హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్లు, ట్యూబ్‌ల విపణిలోకి కొత్త బ్రాండ్ ‘న్యూమెక్స్’ ప్రవేశించింది. ఈ బ్రాండ్ కింద టూ వీలర్లు, త్రీ వీలర్లు, స్మాల్, లైట్ కమర్షియల్ వెహికల్స్, ఫామ్ ఎక్విప్‌మెంట్‌కు అవసరమైన వాహనాల టైర్లు, ట్యూబ్‌లను విక్రయిస్తారు. రెండేళ్ల సమగ్ర పరిశోధన అనంతరం మార్కెట్‌కు అవసరమైన ఉత్పాదనలను తీసుకొచ్చామని కంపెనీ ప్రమోటర్ కె.రవిశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. 65 రకాల టైర్లను తొలుత ప్రవేశపెట్టామన్నారు.
ఈ ఉత్పాదనలతో 80 శాతం మార్కెట్‌ను కవర్ చేస్తున్నట్లవుతుందని తెలియజేశారు. ‘‘ఈ ఏడాది చివరి వరకూ పూర్తిగా హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లపైనే దృష్టి పెడతాం. వచ్చే ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో... ఆ తరువాతి సంవత్సరం దక్షిణ భారతంలో, ఆ తరవాత దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం’’ అని రవిశంకర్ వివరించారు. టైర్ల తయారీలో విశేష అనుభవం ఉన్న... ఎన్నో ప్రధాన బ్రాండ్లకు టైర్లను సరఫరా చేస్తున్న హైదరాబాదీ కంపెనీ ఒకటి న్యూమెక్స్‌కు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.
కాగా, ఫుల్ సర్కిల్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లను న్యూమెక్స్ తెరుస్తోంది. జూన్ నాటికి 8 కేంద్రాలు హైదరాబాద్‌లో రానున్నాయని సహ ప్రమోటర్ సుప్రజ్ రెడ్డి తెలియజేశారు. స్టోర్లలో కస్టమర్లు వినూత్న అనుభూతికి లోనవుతారని చెప్పారు. భవిష్యత్తులో టైర్ల ఎగుమతులు చేపడతామన్నారు. ‘‘ప్రతి బ్రాండ్‌లోనూ చౌక, ప్రీమియం టైర్లున్నాయి. మేం ప్రీమియం విభాగంపైనే దృష్టి పెట్టాం.
ఈ విభాగంలో మిగతా బ్రాండ్లతో పోలిస్తే మా టైర్ల ధరలు కొంత తక్కువే. డబ్బుకు తగ్గ విలువ ఇవ్వటంలో మేం మిగతా బ్రాండ్లకన్నా చాలా ముందుంటాం. ఎందుకంటే నాణ్యతకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం’’ అన్నారాయన. రూ.600–8,500 వరకు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment