tube
-
నీళ్లు తాగాలంటే భయం
షాపింగ్ మాల్స్ రంగురంగుల లైట్ల వెలుగు లో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ మాల్స్‌లో ఉద్యోగం చేసే సేల్స్‌గాళ్స్ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు చెరగకూడదు. ఇది ఆ ఉద్యోగ నియమం. దేహం ఎంత బాధిస్తున్నా సరే, నవ్వు మాయం కాకూడదు. కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. కొనుగోలుదారుల సేవ కోసం ఎప్పుడూ చురుగ్గా ఉండాలంటే కూర్చోకూడదు... ఇది ఎక్కడా రాయరు, కానీ ఇది కూడా ఒక నియమం. ఇంకా ఘోరం ఏమిటంటే... బాత్రూమ్కి ఎన్నిసార్లు వెళ్తున్నారనేది కూడా లెక్కలోకి వస్తుంటుంది. ఉదయం ఏడు గంటలకు ఇల్లు వదిలిన వాళ్లు రాత్రి ఎనిమిది వరకు షాపులోనే ఉండాలి. తిరిగి ఇల్లు చేరేటప్పటికి తొమ్మిదవుతుంది. దాదాపుగా సేల్స్గాళ్స్గా పని చేసే యువతులందరూ నీళ్లు తాగడం తగ్గిచేశారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండి తరచూ వెళ్లాల్సి ఉన్న ఓ మహిళ ఉద్యోగం పోతుందనే భయంతో ట్యూబ్ అమర్చుకుని ఉద్యోగం చేసింది. ఇది కేరళ రాష్ట్రం, కోళికోద్ జిల్లాలో చోటుచేసుకున్న దయనీయ స్థితి. ఈ దుస్థితికి మంగళం పాడిందో మహిళ. పేరు విజి పెన్‌కూట్టు. చైతన్యవంతమైన కేరళ రాష్ట్రంలో కూడా ఉద్యమిస్తే తప్ప శ్రామిక చట్టాలు అమలు కాలేదంటే ఆశ్చర్యమే. అయినా ఇది నిజం. యాభై రెండేళ్ల సామాజిక కార్యకర్త విజి పెన్‌కూట్టు మహిళల కోసం పోరాడింది. న్యాయం కోసం గళం విప్పింది. బాధిత మహిళలతోపాటు సానుభూతిపరులైన మహిళలు కూడా ఆమెతో కలిసి నడిచారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిదేళ్ల పోరాటం. ఎట్టకేలకు ప్రభుత్వం కళ్లు తెరిచింది. షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (అమెండ్మెంట్) యాక్ట్, 2018 చట్టాన్ని అమలులోకి తెచ్చింది. విజి పోరాటంతో అక్కడి ఉద్యోగినులకు సౌకర్యవంతమైన పనిగంటలు, పని ప్రదేశంలో కనీస సౌకర్యాల ఏర్పాటు సాధ్యమైంది. మన సమాజం ఆధునిక సమాజంగా మారింది. కానీ మెరుగైన సమాజంగా మారలేదింకా. అందుకే చట్టం కోసం కొన్ని పోరాటాలు, వాటి అమలు కోసం మరికొన్ని పోరాటాలు... తప్పడం లేదు. విజి పెన్‌కూట్టు వంటి సామాజిక కార్యకర్తలు తమ గళాలను వినిపించకా తప్పడం లేదు. -
ట్యూబ్స్ హబ్‌గా హైదరాబాద్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనాల టైర్లలో వాడే ట్యూబుల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తోంది. సైకిళ్లు మొదలు మైనింగ్‌లో ఉపయోగించే భారీ వాహనాల వరకూ అన్ని రకాల ట్యూబులూ ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. ముడి సరుకు విదేశాల నుంచి వస్తున్నప్పటికీ... మానవ వనరుల లభ్యత, మంచి పని వాతావరణం ఉండడంతో కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటిగా ఇక్కడ కార్యకలాపాలు ఆరంభించాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఇక్కడి ట్యూబులు ఎగుమతి అవుతున్నాయి. ట్యూబ్, టైర్ పరిశ్రమపై దిగుమతులు ప్రభావం లేకపోగా... మొత్తంగా భారత్‌లో తయారవుతున్న ట్యూబుల్లో హైదరాబాద్ కంపెనీల వాటా 25 శాతం పైగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నెలకు 5 కోట్ల ట్యూబులు... దేశవ్యాప్తంగా నెలకు సుమారు 5 కోట్ల ట్యూబులు తయారవుతున్నాయని సమాచారం. వ్యవస్థీకృత రంగంలో 55 శాతం మేర ఉత్పత్తి అవుతుండగా... ట్యూబుల పరిశ్రమలో సగం వాటా టూవీలర్లు, త్రీవీలర్లదే. ఉత్పత్తి పరంగా చూస్తే వ్యవస్థీకృత రంగంలో 38 శాతం, అవ్యవస్థీకృత రంగంలో 12 శాతం హైదరాబాద్ చుట్టుపక్కలున్న కంపెనీల్లో జరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. టాప్ కంపెనీలు మన్నికైన ట్యూబుల కోసం బ్యుటైల్ను (ఒక రకమైన సింథటిక్ రబ్బర్) ముడిపదార్థంగా వినియోగిస్తున్నాయని ‘న్యూమెక్స్’ ప్రమోటర్ రవిశంకర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. చిన్నాచితకా కంపెనీలు తక్కువ ధరలో వచ్చే సహజ రబ్బరుతో తయారు చేస్తున్నాయి. ట్యూబ్‌లెస్ టైర్ల వాడకం పెరుగుతుండడంతో ట్యూబ్ తయారీ కంపెనీలు భవిష్యత్‌పై ఆందోళగానే ఉన్నాయి. అయితే గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లతో ట్యూబ్‌లెస్ టైర్లలో గాలి తగ్గుతూ ఉంటుంది. దీంతో ట్యూబ్‌లెస్ టైర్లలోనూ కస్టమర్లు ట్యూబులను పెట్టుకుంటున్నారు. ఏటా 18 కోట్ల టైర్లు.. భారత్‌లో 41 టైర్ల తయారీ కంపెనీలు 62 ప్లాంట్లను నిర్వహిస్తున్నాయి. ఎంఆర్ఎఫ్, సియట్, అపోలో, బిర్లా, బ్రిడ్జ్‌స్టోన్, మిషెలిన్, టీవీఎస్, జేకే వంటి బ్రాండ్లు ప్రముఖంగా పోటీపడుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన న్యూమెక్స్ కూడా ఈ మార్కెట్లోకి ప్రవేశించింది. టూవీలర్లు, కార్లు, ట్రాక్టర్ల వంటి 30 విభాగాల్లో ఇవి టైర్లను తయారు చేస్తున్నాయి. 2017–18లో సుమారు 18 కోట్ల టైర్లు అమ్ముడయ్యాయి. దీన్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలది 53 శాతం వాటా. మొత్తం పరిశ్రమ విలువ రూ.53,000 కోట్లుంది. ఎగుమతులు రూ.10,000 కోట్లకు చేరువలో ఉన్నాయి. భారత టైర్లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో ఎగుమతులు మూడేళ్లుగా ఏటా 8–10 శాతం వృద్ధి నమోదు చేయనున్నాయి. దేశీయ పరిశ్రమ సైతం 2022 వరకు ఇదే స్థాయిలో వృద్ధి సాధిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చెబుతోంది. రానున్న అయిదేళ్లలో దేశంలో రూ.25,000 కోట్ల పెట్టుబడులు టైర్ల పరిశ్రమలో ఉంటాయని అంచనా వేసింది. పెరిగిన ధరలు.. క్రూడ్ ఆయిల్ ధర కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోంది. బ్యారెల్ ధర ప్రస్తుతం 80 డాలర్లు దాటింది. క్రూడ్ నుంచి వచ్చే కొన్ని ఉప ఉత్పాదనలు సింథటిక్ రబ్బర్ తయారీలో ముడి పదార్థంగా వాడతారు. దీంతో టైర్ల ధరలకు క్రూడ్‌తో ముడిపడి ఉంటుంది. మే మొదటి వారంలోనే టైర్ల ధరలు 3 శాతం వరకు పెరిగాయని సమాచారం. క్రూడ్ ధర అధికం అవుతుండడంతో జూలైలో టైర్ల ధరలను మరోసారి సవరించే అవకాశం ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
