వ్యాపార రంగంలోకి బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ దీపికా | Deepika Padukone launches Self-Care Brand With the Name Of 82 E | Sakshi
Sakshi News home page

Deepika Padukone: వ్యాపార రంగంలోకి బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ దీపికా

Published Sat, Nov 12 2022 3:08 PM | Last Updated on Sat, Nov 12 2022 3:10 PM

Deepika Padukone launches Self-Care Brand With the Name Of 82 E - Sakshi

బాలీవుడ్‌లో దీపికా పదుకొణే అంటే పరిచయం అక్కర్లేని పేరు. 2007లో కెరీర్ ప్రారంభించిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన  ఉనికి చాటుకుంది. బి-టౌన్‌లో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటీనటుల్లో దీపికా ఒకరు. ఇకా ఆమె వెండితెర ఎంట్రీకి 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా తన సత్తా చాటింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా మెప్పించిన ఆమె.. తాజాగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆనందంలో దీపికా పదుకొణె తన సొంత బ్రాండ్‌ను లాంచ్ చేసింది.

చదవండి: హీరోతో అభ్యంతరకర సీన్‌.. నా తల్లిదండ్రులకు చెప్పే చేశా: హీరోయిన్‌

82 ఈస్ట్ అనే పేరుతో సెల్ఫ్ కేర్ బ్రాండ్‌ను ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ దీన్ని ప్రమోట్‌ చేస్తూ ఆమె వీడియో విడుదల చేసింది. ‘రెండేళ్ల క్రితమే సెల్ప్‌ కేర్‌ బ్రాండ్‌ను ప్రారంభించాలని అనుకున్నాం. ప్రస్తుతం దీన్ని మన దేశంలోనే లాంచ్‌ చేశాం. ఇక త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని పరిచయం చేస్తాం. ఇదే మా 82 ఈస్ట్‌’ అంటూ రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దీపికా నిర్మాతగా మారి పలు చిత్రాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపికా షారుక్‌ ఖాన్‌తో పఠాన్‌ చిత్రంతో పాటు పాన్‌ ఇండియా చిత్రం ప్రాజెక్ట్‌-కెలో హీరోయిన్‌గా చేస్తోంది. 

చదవండి: నా గ్లామర్‌ ఫొటోలు చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు: హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement