సాక్షి, ముంబై: ఎప్పటినుంచి వార్తల్లో నిలిచిన హ్యుందాయ్ కొత్త శాంట్రో కారు ఆకర్షణీయంగా వచ్చేసింది. బడ్జెట్ ధరలో కస్టమర్లకు ఆకట్టుకున్న బెస్ట్ కారును సరికొత్తగా విడుదల చేసింది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో అనే చెప్పాలి.అయితే ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును మార్కెట్‌నుంచి తొలగించింది. భారీ డిమాండ్ నేపథ్యంలో బ్రాండ్ న్యూ శాంట్రో కారును హ్యుందాయ్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది పెట్రోల్ వెర్షన్‌లో లభించనుంది. త్వరలోనే సీఎన్‌జీ వేరియంట్లలో కూడా లాంచ్ చేయనుంది. అక్టోబర్ 10 నుంచి ప్రిబుకింగ్‌కు లభ్యం. అలాగే లాంచింగ్ ఆఫర్‌గా మొదటి 50వేల కస్టమర్లకు 11,100 రూపాయలకే బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది.
హ్యుందాయ్ శాంట్రో ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో హ్యుందాయ్ శాంట్రో, పాత శాంట్రోతో పోలిస్తే కారు పొడవును, వీల్‌బేస్‌ను విస్తరించింది 1.1 లీటర్ కెపాసిటి నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 68 బిహెచ్‌పి పవర్, 99 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుంది. ఇది లీటర్‌కు సుమారుగా 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్‌ను జోడించామని, గంటలకు 150 కి.మీ వేగంతో దూసుకుపోతుందని వెల్లడించింది. మధ్య తరగతి కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త శాంట్రో ఇంటీరియర్‌ను కూడా అత్యాధునిక ఆకర్షణీయమైన హంగులతో తీర్చిదిద్దింది.
ధర. రూ. 3.7లక్షలు
Comments
Please login to add a commentAdd a comment