భారత సైన్యం మరింత బలపడటానికి ఎప్పటికప్పుడు తగిన వాహనాలను ఫ్లీట్‌లో చేరుస్తూనే ఉంది. ఇటీవల 1850 మహీంద్రా స్కార్పియో వాహనాలకు ఆర్డర్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ తాజాగా టయోటా హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇండియన్ ఆర్మీలో ఇప్పటికే మారుతీ జిప్సీ, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారి స్టోర్మ్ (GS800), టాటా జెనాన్ పిక్-అప్‌ల వంటి వాహనాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ విభాగంలో టయోటా కంపెనీకి చెందిన హైలక్స్ పికప్ ట్రక్కులు చేరనున్నాయి. ఈ కార్లు ఆఫ్ రోడింగ్‌కి అనుకూలంగా ఉండటం వల్ల భారత సైన్యానికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..)
టయోటా హైలక్స్..
టయోటా హైలక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ కలిగి 204 హార్స్ పవర్ & 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇది మంచి వాటర్ వాడింగ్ కెపాసిటీ కూడా కలిగి ఉంటుంది. కావున అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి భారత సైన్యానికి మరింత బలం చేకూర్చుతాయని భావిస్తున్నాము.
Comments
Please login to add a commentAdd a comment