Tecno Camon 20 Series Smart Phones Launched In India, Check Price, Design And Specifications - Sakshi
Sakshi News home page

టెక్నో కామన్‌ 20 సిరీస్‌ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం!

Published Mon, May 29 2023 12:59 PM | Last Updated on Mon, May 29 2023 2:36 PM

tecno camon 20 series smart phones launched price and specs - Sakshi

చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో (Tecno) భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. టెక్నో కామన్‌ 20 (Tecno Camon 20) సిరీస్‌ పేరుతో మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. 

లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అపియరెన్స్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగిన టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేసింది. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్‌లో రావాల్సిన కామన్‌ 20 ప్రీమియర్‌ 5జీ (Camon 20 Premier 5G)ని మాత్రం ఇంకా ఆవిష్కరించలేదు. జూన్‌ నెలాఖరున ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

కాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టెక్నో కామన్‌ 20 సిరీస్‌ ఫోన్లలో కెమెరానే ప్రత్యేకతగా తెలుస్తోంది. ఈ కొత్త కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌లు అధునాతన పోర్ట్రెయిట్, వీడియో సామర్థ్యాలతో యూజర్లకు వినూత్న ఇమేజింగ్ అందిస్తాయని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో తెలిపారు.

 

అందుబాటు ధరలోనే..
టెక్నో కామన్‌ 20 16జీబీ ర్యామ్‌, 256 జీబీ రోమ్‌ వేరియంట్‌ ధర రూ.14,999. ప్రీడాన్‌ బ్లాక్‌, గ్లేసియర్‌ గ్లో, సెరెనిటీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. అమ్మకాలు మే 29 నుంచి ప్రారంభమవుతాయి.  టెక్నో కామన్‌ 20 ప్రో 16జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వర్షన్‌ ధర రూ.19,999. 16జీబీ ర్యామ్‌ 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.21,999. ఈ మోడళ్లు డార్క్‌ వెల్కిన్‌, సెరెనిటీ బ్లూ కలర్స్‌లో వస్తున్నాయి. జూన్‌ రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. 

డిజైన్, స్పెసిఫికేషన్లు

  • ప్రత్యేకమైన కామన్ పజిల్ డిజైన్‌
  • 6.67 అంగుళాల AMOLED డాట్ ఇన్ డిస్‌ప్లే, ఫుల్‌ HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్‌కు సపోర్ట్‌
  • 99.8 శాతం గుర్తింపు ఖచ్చితత్వం, 0.35 సెకన్ల వేగవంతమైన అన్‌లాక్‌తో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌
  • వనిల్లా కామన్ 20 వేరియంట్ మీడియాటెక్ హీలియో G85 చిప్‌సెట్‌తో పాటు ఆర్మ్ మాలి-G52 యూనిట్‌ సపోర్ట్‌
  • 8జీబీ ర్యామ్‌ (మెమొరీ ఫ్యూజన్‌తో 16జీబీ) 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 
  • ప్రో మోడల్‌లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ 256 జీబీ స్టోరేజ్
  • తక్కువ కాంతి పరిస్థితులలో సహాయపడే RGBW ప్రో టెక్నాలజీ, పోర్ట్రెయిట్ మాస్టర్, ఇన్-బాడీ స్టెబిలైజేషన్
  • సెన్సార్ షిఫ్ట్ OIS యాంటీ షేకింగ్ టెక్నాలజీ
  • కామన్‌ 20లో 64MP+2MP+AI లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
  • ప్రో వేరియంట్‌లో 64MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 4K వీడియో రికార్డింగ్‌
  • 45W వరకు ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 5000mAh బ్యాటరీ యూనిట్‌

ఇదీ చదవండి: లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్‌ అదుర్స్‌! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement