సాక్షి,ముంబై: ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కాంపాక్ట్ సెడాన్ జెస్ట్‌లో ప్రత్యేక ఎడిషన్‌ను సోమవారం విడుదల చేసింది. 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ ‘జెస్ట్ ప్రీమియో’ పేరుతో లాంచ్ అయిన ఈ కొత్త కారులో 13 అదనపు ఫీచర్లను జోడించింది. రూ.7.53 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభధరగా కంపెనీ నిర్ణయించింది. దేశంలోని అన్ని టాటా మోటార్స్ రీటైల్ దుకాణాలలో మార్చి 1నుంచి అందుబాటులో ఉంచినట్టు తెలిపింది.
టాటామోటార్స్ 2014 ఆగస్టులో విడుదల చేసినప్పటినుంచీ ఇప్పటివరకు 85వేల యూనిట్లను విక్రయించింది. కస్టమర్ ప్రాధాన్యతలకనుగుణంగా తీసుకొచ్చిన తమ స్పెషల్ ఎడిషన్ తప్పకుండా వినియోగ దారులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహనం బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ వ్యక్తం చేశారు. డ్యుయల్ టోన్ రూఫ్ , ఎక్స్ టీరియర్ మిర్రర్స్, డాష్‌బోర్డ్ లాంటి కొత్త ప్రీమియం ఫీచర్లతో పాటు నాలుగు సిలిండర్ డీ 1.3 లీటర్ జిల్ ఇంజిన్, 74 బిహెచ్‌పీ, 190 ఎన్‌ఎం టార్క్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ఇక మార్కెట్‌లో పోటీ విషయానికి వస్తే కొత్త మారుతి డీజైర్, ఫోక్స్‌వ్యాగన్ అమేయో, రాబోయే కొత్త హోండా అమేజ్, ఫోర్డ్ యాస్పైర్ లాంటి గట్టిపోటీ ఇవ్వనుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment