియోస్, ఔరా, ఐ20, ఎక్స్ంట్, కొనా ఈవీ వంటికార్లపై సుమారు రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అదనపు ఇన్సెంటివ్‌లు అందించనుంది. టాటా మోటార్స్ టాటా మోటార్స్ వివిధ మోడళ్లలో పండుగ సీజన్ డిస్కౌంట్లు 20- 40వేల రూపాయల విలువైన పథకాలను అందిస్తోంది. ప్రధానంగా టియాగో, టైగోర్, నెక్సాన్, సఫారీ వంటి మోడల్ కార్లపై రూ.40 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. అలాగే ఓనం పండుగ సందర్భంగా కేరళ వాసుల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దేశీయంగా మహీంద్రా కూడా ఎక్స్‌యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడల్ కార్లపై పలు ఇన్సెంటివ్‌లు, ఆఫర్లు ప్రకటించింది. గత నాలుగు నెలల్లో రిటైల్ విక్రయాలు వెనుకబడి ఉన్నాయి. ఎంట్రీ లెవల్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ప్రస్తుతం పుంజుకుంటున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి వెల్లడించారు.దీంతోపాటు, రానున్న నెలల్లో మెరుగైన సరఫరాతో, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా తగ్గించాలని కోరారు. దీనికి అనుగుణంగా ప్యాసింజర్ వెహికల్ ఒరిజినల్-ఎక్విప్మెంట్ తయారీదారులందరూ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తమ సరఫరాలను రీకాలిబ్రేట్ చేయాలని గులాటీ కోరారు. గత కొన్ని నెలలుగా తమ ప్రొడక్షన్ ప్లాంట్లలో 95 శాతం ఉత్పత్తి చేయాలని ప్రణాళికల్లో ఉన్నామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి చేయడం కార్ల తయారీ సంస్థలకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. -
జోరమీదున్న ఆటోమొబైల్స్ షేర్స్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు
Tatamotors, Maruti Suzuki, share price: స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతుంటే ఆటో మొబైల్ ఇండసక్ట్రీ షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. మరోవైపు ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ షేర్లు ఇన్వెస్టర్లకు తక్షణ లాభాలను అందిస్తున్నాయి. ఎగబాకిన టాటా షేర్లు టాటా మోటార్ కంపెనీ షేర్లు మంగళవారం హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లో ఒక్కో షేరు ధర రూ.507లు ఉండగా మధ్యాహ్నం సమయానికి షేర్ల ధరలు రివ్వున ఎగిశాయి. ఒక్కో షేరు ధర రూ.15 వంతున పెరిగి 2.97 శాతం వృద్ధితో రూ.520.45 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఏడాది కాలంలో టాటా మోటార్ షేరు ఏకంగా 229 శాతం వృద్ధిని నమోదు చేసింది. పైగా ఈవీ కారు మార్కెట్లో టాటానే నంబర్ వన్‌గా ఉంది. ఇటీవల టాటా నుంచి వచ్చిన హారియర్, టియాగో, పంచ్ మోడళ్లకు ఆదరణ బాగుండటంతో టాటా షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇన్వెస్టర్ల ఆసక్తి గత మూడు నెలలుగా కొనసాగిన బుల్ జోరులో టాటా పవర్ షేర్లు బాగా లాభాలను అందించాయి. ఏడాది వ్యవధిలో 324 శాతం వృద్ధిని నమోదు చేశాయి. టాటా పవర్ షేర్ల ధర రూ.57 నుంచి రూ.244 వరకు పెరిగింది. అదే తరహాలో టాటా మోటార్ షేర్లు కూడా పెరగవచ్చనే సెంటిమెంట్ తోడవటంతో ఇన్వెస్టర్లు టాటా మోటార్ షేర్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 229 శాతం వృద్ధి నమోదు అయ్యింది. రాబోయే రోజుల్లో మరింత పెరగవచ్చనే ప్రచారం మార్కెట్ వర్గాల్లో సాగుతోంది. మారుతి సైతం స్టాక్మార్కెట్లో మంగళవారం మారుతి సుజూకి షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి. ఈ రోజు ఉదయం ఒక్కో షేరు ధర రూ. 7,546లు ఉండగా మధ్యాహ్నం 2:51 గంటల సమయానికి 7.13 శాతం వృద్ధిని కనబరిచింది. ఒక్కో షేరు ధర ఏకంగా రూ.534 పెరిగి షేరు ధర రూ. 8,038 దగ్గర ట్రేడ్ అవుతోంది. దీంతో ఇంట్రా డే ట్రేడింగ్‌లో మారుతి షేర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. -
కార్ లవర్స్‌కు టాటా మోటార్స్ తీపికబురు
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కార్ లవర్స్‌కు తీపి కబురు అందించింది. వివిధ మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో టాటా మోటార్స్ మార్చి నెలలో తగ్గింపులను వెల్లడించింది. తన అధికారిక వెబ్సైట్లో అందించిన వివరాల ప్రకారం టియాగో, టైగోర్, నెక్సాన్ , 5-సీట్ల హారియర్‌తో సహా ఎంపిక చేసిన కార్లపై 65 వేల రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. కన్జ్యూమర్ స్కీమ్, ఎక్స్ఛేంజి ఆఫర్, కార్పొరేట్ స్కీమ్‌ల రూపంలో వీటిని అందిస్తోంది. టాటా టియాగో మోడల్‌పై రూ.25వేలను తగ్గింపు అందుబాటులో ఉండనుంది. వీటిల్లో కన్జ్యూమర్ స్కీమ్ రూ.15వేలు, ఎక్స్ఛేంజి ఆఫర్ రూ.10 వేలు ఉన్నాయి. టిగారో సెడాన్‌పై మొత్తం 30వేలుతగ్గింపు. ఇందులో కన్జ్యూమర్ స్కీమ్‌లో రూ. 15వేలు, ఎక్స్ఛేంజి ఆఫర్లో రూ.15 వేలు డిస్కౌంట్ భాగం. నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ.15వేలు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమంటే ఈకారు డీజిల్ వెర్షన్‌పై ఎక్స్ఛేంజి ఆఫర్‌తో మాత్రమే ఈ ఆఫర్ లభ్యం. ఇక హారియర్ 5సీట్ల మోడల్ క్యామో వేరియంట్‌పై మాత్రం రూ.40వేలు లభిస్తోంది. హారియర్‌లో పరిమిత వేరియంట్లకే ఆఫర్‌ను అందిస్తోంది. సాధారణ హారియర్‌పై రూ.65 వేల వరకు తగ్గింపు ఉంది. ఆల్ట్రోజ్ , ఫ్లాగ్షిప్ సఫారి ఎస్యూవీ కొనుగోళ్లపై ఈ ఆఫర్లు వర్తించవు. -
కొత్త ఎడిషన్ కార్లు : వారికి మాత్రమే
సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారత మార్కెట్లో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్నిపురస్కరించుకుని ప్రతి ఫౌండర్స్ ఎడిషన్ కార్లను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఉన్న మోడళ్లలో ప్రత్యేక 'ఫౌండర్స్ ఎడిషన్' వెర్షన్‌ను విడుదల చేసింది. టాటా టియాగో, టైగర్, ఆల్ట్రోజ్, నెక్సాన్ , హారియర్ కార్ల ప్రత్యేక ఎడిషన్లను లాంచ్ చేసింది. అయితే వీటిని అందరికీ అందుబాటులో ఉండవు. టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం మాత్రమే ప్రత్యేకంగా వీటిని తీసుకొచ్చింది. ఈ కార్ల ప్రత్యేకత ఏమిటి? కొన్ని చిన్న మార్పులతోపాటు, టాటా వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటా సంతకం ఉన్న ప్రత్యేక బ్యాడ్జ్ స్పెషల్ ఎట్రాక్షన్. ఫౌండర్ ఎడిషన్ కార్లలో నీలి రంగు బ్యాక్‌గ్రౌండ్‌తో కొత్త లోగోను అమర్చింది. మిగిలిన ఫీచర్లన్నీ యథాతథంగాఉంటాయి. దీంతోపాటు కార్లను కొనుగోలు చేసే టాటా గ్రూప్ ఉద్యోగులకు ఫోటో ఫ్రేమ్‌తో పాటు కంపెనీ ప్రయాణాన్ని వివరించే ఐకానిక్ సిరీస్ పోస్ట్‌కార్డ్ కూడా లభిస్తుంది. అయితే కార్లు ఒక వేరియంట్‌కు ప్రత్యేకమైనవి కావా లేదా ఏదైనా ట్రిమ్ ఆప్షన్లో కూడా కొనుగోలు చేయవచ్చా అనేది కంపెనీ వెల్లడించలేదు. 1945 లో జేఆర్డీ టాటా ఈ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ జర్నీ లోకోమోటివ్ తయారీదారుగా 1945లో టాటా మోటార్స్ ఆవిర్భవించింది. 1954 లో, టాటా గ్రూప్ జర్మనీకి చెందిన డైమ్లెర్-బెంజ్‌తో జాయింట్ వెంచర్‌తో వాణిజ్య వాహన రంగంలోకి ప్రవేశించింది. వాణిజ్య వాహనాల్లో సంవత్సరాల అనుభవం తరువాత, 1991 లో ప్యాసింజర్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించింది. టాటా మొబైల్ ప్లాట్‌ఫాం ఆధారంగా తన తొలి స్పోర్ట్ యుటిలిటీ వాహనం టాటా సియెర్రాను లాంచ్ చేసింది. తద్వారా ప్రయాణీకుల వాహనాల మార్కెట్లోకి ప్రవేశించింది. అనంతరం టాటా ఎస్టేట్ (1992), టాటా సుమో (1994) టాటా సఫారి (1998) ను తీసుకొచ్చింది. 2004 లో, దక్షిణ కొరియాకు చెందిన ట్రక్ తయారీ యూనిట్, డేవూ కమర్షియల్ వెహికల్స్ కంపెనీ టాటా మోటార్స్ డేవూని కొనుగోలు చేసింది. తరువాత దీనిని టాటా డేవూగా మార్చారు. 2005 లో టాటా మోటార్స్ స్పానిష్ బస్సు , కోచ్ తయారీదారు హిస్పానో కరోసెరాలో వాటాలను సొంతం చేసుకుంది. 2008 లో టాటా మోటార్స్ ఫోర్డ్ మోటార్ కంపెనీ నుండి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్ల తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కొనుగోలు చేసింది. -
వ్యాగన్ఆర్ అంత ఘోరమా : టాటా మోటార్స్ సెటైర్లు
సాక్షి, ముంబై: భద్రతా ప్రమాణాల విషయంలో మెరుగైన రేటింగ్ సాధించిన ప్రముఖ కార్ల సంస్థ టాటా మోటార్స్ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోంది. తాజాగా మారుతి సుజుకిని లక్ష్యంగా చేసుకుంది. మారుతి సుజుకి వాహనం వ్యాగన్ఆర్పై సెటైర్లు వేసింది. ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న టాటా మెటార్స్ భద్రతా క్రాష్ పరీక్షలలో విఫలమైన పోటీ సంస్థల కార్లపై వరుసగా వ్యంగ్యంగా ట్వీట్ చేస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, మారుతి ఎస్-ప్రెస్సోపై విమర్శలు చేసింది. (ఎస్బీఐతో బెంజ్ జట్టు: ప్రత్యేక ఆఫర్లు) చక్రం ఊడిపోయిన ఇమేజ్ను ట్వీట్ చేస్తూ, భద్రత ముఖ్యం స్మార్ట్‌గా ఉండాలంటూ సూచించింది. అంతేకాదు కారు స్పెల్లింగ్‌లో కావాలనే ‘R’చేర్చడం గమనార్హం. మారుతి వాగన్ఆర్ గ్లోబల్ ఎన్సీఏపీ భద్రతా క్రాష్ పరీక్షలలో పేలవమైన రేటింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ 2014-2019 మధ్య వచ్చిన కార్లలో సురక్షితమైన భారతీయ కార్ల జాబితాను ప్రకటించింది. ఇందులో మారుతి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, కియా మోటార్స్ సెల్టోస్ ఎస్యూవీ రేటింగ్ దారుణంగా ఉండగా, టాటా మోటార్స్ కార్లు నెక్సాన్, ఆల్ట్రోజ్ ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్‌ను పొందాయి. ఇంకా టిగోర్, టియాగో కూడా సురక్షితమైన కార్లుగా పేర్కొంటూ ఫోర్-స్టార్ రేటింగ్ ఇచ్చింది. Safety is 'two' important to be ignored. Be smart before someone overturns your caRt. Choose Tiago, the safest car in the segment, rated 4 stars by GNCAP. Click on https://t.co/x9nKgE745s to book now.#Tiago #NewForever #SaferCarsForIndia pic.twitter.com/3k8Ughat0C — Tata Motors Cars (@TataMotors_Cars) November 22, 2020 -
స్పెషల్ ఫీచర్లతో టాటా ఆల్ట్రోజ్ ఎక్స్ఎం ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కొత్తగా ప్రారంభించిన కొత్త తరం హ్యుందాయ్ ఐ20కు పోటీగా టాటా మోటార్స్ కొత్తకారును ప్రకటించింది. ఆల్ట్రోజ్ ఎక్స్ఎమ్ ప్లస్ వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లుశనివారం అధికారికంగా ప్రకటించింది. కొత్త ఆల్ట్రోజ్‌ను రూ.6.6 లక్షలకు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయిచింది. ఆల్ట్రోజ్ ఎక్స్ఎమ్ ప్లస్ డౌన్ టౌన్ రెడ్, అవెన్యూ వైట్, హై స్ట్రీట్ గోల్డ్ మరియు మిడ్‌టౌన్ గ్రే అనే నాలుగు రంగులల్లో లభ్యమవుతోంది. ఆల్ట్రోజ్ ఎక్స్ఎమ్ ప్లస్ ఫీచర్లు పెట్రోల్ వేరియంట్ బీఎస్ 6 1.2 లీటర్, రెవోట్రాన్ మోటార్‌ను జోడించింది. ఇది 85 బీహెచ్పీ , 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ రివోటోర్క్ యూనిట్ ద్వారా 89 బీహెచ్పీ , 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ రికగ్నిషన్, రిమోట్ ఫోల్డబుల్ కీతో సహా అనేక ఫీచర్లతో వస్తుంది.న్యూ ఫరెవర్ అంటూకస్టమర్లకు కొత్త ఉత్పత్తులను అందించే క్రమంలో, ఆల్ట్రోజ్ ఎక్స్ఎం ప్లస్ వేరియంట్‌ను ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నామని కంపెనీ ప్రకటించింది. టాటామోటార్స్ టాప్-ఎండ్వేరియంట్లలో లభించే ఫీచర్లను వినియోగదారులకు మరింత అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టు కున్నామని కంపెనీ వెల్లడించింది. వినియోగదారులకు అత్యంత ఆకర్షణీయమైన వివిధ రకాల ప్రీమియం లక్షణాలను అనుభవాన్నిస్తున్నామని టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) హెడ్ మార్కెటింగ్ వివేక్ శ్రీవత్సా అన్నారు. -
ఆటో ఎక్స్పో 2020
-
సెకండ్ దివాలీ : టాటా మోటార్స్ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: దేశీయ వాహన తయారీదారు టాటా మోటార్స్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా మోటార్స్ ఎస్‌యూవీని, లేదా పిక్ అప్ ట్రక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు అద్భుతమైన బహుమతిని గెలచుకునే అవకాశాన్ని కల్పించింది. తద్వారా ప్రజలకు మరో దీపావళి వెలుగులునింపనున్నామని టాటా మోటార్స్ తెలిపింది. టాటామోటర్స్ ఎస్యూవీ ని లేదా పిక్ అప్ ట్రక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు (టీవీ, వాషింగ్ మెషీన్, మిక్సీ తదితర) ఒక గిఫ్ట్‌ను అందివ్వనుంది. అంతేకాదు దీంతో పాటు సుమారు రూ. 5లక్షల విలువైన బంగారాన్ని ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ నవంబరు 1నుంచి 30వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. Ab India manayega is saal ki doosri Diwali. Kharidiye Tata Motors SCV ya Pick-up trucks aur paaiye assured gifts aur mauka 5 lakh tak ka gold voucher jeetne ka. Offer valid from 1st to 30th November 2019. #DoosriDiwali @akshaykumar pic.twitter.com/KlPr2JItPV — Tata Motors (@TataMotors) November 9, 2019 -
టాటా మోటార్స్ కార్ల ధరలు పెంపు
సాక్షి, ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్ల ధరలు పెరగనున్నాయి. వచ్చే నెల ఏప్రిల్ నుంచి వివిధ మోడళ్ల ప్యాసెంజర్ కార్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం కంపెనీ ప్రకటించింది. ఈ పెంపు 25 వేల రూపాయల దాకా ఉంటుందని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు, ఇన్పుట్ వ్యయాల కారణం ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా టయోటా, జాగ్వర్ ల్యాండ్ రోవర్ ధరలు పెరుగుతాయని పేర్కొంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్పుట్ వ్యయాలు, వివిధ బాహ్య ఆర్థిక కారకాల కారణంగా ధరలను పెంచుతున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పారిక్ ఒక ప్రకటనలో తెలిపారు. -
టాటా మోటార్స్ కార్లు ధరల మోత