కొత్త టైర్ బ్రాండ్ ‘న్యూమెక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్లు, ట్యూబ్‌ల విపణిలోకి కొత్త బ్రాండ్ ‘న్యూమెక్స్’ ప్రవేశించింది. ఈ బ్రాండ్ కింద టూ వీలర్లు, త్రీ వీలర్లు, స్మాల్, లైట్ కమర్షియల్ వెహికల్స్, ఫామ్ ఎక్విప్మెంట్కు అవసరమైన వాహనాల టైర్లు, ట్యూబ్‌లను విక్రయిస్తారు. రెండేళ్ల సమగ్ర పరిశోధన అనంతరం మార్కెట్‌కు అవసరమైన ఉత్పాదనలను తీసుకొచ్చామని కంపెనీ ప్రమోటర్ కె.రవిశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. 65 రకాల టైర్లను తొలుత ప్రవేశపెట్టామన్నారు. ఈ ఉత్పాదనలతో 80 శాతం మార్కెట్‌ను కవర్ చేస్తున్నట్లవుతుందని తెలియజేశారు. ‘‘ఈ ఏడాది చివరి వరకూ పూర్తిగా హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లపైనే దృష్టి పెడతాం. వచ్చే ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో... ఆ తరువాతి సంవత్సరం దక్షిణ భారతంలో, ఆ తరవాత దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం’’ అని రవిశంకర్ వివరించారు. టైర్ల తయారీలో విశేష అనుభవం ఉన్న... ఎన్నో ప్రధాన బ్రాండ్లకు టైర్లను సరఫరా చేస్తున్న హైదరాబాదీ కంపెనీ ఒకటి న్యూమెక్స్కు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. కాగా, ఫుల్ సర్కిల్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లను న్యూమెక్స్ తెరుస్తోంది. జూన్ నాటికి 8 కేంద్రాలు హైదరాబాద్‌లో రానున్నాయని సహ ప్రమోటర్ సుప్రజ్ రెడ్డి తెలియజేశారు. స్టోర్లలో కస్టమర్లు వినూత్న అనుభూతికి లోనవుతారని చెప్పారు. భవిష్యత్తులో టైర్ల ఎగుమతులు చేపడతామన్నారు. ‘‘ప్రతి బ్రాండ్‌లోనూ చౌక, ప్రీమియం టైర్లున్నాయి. మేం ప్రీమియం విభాగంపైనే దృష్టి పెట్టాం. ఈ విభాగంలో మిగతా బ్రాండ్లతో పోలిస్తే మా టైర్ల ధరలు కొంత తక్కువే. డబ్బుకు తగ్గ విలువ ఇవ్వటంలో మేం మిగతా బ్రాండ్లకన్నా చాలా ముందుంటాం. ఎందుకంటే నాణ్యతకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం’’ అన్నారాయన. రూ.600–8,500 వరకు ఉన్నాయి. -
రబీ కష్టం..!
పిట్టలవానిపాలెం: రబీ రైతులకు నీటికష్టాలు మొదలయ్యాయి. రెండవ పంటగా సాగు చేసిన మినుము,పెసర పైర్లకు నీటి తడు లు ఇచ్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. పిట్టలవానిపాలెం మండలంలోని కోమలి, భవనంవారిపాలెం, సంగుపాలెం, కోడూరు గ్రామాల పరిధిలో దాదాపు ఆరు వేల ఎకరాల్లో సాగు చేసిన మినుము,పెసర పైర్లను ప్రస్తుతం నీటి ఎద్దడి పట్టిపీడిస్తోంది. కోమలి చానల్ ద్వారా సాగు నీరు రాకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టిపెట్టారు. అందుబాటులో ఉన్న కుంటలు, బీడు కాలువలు, చెరువుల నుంచి నీటిని ట్యూబుల ద్వారా పొలాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అదనపు ఖర్చు అవుతున్నట్టు వాపోతున్నారు. 1200 నుంచి 1500 అడుగుల పొడవు ఉండే ట్యూబులు ఏర్పాటు చేసుకొని ఆయిల్ ఇంజన్ల ద్వారా పొలాలకు నీరు పెట్టుకుంటున్నారు. దీనికోసం పైపులు,ఇంజన్ అద్దె, డీజిల్ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 10 రోజుల పాటు కోమలి చానల్ నుంచి సాగు నీటిని అందిస్తే అదనపు భారం తగ్గుతుందని అంటున్నారు. రైతుల అవసరాలను ఆసరా చేసుకొని ఆయిల్ ఇంజన్లు, ట్యూబు అద్దెలు పెంచేశారు. రైతులు ఖర్చుకు వెనుకాడకుండా పైరు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎకరాకు అదనపు ఖర్చులు ... ఒక్క నీటి తడికి ఇంజన్ అద్దె రూ.800, ట్యూబు 100 అడుగులు అద్దె రూ.50, డీజిల్ 5 నుంచి 10 లీటర్ల వరకు ఖర్చవుతోంది. రాత్రి సమయంలో నీటిని అందించేందుకు రైతుతో పాటు మరొకరి సహాయం అవసరమవు తోంది.