Tires
-
హైదరాబాద్: చాదర్ ఘాట్ లోని ఓ టైర్ల దుకాణంలో అగ్ని ప్రమాదం
-
సీఎం జగన్ చేతుల మీదుగా ‘ఏటీసీ టైర్స్’ ప్రారంభం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ సంస్థ యకహోమా గ్రూప్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు రూ.2,200 కోట్ల పెట్టుబడి అంచనాతో రెండు దశల్లో ఇది ఏర్పాటు కానుంది. తొలిదశలో రూ.1,384 కోట్లతో హఫ్ హైవే టైర్ల తయారీ యూనిట్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా టైర్ల ఉత్పత్తిని పరిశీలించిన ఏటీసీ నేటి నుంచి వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ ఆరు ఖండాల్లో 120కిపైగా దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఇప్పటికే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది, అచ్యుతాపురం యూనిట్ మూడోది. తొలి దశ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం రూ.816 కోట్లతో చేపట్టే రెండో దశ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. మొత్తం రెండు దశల్లో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. 8 యూనిట్లు.. మరో రూ.వెయ్యి కోట్లకుపైగా పెట్టుబడులు ఏటీసీ రెండో దశ విస్తరణతో పాటు మరో 8 యూనిట్ల నిర్మాణ పనులకు సంబంధించి కూడా సీఎం జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందులో ఏడు అచ్యుతాపురం సెజ్‌లోనే ఏర్పాటు కానుండగా ఒకటి పరవాడ ఫార్మాసిటీలో ఏర్పాటవుతోంది. మొత్తం ఎనిమిది యూనిట్ల ద్వారా రూ.1,002.53 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి రానుండగా 2,664 మందికి ఉపాధి లభించనుంది. వీటికి ప్రభుత్వం 250 ఎకరాలు కేటాయించింది. ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే హైదరాబాద్, పరవాడలలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేసిన ఈ సంస్థ పరవాడలో రూ.125 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్ స్థాపనకు ముందుకొచ్చింది. 8 కంపెనీల వివరాలు ఇవీ పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రత్యేక రసాయనాల ఉత్పత్తిలో పేరొందిన పిడిలైట్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.202 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్ తదితర ఉత్పత్తులను అచ్యుతాపురం సెజ్‌లో తయారు చేయనున్నారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా 380 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మేఘ ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కార్బొనేటెడ్ ఫ్రూట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్ బాటిల్స్ తదితర ఉత్పత్తుల బెవరేజెస్ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పనున్నారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో రూ.185.25 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు. ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రియల్ గ్యాసెస్ తయారీలో పేరొందిన ఈ సంస్థ దేశంలో ఇప్పటికే 38 తయారీ యూనిట్లను నెలకొల్పింది. రూ.145 కోట్ల పెట్టుబడితో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గాన్ తదితరాలను ఇక్కడ తయారు చేయనున్నారు. విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ లిమిటెడ్ అత్యాధునిక సాంకేతికతతో కూడిన వోల్టేజ్ సిరామిక్ ఇన్సులేటర్స్, పాలిమెరిక్ ఇన్సులేటర్ల తయారీలో పేరుగాంచిన ఈ కంపెనీ దాదాపు రూ.107.70 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటు చేయనుంది. సైనాప్టిక్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 81.75 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటుకు సిద్ధమైంది. స్టైరాక్స్ లైఫ్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియట్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ దాదాపు రూ. 87.77 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇషా రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కోక్, కోల్ స్క్రీనింగ్ కొరకు ఈ సంస్థ రూ.68.06 కోట్ల పెట్టుబడితో అచ్యుతాపురం సెజ్‌లో యూనిట్ నెలకొల్పనుంది. విశాఖపట్నం పెదగంట్యాడలో ఇప్పటికే కోక్, కోల్ స్క్రీనింగ్, గ్రేడింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. -
CM Jagan: సీఎం వైఎస్ జగన్‌తో 'ఏటీసీ టైర్స్' ప్రతినిధుల భేటీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏటీసీ టైర్స్ డైరెక్టర్ తోషియో ఫుజివారా, కంపెనీలు ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు. విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. ఆగస్టులో ఈ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏటీసీ టైర్స్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం వైఎస్ జగన్‌ను కంపెనీ డైరెక్టర్, ప్రతినిధులు ఆహ్వానించారు. ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తులు, ఉద్యోగాలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ఏటీసీ – ది యోకోహామా రబ్బర్ కో. లిమిటెడ్, జపాన్‌కు పూర్తిగా అనుబంధ సంస్థ. ఏటీసీ, ఏటీసీ అనుబంధ కంపెనీలు సంయుక్తంగా అలయెన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ)గా ఏర్పడ్డాయి. ఆఫ్ హైవే టైర్ల (ఓహెచ్‌టీ) వ్యాపారంలో ప్రపంచంలో ఏటీజీ ప్రముఖంగా పేరొందింది. 6 ఖండాల్లోని 120 దేశాలలో ఏటీజీ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఏటీసీ భారతదేశంలో రెండు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి తిరునెల్వేలి (తమిళనాడు), మరొకటి దహేజ్ (గుజరాత్). అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు, ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు. pic.twitter.com/RfxfRdFJPw — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 24, 2022 చదవండి: (ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం) విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ఈ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అచ్యుతాపురం ప్లాంట్‌లో చిన్న టైర్లు (ఏఎఫ్సీ సెగ్మెంట్), పెద్ద బయాస్ టైర్లు (అగ్రి మరియు కాన్స్), రేడియల్ టైర్లు (అగ్రి), రేడియల్ (ఓటీఆర్), బయాస్ టైర్, ఓటీఆర్ టైర్లు, ఫారెస్ట్రీ టైర్లు, సాలిడ్ టైర్లు వంటి ఉత్పత్తులు జరుగనున్నాయి. ఈ సమావేశంలో పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ప్రహ్లాద్ రెడ్డి, అంబరీష్ ఆర్ షిండే, పీఆర్ హెడ్ వైవీ. కృష్ణంరాజు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. చదవండి: (ఎల్లో మీడియా ఏడుపుపై మంత్రి బుగ్గన కౌంటర్) -
గన్‌తో బెదిరించి దోపిడీలు.. వాళ్ల టార్గెట్ తెలిస్తే ఆశ్చ ర్యపోతారు!
నాగోలు: టైర్ల లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి.. తుపాకితో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పహడీషరీఫ్ పోలీసులు, ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.44,77,760 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం..హర్యానా రాష్ట్రం, మేనాత్ జిల్లాకు చెందిన జంషీద్ ఖాన్, రహెల్ ఖాన్, ఆజాద్‌లు ముఠాగా ఏర్పడ్డారు. లోడ్ చేసిన కంటైనర్లతో వెళ్లే లారీలను దోచుకోవాలని పథకం వేశారు. జనవరి 18న అపోలో లారీ టైర్లు (220) దోచుకున్నారు. లిఫ్ట్ అడిగి..లారీలోకి ఎక్కి గన్‌తో బెదిరించి..డ్రైవర్, క్లీనర్‌ను కట్టివేసి టైర్లు చోరీ చేశారు. ఈ నెల 15వ తేదీన తమిళనాడు నుంచి బయలుదేరిన కంటైనర్ నుంచి మరో కంపెనీ టైర్లను ఇదే పద్ధతిలో చోచుకున్నారు. లిఫ్ట్ అడిగి కంటైనర్ ఎక్కిన వీరు...ఈ నెల 17న నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలోకి కంటైనర్ రాగానే జంషీద్ ఖాన్, రహీల్ ఖాన్లు క్లీనర్‌ను గన్‌తో బెదిరించి కంటైనర్‌ను రోడ్డు పక్కన ఆపి, డ్రైవర్, క్లీనర్లను తాడుతో కట్టి క్యాబిన్లో పడివేశారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, అఫ్రోజ్ ఆలీ ఖాన్ల సాయంతో కాటేదాన్‌లో ఉన్న కమల్ కబ్రా టైర్ల గోదాములో దోచుకున్న టైర్లను తక్కువ ధరకు అమ్మివేసి తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై కంటైనర్ వదిలేసి పారిపోయారు. కంటైనర్ రోడ్డుపై ఎక్కవ సేపు ఆగి ఉండడంతో స్థానికులు గమనించి లారీ క్యాబిన్లో కట్టిపడేసి ఉన్న డ్రైవర్, క్లీనర్లను రక్షించారు. లారీ డ్రైవర్ పహడీషరీష్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల ఆటకట్టించారు. జంషీద్ ఖాన్ ఇటీవల ఢిల్లీకి విమానంలో వెళ్తున్నట్లు పోలీసులు తెలుసుకుని అక్కడి పోలీస్‌లకు సమాచారం ఇచ్చి, సీఐఎస్ఎఫ్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. చోరీకి సహకరించిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, అఫ్రోజ్ అలీఖాన్, టైర్లు కొనుగోలు చేసిన కమల్ కబ్రాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 152 టైర్లు, రూ.20 వేల నగదు, కారు, బైకు, నాలుగు మొబైల్ ఫోన్లు, 8ఎంఎం లైవ్ రౌండ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రహీల్ ఖాన్, ఆజాద్‌ల కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీలు సన్‌ప్రీత్‌సింగ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
శరవేగంగా ఏటీజీ టైర్స్ నిర్మాణ పనులు
సాక్షి, అమరావతి: జపాన్‌కు చెందిన యొకహోమా గ్రూపు కంపెనీ అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) విశాఖలో ఏర్పాటుచేస్తున్న తయారీ యూనిట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్టణంలోని అచ్యుతాపురం సెజ్ వద్ద సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ నిర్మాణ పనులను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించారు. తొలుత రూ.1,250 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఏటీజీ ఈ మొత్తాన్ని రూ.2,500 కోట్లకు పెంచింది. ఇప్పటికే యూనిట్ ప్రధాన షెడ్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. 2023 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తొలిదశలో 36,750 టన్నుల రబ్బరు వినియోగ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, నిర్మాణ, అటవీ రంగాల్లో వినియోగించే భారీ యంత్రాల టైర్లను తయారు చేస్తారు. రెండు దశలు పూర్తయితే ఐదువేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో సగం మంది స్థానిక మహిళలకే అవకాశం కల్పిస్తామని ఏటీజీ అధికారులు తెలిపారు. దేశంలో మూడో ప్లాంట్ జపాన్‌కు చెందిన ఏటీజీకి దేశంలో ఇప్పటికే గుజరాత్‌లోని ధహేజ్లో, తమిళనాడులోని తిరువన్వేళిలో తయారీ యూనిట్లున్నాయి. విశాఖలో ఏర్పాటు చేస్తున్నది మూడో యూనిట్. ధహేజ్ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం 1.26 లక్షల టన్నులు కాగా 2,600 మందికి ఉపాధి కల్పిస్తోంది. తిరువన్వేళి యూనిట్ సామర్థ్యం 86,800 టన్నులు కాగా 2,300 మంది ఉపాధి పొందుతున్నారు. -
పాత టైర్లు కావవి.. ఆ దేశంలో అవిప్పుడు ‘బంగారమే’?
Nigerian Ifedolapo Runsewe Success story: దేశాలకు అతీతంగా అన్ని చోట్ల బంగారానికి విలువ ఉంది. మన దగ్గర పత్తిని తెల్లబంగారమని, బొగ్గుని నల్ల బంగారమని అంటుంటాం. కానీ నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్లు నల్ల బంగారంలా మారిపోయాయి. ఇప్పుడు వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నైజీరియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఇఫిడేలాపో రాన్‌సేవే అనే మహిళా ప్రిటెన్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రీసైకిలింగ్ కంపెనీని స్థాపించింది. రెండేళ కిందట కేవలం ఇద్దరు వ్యక్తులతో చిన్న షెడ్డులో ఈ కంపెనీ మొదలైంది. రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, డ్రైనేజీ కాలువల్లో పడి ఉన్న పాత టైర్లను సేకరించేవారు. వాటిని తమ రీసైకిలింగ్ ప్లాంట్‌కి తీసుకువచ్చి ప్రత్యేక పద్దతిలో కరిగించి పేవ్మెంట్ బ్రిక్స్‌గా తయారు చేశారు. రీసైకిలింగ్ పద్దతిలో తయారు చేసిన పేవ్మెంట్ బ్రిక్స్ క్వాలిటీ రోడ్లు, పార్కులు, పాఠశాల ఆవరణల్లో వీటికి వేసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించారు. అంతే దీంతో ఒక్కసారిగా ఆమె కంపెనీకి ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. పాత మెషినరీ స్థానంలో కొత్త మెషినరీ ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ స్థాయిలో బ్రిక్స్‌ను అందివ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండేళ్లలోనే నలుగురితో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 128 మందికి చేరుకుంది. పేవ్మెంట్ బిక్స్తో పాటు మరికొన్ని ఇతర ఉత్పత్తులు కూడా తయారు చేస్తోంది రాన్‌సేవే. ఈమె ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంటుకు పాత టైర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒక్కో టైరుకు 0.20 డాలర్లు (సుమారు రూ.15) చెల్లిస్తున్నారు. దీంతో కరోనా ఉపాధి కరువైన వారంతా పాత టైర్ల వేటలో పడ్డారు. ఎక్కడ టైరు కనిపించినా వాటిని పోగేసి ఈ ప్లాంటుకు తెస్తున్నారు. దీంతో రన్సువే సక్సెస్‌పై రాయిటర్స్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. పాత టైర్లు కావవి బ్లాక్‌గోల్డ్ అంటూ పేర్కొంది. In Nigeria, hundreds of thousands of tires which would otherwise be dumped across the country have emerged as a new ‘black gold.’ Entrepreneur Ifedolapo Runsewe is transforming old tires into paving bricks, tiles and other goods, creating an entire value chain around tires pic.twitter.com/raCRbFqTOV — Reuters Business (@ReutersBiz) November 15, 2021 -
ఈ టైర్లు అసలు పంక్చరే కావు..!
వాహనాలకు మరింత వేగాన్ని, స్టెబిలిటీని అందించడంలో టైర్లు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.సరియైన మోతాదులో టైర్లలో గాలి ఉంటే వాహనం ఎక్కువ పికప్‌ను అందుకుని వేగంగా వెళ్తుంది. సంప్రాదాయక టైర్లు ఎక్కువగా పంక్చర్ అవ్వడం చూసే ఉంటాం. వాటి స్థానంలో ట్యూబ్‌లెస్ టైర్లు మార్కెట్లలోకి వచ్చాయి. ట్యూబ్‌లెస్ టైర్లతో కాస్త ఉపశమనం కల్గిన అది కొంత సేపు వరకే మాత్రమే. ట్యూబ్‌లెస్ టైర్లు పంక్చర్ అయితే కొంత దూరం మేర వచ్చినా.. ఈ టైర్లు కచ్చితంగా పంక్చర్ ప్రూఫ్ మాత్రం కాదు. తిరిగి వాటికి పంక్చర్ చేయల్సిందే. పంక్చర్ ప్రూఫ్ టైర్ల కోసం అనేక కంపెనీలు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. పంక్చర్ ప్రూఫ్ టైర్లను అందించడంలో మిచెలిన్ సంస్థ ముందుంది. తాజాగా మిచెలిన్ పంక్చర్ ప్రూఫ్ టైర్లను టెస్ట్ చేసింది. చదవండి: వాహనదారులకు షాకింగ్ న్యూస్...! 3డీ ప్రింటింగ్‌తో...! 2005 నుంచి ప్రముఖ టైర్ల తయారీదారు మిచెలిన్ పంక్చర్ ప్రూఫ్ టైర్లపై పనిచేస్తోంది. ఒక దశాబ్దకాలంపాటు చేసిన పరిశోధనల ఫలితంగా మిచెలిన్ పంక్చర్ ఫ్రూఫ్ టైర్లను రియాల్టీలోకి తెచ్చింది. భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్ వాహనాలకు పంక్చర్ ప్రూఫ్ టైర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మిచెలిన్ భవిష్యత్తులో పర్యావరణానికి అనుకూలంగా ఉండే గ్రీన్ టైర్లను అందుబాటులోకి తీసుకురానుంది. యూనిక్ పంక్చర్‌ప్రూఫ్ టైర్ సిస్టమ్ ద్వారా ఎయిర్‌లెస్ టైర్, పంక్చర్ ప్రూఫ్ టైర్లను అందించనుంది. 3 డీ ప్రింటింగ్‌తో తయారుచేసిన టైర్లను మిచెలిన్ అందుబాటులోకి తీసుకురానుంది. ఫోటోకర్టసీ: మిచెలిన్ టైర్స్ మిచెలిన్ 2017లో పంక్చర్ ప్రూఫ్ టైర్ల వీడియోను టీజ్ చేసింది. కంపెనీ డెవలప్ చేసిన టైర్లు గ్లాస్ ఫైబర్ రీఈన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ తయారు చేయబడిన సౌకర్యవంతమైన లోడ్-బేరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇలాంటి టైర్లను మార్స్‌పైకి పంపిన రోవర్, క్యూరియాసిటీలో నాసా ఉపయోగించింది. ఈ టైర్లను 2024లోపు మార్కెట్లలోకి తీసురావాలని మిచెలిన్ భావిస్తోంది. తొలుత రీసైకిలింగ్ చేయబడిన టైర్లనుపయోగించి పంక్చర్ ప్రూఫ్ టైర్లను తయారు చేయనుంది. టైర్లతో పొంచి ఉన్న ముప్పు...! ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు బిలియన్లకు పైగా టైర్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ టైర్ల జీవితకాలం దాటిన తర్వాత, ఈ టైర్లను నిర్వీర్యం చేస్తారు. అందులో కొన్ని టైర్లను రీసైకిలింగ్ చేయగా.. మిగతావి వ్యర్థాలుగా మిగిలిపోనున్నాయి. కొన్ని సందర్భాల్లో వాడి పడేసిన టైర్లు అగ్నిప్రమాదాలకు గురై.. వాతావరణంలో విషపూరిత వాయువులను వెదజల్లే అవకాశం ఉంది. చదవండి: Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! -
టైర్లు కాల్చండి.. వానలొస్తాయ్!
పుణే: వర్షాలు కురవాలంటే వాహనాల టైర్లు, చెట్టు రెమ్మలు, ఉప్పు మండించాలని మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఇలాంటి చర్యలతో వాతావరణానికి తీరని నష్టం వాటిల్లుతుందని పర్యావరణవేత్తల ఆందోళనతో ఆయన వెనక్కి తగ్గారు. ఐఐటీ బాంబే పూర్వ పరిశోధకుడి సలహా మేరకు తాను ఈ విధంగా ఆదేశించినట్లు కలెక్టర్ రాజేంద్ర భోస్లే వివరణ ఇచ్చారు. ఈ సీజన్లో సోలాపూర్‌లో సగటు వర్షపాతంలో 35 శాతమే కురిసింది. కరువు తప్పదన్న ఆందోళనల నడుమ ఆయన ఈ వింత ఆదేశాలిచ్చారు. జిల్లాలోని సుమారు వేయి చోట్ల టైర్లు, చెట్లరెమ్మలు, ఉప్పు మండిస్తే 24–96 గంటల్లో వర్షపాతం కురుస్తుందని 11 మంది తహసీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. -
కొత్త టైర్ బ్రాండ్ ‘న్యూమెక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్లు, ట్యూబ్‌ల విపణిలోకి కొత్త బ్రాండ్ ‘న్యూమెక్స్’ ప్రవేశించింది. ఈ బ్రాండ్ కింద టూ వీలర్లు, త్రీ వీలర్లు, స్మాల్, లైట్ కమర్షియల్ వెహికల్స్, ఫామ్ ఎక్విప్మెంట్కు అవసరమైన వాహనాల టైర్లు, ట్యూబ్‌లను విక్రయిస్తారు. రెండేళ్ల సమగ్ర పరిశోధన అనంతరం మార్కెట్‌కు అవసరమైన ఉత్పాదనలను తీసుకొచ్చామని కంపెనీ ప్రమోటర్ కె.రవిశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. 65 రకాల టైర్లను తొలుత ప్రవేశపెట్టామన్నారు. ఈ ఉత్పాదనలతో 80 శాతం మార్కెట్‌ను కవర్ చేస్తున్నట్లవుతుందని తెలియజేశారు. ‘‘ఈ ఏడాది చివరి వరకూ పూర్తిగా హైదరాబాద్, సికింద్రాబాద్ మార్కెట్లపైనే దృష్టి పెడతాం. వచ్చే ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో... ఆ తరువాతి సంవత్సరం దక్షిణ భారతంలో, ఆ తరవాత దేశవ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం’’ అని రవిశంకర్ వివరించారు. టైర్ల తయారీలో విశేష అనుభవం ఉన్న... ఎన్నో ప్రధాన బ్రాండ్లకు టైర్లను సరఫరా చేస్తున్న హైదరాబాదీ కంపెనీ ఒకటి న్యూమెక్స్కు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. కాగా, ఫుల్ సర్కిల్ పేరుతో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లను న్యూమెక్స్ తెరుస్తోంది. జూన్ నాటికి 8 కేంద్రాలు హైదరాబాద్‌లో రానున్నాయని సహ ప్రమోటర్ సుప్రజ్ రెడ్డి తెలియజేశారు. స్టోర్లలో కస్టమర్లు వినూత్న అనుభూతికి లోనవుతారని చెప్పారు. భవిష్యత్తులో టైర్ల ఎగుమతులు చేపడతామన్నారు. ‘‘ప్రతి బ్రాండ్‌లోనూ చౌక, ప్రీమియం టైర్లున్నాయి. మేం ప్రీమియం విభాగంపైనే దృష్టి పెట్టాం. ఈ విభాగంలో మిగతా బ్రాండ్లతో పోలిస్తే మా టైర్ల ధరలు కొంత తక్కువే. డబ్బుకు తగ్గ విలువ ఇవ్వటంలో మేం మిగతా బ్రాండ్లకన్నా చాలా ముందుంటాం. ఎందుకంటే నాణ్యతకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం’’ అన్నారాయన. రూ.600–8,500 వరకు ఉన్నాయి. -
నిషేధానికి పొగ