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచేసింది. ఈ ధరల పెంపు జనవరి 1, 2019 నుంచి వర్తిస్తుందని గురువారం తెలిపింది. ప్యాసింజర్ వాహనాల అన్ని మోడళ్లపై దాదాపు రూ .40 వేల వరకు పెంచినట్టు ప్రకటించింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈ మేరకు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల వ్యాపార విభాగ అధ్యక్షుడు మయాంక్ పారిక్ ఒక ప్రకటన జారీ చేశారు. ప్యాసింజర్ వాహనాల సెగ్మెంట్లో టాటా మోటార్స్ నానో లాంటి ఎంట్రీ లెవల్ కారునుంచి ప్రీమియం ఎస్యూవీ హెక్సా దాకా పలు వాహనాలను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ .2.36 లక్షలు, రూ. 17.97 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉన్నాయి. కాగా జనవరి నెలలో సంస్థ తన కొత్త ప్రీమియం ఎస్యూవీ హారియర్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. -
టాటా, జయేం రేసింగ్ కార్లు వచ్చేసాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ నాల్గవ అతిపెద్ద వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా రేసింగ్ కార్ల సెగ్మెంట్లోకి దూసుకువచ్చింది. ప్రధానంగా జేటీపీ బ్రాండ్ కింద టాటా మోటార్స్.. దాని ‘టియాగో జేటీపీ’, ‘ టిగోర్ జేటీపీ’ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త మోడల్ కార్లు, బుకింగ్స్ ఈ రోజునుంచే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెలలో డెలివరీ ప్రారంభం కానుంది. హ్యాచ్‌బ్యాక్ టియాగో జేటీపీ ధర రూ. 6.39 లక్షలు, సెడాన్ టిగోర్ జేటీపీ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇవి పరిచయ ధరలని కంపెనీ తెలిపింది. టాటామోటార్స్, కోయంబత్తూరుకు చెందిన జయేం మోటార్స్ సమ భాగస్వామ్యంతో లాంచ్ అయిన మొట్టమొదటి కార్లు ఇవి కావడం విశేషం ఈ రెండు కార్లు మూడు-సిలిండర్ల 1.2 లీటర్ టర్బోచార్జెడ్ న్యూ జనరేషన్ రివోట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. 114 బిహెచ్పీ పీక్ పవర్‌ని అందిస్తుంది. 8 -స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, అల్యూమినియం పెడల్స్, 5000 ఆర్పీఎంతో , 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇతర ఫీచర్లుగగా ఉన్నాయి. -
ఫెస్టివ్ సీజన్ ఆఫర్ : టాటా టైగోర్ గెల్చుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కస్టమర్లకు పండగసీజన్లో వివిధ ఆఫర్లను ప్రకటించింది. టాటా మోటార్స్ ప్రతి ఫోర్‌వీలర్ కొనుగోలుపై ఫెస్టివల్ గిఫ్ట్‌లను ఆఫర్ చేస్తోంది. తమకార్ల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే వారానికి ఒకటాటా టైగోర్ను గెలుచుకునే అవకాశాన్ని కూడాకల్పిస్తోంది. ప్రతి వారం టాటా టైగోర్ను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అక్టోబర్ 31 వరకు 'ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్స్’ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. టాటా కార్ల కొనుగోలుపై అందిస్తున్న డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి. టాటా టియాగో - రూ. 40,000 టాటా టైగోర్ - రూ.73,000 టాటా జెస్ట్ - రూ. 83,000 టాటా నెక్సన్ - రూ. 57,000 టాటా సఫారి స్టార్మ్ - రూ. 87,000 టాటా హెక్సా - రూ. 98,000 టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సపోర్ట్, ప్యాసింజర్ వాహనాల డివిజన్ ఎస్ఎన్ బార్మన్ మాట్లాడుతూ, ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా,తమ కస్టమర్ల ఆనంద వేడుకల్లో భాగమయ్యేందుకు ఇది అద్భుతమైన సమయమన్నారు. -
టాటా మోటార్స్ కొత్త జెస్ట్ ప్రీమియో
సాక్షి,ముంబై: ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ జెస్ట్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను సోమవారం విడుదల చేసింది. 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ ‘జెస్ట్ ప్రీమియో’ పేరుతో లాంచ్ అయిన ఈ కొత్త కారులో 13 అదనపు ఫీచర్లను జోడించింది. రూ.7.53 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభధరగా కంపెనీ నిర్ణయించింది. దేశంలోని అన్ని టాటా మోటార్స్ రీటైల్ దుకాణాలలో మార్చి 1నుంచి అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. టాటామోటార్స్ 2014 ఆగస్టులో విడుదల చేసినప్పటినుంచీ ఇప్పటివరకు 85వేల యూనిట్లను విక్రయించింది. కస్టమర్ ప్రాధాన్యతలకనుగుణంగా తీసుకొచ్చిన తమ స్పెషల్ ఎడిషన్ తప్పకుండా వినియోగ దారులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహనం బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ వ్యక్తం చేశారు. డ్యుయల్ టోన్ రూఫ్ , ఎక్స్ టీరియర్ మిర్రర్స్, డాష్‌బోర్డ్ లాంటి కొత్త ప్రీమియం ఫీచర్లతో పాటు నాలుగు సిలిండర్ డీ 1.3 లీటర్ జిల్ ఇంజిన్, 74 బిహెచ్పీ, 190 ఎన్ఎం టార్క్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే కొత్త మారుతి డీజైర్, ఫోక్స్‌వ్యాగన్ అమేయో, రాబోయే కొత్త హోండా అమేజ్, ఫోర్డ్ యాస్పైర్ లాంటి గట్టిపోటీ ఇవ్వనుందని అంచనా. -
టాటా మోటార్స్‌కు రూ.375 కోట్ల ఆర్డర్ !
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ రక్షణ శాఖ నుంచి భారీ ఆర్డర్‌ను సాధించింది. ఈ ఆర్డర్లో భాగంగా భారత పదాతి, నావికా దళాలకు ప్రత్యేకంగా తయారు చేసిన 3,192 టాటా సఫారీ స్టార్మ్‌లను సరఫరా చేయనున్నామని టాటా మోటార్స్ తెలిపింది. మారుతీ జిప్సీల స్థానంలో ఈ సఫారీ వాహనాలను భారత సైన్యం వినియోగించనున్నదని వివరించింది. ఈ ఆర్డర్ విలువను కంపెనీ వెల్లడించనప్పటికీ, ఈ విలువ రూ.375 కోట్లుగా ఉంటుందని అంచనా. రక్షణ దళాలకు వాహన సంబంధిత సరఫరాలు సంబంధించి అతి పెద్ద కంపెనీగా ఈ ఆర్డర్... టాటా మోటార్స్ స్థానాన్ని మరింత పదిలం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
టాటా మోటార్స్ నికర లాభాలు ఢమాల్!
ముంబై: ప్రముఖ కార్ల దిగ్గజం టాటా మోటార్స్ క్యూ3 లో నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. మంగళవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేపోయింది. గత ఏడాది రూ.2,953 కోట్ల లాభాలతో పోలిస్తే ఈ క్వార్టర్ లో96 శాతం క్షీణించి రూ.112 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 4 శాతం క్షీణించి రూ. 68,541కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లోరూ.71,616కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అటు ఈ ఫలితాల నేపథ్యంలో టాటా మెటార్స్ కౌంటర్ లో అమ్మకాల వెల్లువ కొనసాగింది. టాటా మెటార్స్ షేర్ 8శాతానికిపైగా, డీవీఆర్ షేర్ 4 శాతం క్షీణించాయి. డీమానిటైజేషన్ కారణంగా కంపెనీ భారీ నష్టాలను మూటగట్టుకుంది. నిర్వహణ లాభం(ఇబిటా) 42 శాతం దిగజారి రూ. 5,161 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 12.5 శాతం నుంచి 7.6 శాతానికి బలహీనపడ్డాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర నష్టం రూ. 147 కోట్ల నుంచి రూ. 1036 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం మాత్రం 1.5 శాతం పుంజుకుని రూ. 11,222 కోట్లయ్యింది. ఫారిన్ ఎక్సేంజ్ నష్టం భారీగా ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. అలాగే బ్రెగ్సిట్ ఉదంతంతో ముఖ్యంగా జెఎల్ఆర్ నిరుత్సాహకర అమ్మకాలు టాటా మోటార్స్ ఫలితాలను బాగా దెబ్బతీసింది. జాగ్వార్ రేంజ్ రోవర్ 10 శాతానికి దిగువడం పడిపోవడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయపర్చింది.