
సాక్షి, ముంబై : ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కార్ల ధరలు పెరగనున్నాయి. వచ్చే నెల ఏప్రిల్ నుంచి వివిధ మోడళ్ల ప్యాసెంజర్ కార్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం కంపెనీ ప్రకటించింది. ఈ పెంపు 25 వేల రూపాయల దాకా ఉంటుందని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు, ఇన్‌పుట్ వ్యయాల కారణం ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. ముఖ్యంగా టయోటా, జాగ్వర్ ల్యాండ్ రోవర్ ధరలు పెరుగుతాయని పేర్కొంది.
మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలు, వివిధ బాహ్య ఆర్థిక కారకాల కారణంగా ధరలను పెంచుతున్నామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పారిక్ ఒక ప్రకటనలో తెలిపారు.