సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆదివారం విశ్రాంతి వీక్షణ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో అతి పెద్ద 'ఐకాన్ ఆఫ్ ది సీస్' షిప్ సముద్రం మీద ఉండటం చూడవచ్చు.
వీడియోను షేర్ చేస్తూ.. సండే విశ్రాంతిగా వీక్షించడం కోసం. ఇది 2026 వరకు బుక్ అయిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక జనాభాలో భారతీయులు ఒకరు. సొంత క్రూయిజ్ షిప్‌లను ఎక్కువగా డిమాండ్ చేస్తాము.. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఐకాన్ ఆఫ్ ది సీస్
ఐకాన్ ఆఫ్ ది సీస్ విషయానికి వస్తే.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్. ఇది రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కోసం నిర్మించబడినట్లు తెలుస్తోంది. దీని బరువు సుమారు 248663 టన్నులు. ఇందులోనే రిసార్ట్స్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇది టైటానిక్ షిప్ కంటే కూడా పరిమాణంలో ఐదు రెట్లు పెద్దగా ఉందని చెబుతారు. కాబట్టి దీన్ని 'సిటీ ఆఫ్ సీ' అని పిలుస్తారు.
For Sunday leisure viewing.
It’s booked till ‘26.
But Indians will be one of the two largest tourist populations in the world…
And we will most likely demand—and get—our own cruise ships… pic.twitter.com/IgxW4YhyWZ— anand mahindra (@anandmahindra) May 19, 2024
Comments
Please login to add a commentAdd a comment