పాడైన పాత టైర్లను పంక్చర్ దుకాణదారు వద్దనో.. లేదా టైర్లు మార్చిన మెకానిక్ వద్దనో వదిలేస్తాం. కానీ హైదరాబాద్‌కు చెందిన కొంతమంది వాటితోనే వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సేకరించిన పాత టైర్లను చిన్నశంకరంపేట మండల కేంద్రానికి తరలిస్తున్నారు. ఇక్కడి టైర్ల నుంచి అయిల్ తీసే మిల్ (ఈ తరహా పరిశ్రమలపై నిషేధం ఉంది)లో గానుగాడించేందుకు రాత్రికి రాత్రికి తెస్తున్నారు. ఇలా పరిశ్రమలో ఉడికించిన టైర్ల నుంచి వచ్చిన ఆయిల్‌ను గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీన్ని బీటీరోడ్డు కోసం వాడుతున్న తారులో కలిపి నాసిరకం తారు దందాను నడుపుతున్నారు. అనుమతులు లేని ఈ కంపెనీలో పచ్చని చెట్ల నుంచి సేకరించిన కలపను బట్టీల నిర్వహణకు వాడుతున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వం కాలుష్య కారక పరిశ్రమలపై వేటు వేసింది. అయినా చిన్నశంకరంపేట శివారులో అధికారుల కన్నుగప్పి గుట్ట చప్పుడు కాకుండ టైర్ల నుంచి ఆయిల్ తీసే పరిశ్రమలను నడుపుతున్నారు. పగలంత గప్‌చూప్‌గా ఉండేæ ఈ పరిశ్రమలు రాత్రయితే చాలు పని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ పాత టైర్ల నుంచి ఆయిల్ తీసి అక్రమ దందాను నడుపుతున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు కామారం శివారులోనూ ఈ రకమైన పరిశ్రమలున్నాయి. గతంలోనే టైర్లను ఉడికించి అయిల్ తీసే పరిశ్రమలు కాలుష్య కారకమైనవిగా గుర్తించి ప్రభుత్వం వాటిని నిషేధించింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ నిషేధిస్తు ఉత్తర్వులు ఇవ్వడంతో మూత పడ్డాయి. తాజాగా కొన్ని నెలలుగా ఈ వ్యాపారం మళ్లీ ప్రారంభించారు. టైర్లను రాత్రి సమయంలో ఉడికించి తీసిన అయిల్ను ట్యాంకర్ల ద్వారా రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. పగలంతా ఆ పరిశ్రమలకు తాళం వేసి ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో రాత్రి సమయంలో వదిలే కాలుష్య రసాయనలతో వాతవారణం చెడిపోతుంది. సమీప వ్యవసాయ పొలల్లో దుమ్మదూలి పేరుకుపోవడంతో పాటు బోర్లలోని నీరు సైతం కాలుషితం అవుతున్నాయి ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. హైదరాబాద్‌కు తరలింపు.. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన టైర్లను చిన్నశంకరంపేట శివారులోని గోడుగుమర్రి సమీపంలో ఉన్న టైర్ల కంపెనీలో ఉడికిస్తున్నారు. ఇలా ఉడికించగా టైరు డాంబర్ అయిల్‌గా మారిపోతుంది. దీంతో పాటు టైర్లలోని ఇనుప తీగలు కూడ బయటకు తీస్తున్నారు. ఈ అయిల్ను ట్యాంకులో నుంచి ట్యాంకర్‌లోకి తీసుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఇనుప తీగలను సైతం ఒక దగ్గర చేర్చి పాత ఇనుప సామను తరలించే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అక్రమ కలప నిలువ... నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఈ పరిశ్రమలలో టైర్లను ఉడికించడానికి బారీగా కలప అక్రమ నిల్వలను సేకరిస్తున్నారు. ఈ కలపతోనే బాయిలర్లను నడుపుతున్నారు. దీంతో మండలంలోని వృక్ష సంపద కూడా తగ్గిపోతోంది. దీని కోసం కలప వ్యాపారులను ప్రోత్సహిస్తూ అవసరమైన కలపను పరిశ్రమకు తెప్పించుకుంటున్నారు. గుట్టుగా జరుగుతోంది.. ఈ కంపెనీల్లో పని చేసే కూలీలు సైతం చత్తీస్‌గఢ్ నుంచి తీసుకువస్తున్నారు. వీరంతా రాత్రి పని చేసి, పగలంతా విశ్రాంతి తీసుకుంటారు. పరిశ్రమ పరిసరాల్లోనే వీళ్లకు అవసరమైన ఇళ్లను ఏర్పాటు చేశారు. వీరికి బయట ఎవరితోనూ సంబంధం లేకుండా అవసరమైన కిరాణం సమాను సైతం వారే సమకూర్చుతున్నారు. స్థానికంగా ఓ వ్యక్తి ఇదంతా మేనేజ్ చేస్తున్నప్పటికి టైర్లు తీసుకువచ్చేవారు కాని, డాంబ ర్ను తరలించేవారు కాని తనకు తెలియదని చెబుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దందా నడిపిస్తున్నాడని తెలిపాడు. రోజు కంపెని నడవదని, టైర్లు వచ్చినప్పుడు, మరో వైపు డంబర్ అయిల్ తీసుకుపోతారనుకున్నప్పుడే నడిపిస్తారని చెప్పాడు. -
నా పాలనలో ఎవరూ రోడ్డెక్కలేదు!: సీఎం
సాక్షి, తిరుపతి/చిత్తూరు/అమరావతి: తన పాలనలో ఎవ్వరూ రోడ్డు మీదకొచ్చి గొడవచెయ్యలేదని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం చిన్నపాండూరు వద్ద అపోలో టైర్స్ పరిశ్రమ నిర్మాణానికి సీఎం చంద్రబాబు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఆటోమొబైల్స్ రంగం ద్వారా రూ.24,600 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. రూ.6.80 లక్షల కోట్ల పెట్టుబడులతో 80.63 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పుకొచ్చారు. మచిలీపట్నం, దొనకొండ, విశాఖ, ఏర్పేడు వద్ద పరిశ్రమలు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినందుకు అపోలో టైర్స్ యాజమాన్యాన్ని అభినందించారు. మొదటి దశలో 270 ఎకరాల్లో రూ.1,800 కోట్ల పెట్టుబడులతో 700 మందికి ఉపాధి కల్పించనుందని చెప్పారు. అనంతరం అపోలో టైర్స్ చైర్మన్, వైస్ చైర్మన్ ఓంకార్ కన్వర్, నీరజ్ కన్వర్ ప్రసంగించారు. రానున్న 24 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. -
అగ్నిమాపక వాహనం బోల్తా
ఎర్రగుంట్ల: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉన్న ఏపీజెన్కో అగ్నిమాపక వాహనం బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో సిబ్బంది ఉపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ వాహనాన్ని వెనక్కు మళ్లిస్తుండగా అదుపు తప్పి అక్కడే ఉన్న గుంతలో వెనుక టైర్లు పడ్డాయని ఫైర్ అధికారి సత్యనారాయణ తెలిపారు. -
మార్కెట్లోకి మిచెలిన్ ఎక్స్గార్డ్ రేడియల్ టైర్లు
న్యూఢిల్లీ: భారత్ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన రేడియల్ ట్రక్ టైర్లను ‘ఎక్స్ గార్డ్’ పేరుతో మిచెలిన్ కంపెనీ గురువారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీర్ఘకాలం మన్నిక, ఇంధన ఆదా, మరింత దృఢంగా ఈ టైర్లు ఉంటాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. తనకున్న పెటెంట్ టెక్నాలజీ ఆధారంగా వీటిని తయారు చేసింది.