సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌నుంచి 150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 76 పాయింట్లు ఎగిసి 59909 వద్ద, నిఫ్టీ 33పాయింట్లు లాభపడి 17630 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్ అంచనాలకు వ్యతిరేకంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లపై తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. అలాగే 6.5 శాతం జీడీపీ వృద్ది రేటు అంచనాలతో మార్కెట్ సానుకూలంగా స్పందిస్తోంది.
దాదాపు అన్ని రంగా షేర్లు లాభపడుతున్నాయి. ప్రధానంగా రియల్టీ షేర్లు జోరుమీదున్నాయి. మరోవైపు సేల్స్ బూస్ట్‌తో టాటా మెటార్స్ దాదాపు 8 శాతం ఎగిసి టాప్ గెయినర్‌గా ఉంది. ఓఎన్‌జీసీ, లార్సెన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టైటన్ లాంటివి భారీగా లాభపడుతుండగా, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్,మారుతి , ఇండస్ ఇండ్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment