Toyota Cars
-
టయోటా క్యాంపర్ వ్యాన్: ఒకటే వెహికల్.. ఉపయోగాలెన్నో (ఫోటోలు)
-
ఇండియన్ ఆర్మీలోకి మొదటి సారి ఆ కార్లు!
భారత సైన్యం మరింత బలపడటానికి ఎప్పటికప్పుడు తగిన వాహనాలను ఫ్లీట్‌లో చేరుస్తూనే ఉంది. ఇటీవల 1850 మహీంద్రా స్కార్పియో వాహనాలకు ఆర్డర్ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ తాజాగా టయోటా హైలక్స్ పికప్ ట్రక్కులను డెలివరీ తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీలో ఇప్పటికే మారుతీ జిప్సీ, మహీంద్రా స్కార్పియో, టాటా సఫారి స్టోర్మ్ (GS800), టాటా జెనాన్ పిక్-అప్ల వంటి వాహనాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు ఈ విభాగంలో టయోటా కంపెనీకి చెందిన హైలక్స్ పికప్ ట్రక్కులు చేరనున్నాయి. ఈ కార్లు ఆఫ్ రోడింగ్‌కి అనుకూలంగా ఉండటం వల్ల భారత సైన్యానికి ఇవి చాలా అనుకూలంగా ఉంటాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) టయోటా హైలక్స్.. టయోటా హైలక్స్ అద్భుతమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ కలిగి 204 హార్స్ పవర్ & 420 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇది మంచి వాటర్ వాడింగ్ కెపాసిటీ కూడా కలిగి ఉంటుంది. కావున అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి భారత సైన్యానికి మరింత బలం చేకూర్చుతాయని భావిస్తున్నాము. -
ఈ టయోటా కారు కావాలన్నా కొనలేరు - ఎందుకంటే?
ఇండియన్ మార్కెట్లో టయోటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు 'FJ క్రూయిజర్ SUV'ని నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2006లో ప్రారంభమైన ఐకానిక్ ఎఫ్‌జే క్రూయిజర్ ఎట్టకేలకు మరుగునపడనుంది. 2022లో కూడా మిడిల్ ఈస్టర్న్ మార్కెట్లో అమ్ముడైన ఈ కారు గతంలో టయోటా 'ఫైనల్ ఎడిషన్' రూపంలో విడుదలైంది. ఇది కేవలం అప్పట్లో 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. ల్యాండ్ క్రూయిజర్ నుంచి ప్రేరణ పొందిన ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్యువి రెట్రో-థీమ్ స్టైలింగ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఉత్తర అమెరికా, జపాన్, మిడిల్ ఈస్ట్ వంటి అనేక దేశాల్లో విజయవంతంగా అమ్ముడైన ఈ కారు కనుమరుగు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: కొత్త మొబైల్ కొనాలకుంటున్నారా? వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్, ఇవే!) టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ బేజ్ ఎక్స్టీరియర్ షేడ్‌లో ఉంటే.. మిర్రర్స్, గ్రిల్, బాడీ క్లాడింగ్ వంటివి బ్లాక్ షేడ్‌లో ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా ఆకర్షణీయంగా ఉంది. సీట్లు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో, సెంటర్ కన్సోల్ ఇరువైపులా కూడా అదే కలర్ పొందింది. టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ 4.0 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 270 హెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రాల్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆఫ్-రోడ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) ప్రస్తుతం టయోటా భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, హైరిడర్, వెల్ఫైర్, హిలక్స్ పికప్, ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి వాటిని విక్రయమిస్తూ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని మంచి అమ్మకాలను పొందటానికి కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. -
వీల్స్ ఆన్ వెబ్: కార్ ఆన్లైన్లో ఆర్డర్ చేయండి.. ఇంటికొచ్చేస్తుంది!
ఇప్పటి వరకూ వివిధ రకాల వస్తువలు, దుస్తులు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వంటివి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో కార్లు ఆర్డర్ చేసే వెసులుబాటు వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల తన బెంగళూరు కస్టమర్ల కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ‘వీల్స్ ఆన్ వెబ్’ పేరిట ఆన్లైన్ రిటైల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు షోరూంలకు వెళ్లే పని లేకుండా హాయిగా ఇంటి వద్దే ఉండి తమకు ఇష్టమైన టయోటా మోడల్ కార్లను ఆర్డర్ చేయొచ్చు. ఇంటి వద్దే కార్ డెలివరీ పొందవచ్చు. పత్రికా ప్రకటన ద్వారా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ప్రకటించిన టయోటా సంస్థ ‘వీల్స్ ఆన్ వెబ్’ అనేది బిజినెస్ టు కస్టమర్ (B2C) ప్లాట్‌ఫామ్ అని తెలిపింది. డిజిటల్ స్పేస్‌లో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా ఈ ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా కార్ కొనుగోలు చేసేవారు కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు, కలర్లు, వేరియంట్ల ప్రత్యేకతలను డిజిటల్‌గా వీక్షించవచ్చు. యాక్సెసరీలు, సర్వీస్ ప్యాకేజీలు, ఎక్స్టెండెడ్ వారంటీ వంటి విలువ-ఆధారిత సేవలను కూడా ఆన్లైన్లోనే ఎంచుకోవచ్చు. టయోటా వీల్స్ ఆన్ వెబ్‌లో కస్టమర్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న పాత కార్లను సైతం ఎక్సేంజ్ కింద విక్రయించవచ్చు. ఇక్కడ వివిధ రకాల ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. బుకింగ్ అమౌంట్, పూర్తి మొత్తం లేదా డౌన్‌పేమెంట్‌ను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆన్లైన్ కార్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతి దశనూ వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. తాము కొత్తగా ప్రారంభించిన వీల్స్ ఆన్ వెబ్ ఆన్లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో కార్ల కొనుగోలు అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ పేర్కొన్నారు. -
హైక్రాస్ బుకింగ్స్ నిలిపివేసిన టాయోటా.. కారణం ఏంటంటే?
టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ఇన్నోవా హైక్రాస్ ZX & ZX (O) మోడళ్ల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే హైక్రాస్ మోడల్లో హైబ్రిడ్, గ్యాసోలిన్ మోడళ్ల బుకింగ్‌లను కొనసాగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. దేశీయ మార్కెట్లో గత ఏడాది చివరిలో విడుదలైన హైక్రాస్ మంచి బుకింగ్స్ పొందుతూ, అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఈ కొత్త MPV జి-ఎస్ఎల్ఎఫ్, జిఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్లకు మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ప్రస్తుతానికి బుకింగ్స్ నిలిపివేయడం జరిగింది. జెడ్ఎక్స్ కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు 2.5 సంవత్సరాలుగా ఉంది. ఇన్నోవా హైక్రాస్ ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండి వెనుక భాగంలో స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇది ఆధునిక డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో సంపన్న భారతీయుడు!) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులోని సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్‌ను పొందుతుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారం అందిస్తుంది. కొత్త హైక్రాస్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి 172 బిహెచ్పి పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 150 బిహెచ్పి, 187 బిహెచ్పి పవర్ అందిస్తుంది. ఈ రెండూ కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. -
2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లో తన '2023 ఇన్నోవా క్రిస్టా' (2023 Innova Crysta) విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు, వేరియంట్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు. వేరియంట్స్ & ధరలు: 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా G, GX, VX , ZX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 19.13 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధరలు రూ. 20.09 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త కారుని కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న ఇన్నోవా హైక్రాస్‌తో పాటు విక్రయించనున్నట్లు సమాచారం. ఎక్స్టీరియర్ డిజైన్: డిజైన్ విషయంలో ఇన్నోవా క్రిస్టా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని సూక్షమైన మార్పులు గమనించవచ్చు. ఇందులో ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ వంటివి పొందుతుంది. కానీ సైడ్ ప్రొఫైల్, రియర్ ఫ్రొఫైల్ మునుపటి మాదిరిగానే ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 ఇన్నోవా క్రిస్టా 7-సీటర్, 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. ఇందులో పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రెండవ వరుసకు వన్ టచ్ టంబుల్ వంటి ఫీచర్లు ఉంటాయి. అంతే కాకుండా ఇందులోని 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: బిలినీయర్‌గా మారిన రైతు కొడుకు.. రవి పిళ్ళై సక్సెస్ స్టోరీ!) పవర్‌ట్రెయిన్: గతంలో టయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టాలోని 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ నిలిపివేసింది. ఇది నిలిపివేయడానికి ముందు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు విడుదలైన లేటెస్ట్ ఇన్నోవా క్రిస్టా 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. (ఇదీ చదవండి: మహిళా.. ఇక భయమేల! నీ ఆలోచన ఇలా అమలు చేసేయ్..) సేఫ్టీ ఫీచర్స్: 2023 ఇన్నోవా క్రిస్టా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
టయోటా కార్లపై తగ్గని మోజు.. భారీగా పెరిగిన అమ్మకాలు!
టయోటా లగ్జరీ కార్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. వీఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతోపాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆ కంపెనీ కార్లను కొనడానికి ఇష్టపడతారు. అందుకే వాటి అమ్మకాలు భారీగా పెరిగాయి. తమ కార్ల అమ్మకాలు ఏడాదిలో 75 శాతం పెరిగి 2023 ఫిబ్రవరిలో 15,338 యూనిట్లకు చేరుకున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తాజాగా తెలియజేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ దేశీయ మార్కెట్లో 8,745 కార్లను విక్రయించింది. ‘మా ఉత్పత్తులపై కస్టమర్ల అమితమైన ఆసక్తి కొనసాగుతోంది. దీని ఫలితంగా 2023 ఫిబ్రవరిలో చాలా మంచి వృద్ధి నమోదైంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఒక ప్రకటనలో తెలిపారు. (ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) ఈ అమ్మకాల వృద్ధిలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ అగ్రగామిగా ఉన్నాయని, కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి తమ భాగస్వాములతో కలిసి మరింతగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభించిన టయోటా హిలక్స్ కోసం బుకింగ్‌లకు మంచి స్పందన వస్తోందని, దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. అలాగే గ్లాంజా, ఫార్చూనర్, లెజెండర్ వంటి వాటికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
మార్కెట్లోకి అదిరిపోయే టయోటా ఎస్యూవీ!
ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ శుక్రవారం కొత్త ఎస్యూవీ ‘అర్బన్ క్రూయిజర్ హైరైడర్’’ను ఆవిష్కరించింది. టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్సెట్లలో రూ. 25,000 చెల్లించి ముందుస్తు బుకింగ్ చేసుకోవచ్చు. వచ్చేనెలలో డెలివరీలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇందులో 1.5–లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ 5–స్పీడ్ మాన్యువల్ లేదా 6–స్పీడ్ ఆప్షనల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్–హోల్డ్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి. రియర్ ప్యాసింజర్ల కోసం సీట్‌బెల్ట్స్ సౌకర్యం ఉంది. దేశీయ మార్కెట్లోని టాటా సఫారీ, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ తదితర ఎస్‌యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది. -
టయోటా కార్లపై భారీ ఆఫర్లు
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టయోటా వినియోగదారులకు శుభవార్త అందించింది. వివిధ రకాల మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు ప్రకటించింది. పలు రకాల మోడళ్లపై డిస్కౌంట్‌తోపాటు నగదు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ప్రకటించింది. టయోటా గ్లాంజా, యూరిస్, అర్బన్ క్రూయిజర్ వంటి మోడళ్లపై ఈ ఆఫర్ల వర్తించనున్నాయి. కార్ల అమ్మకాలను పెంచడంలో భాగంగా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇన్నోవా క్రిస్టా, వెల్ఫైర్, ఫార్చ్యూనర్ మోడళ్లపై ఎటువంటి తగ్గింపులు లేవు. టయోటా గ్లాంజా అసలు ధర రూ.7.34 లక్షలు ఈ ఆఫర్ లో భాగంగా రూ.20 వేల వరకు వాహనంపై బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే, 8వేల రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇక అర్బన్ క్రూయిజర్ అసలు ధర రూ.8.62 లక్షలు అయితే, దీనిపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక చివరిగా యూరిస్ అసలు ధర రూ.9.16 లక్షలు అయితే, దీనిని 50 వేల రూపాయల వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.25 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. చదవండి: హోమ్ లోన్, వ్యక్తిగత రుణాల కోసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి? -
టయోటా, సుజుకీ జట్టు
టోక్యో: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం).. మరో వాహన కంపెనీ సుజుకీ మోటార్ కార్ప్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసమే పోటీ కంపెనీలో వాటాను కొనుగోలు చేసి జట్టుకట్టినట్లు వివరించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం.. సుజుకీ మోటార్ కార్ప్‌లో 4.9 శాతం వాటాను (908 డాలర్లు, జపాన్ కరెన్సీ విలువ పరంగా 96 బిలియన్ యెన్) టయోటా కైవసం చేసుకోనుంది. ఇదే క్రమంలో సుజుకీ, టయోటాలో 454 డాలర్లు (48 బిలియన్ యెన్) పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీలో ఉండే భారీ వ్యయాలను తట్టుకోవడం కోసం ఇరు సంస్థలు జట్టుకట్టాయి. 2017లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా.. సుజుకీ బలంగా ఉన్న భారత మార్కెట్లో రెండు సంస్థలు పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి. -
టయోటా కార్ల రేట్లు పెంపు
రూ. 13 వేల నుంచి రూ. 1.6 లక్షల దాకా పెరుగుదల న్యూఢిల్లీ: జీఎస్టీకి సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయం దృష్ట్యా తమ కార్లలో నిర్దిష్ట మోడల్స్ తాలూకు రేట్లను రూ.13,000 నుంచి రూ. 1.6 లక్షల దాకా పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) వెల్లడించింది. జీఎస్టీ కౌన్సిల్ మధ్య స్థాయి, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సును 2–7 శాతం మేర పెంచిన దరిమిలా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్నోవా క్రిస్టా ధర సుమారు రూ. 78,000, కరోలా ఆల్టిస్ రేటు రూ. 72,000, ఎతియోస్ ప్లాటినం ధర రూ. 13,000, ఫార్చూనర్ రూ. 1.6 లక్షల మేర పెంచినట్లు టీకేఎం డైరెక్టర్ ఎన్ రాజా తెలిపారు. చిన్న, హైబ్రీడ్ కార్ల ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సెస్సును పెంచడంతో మధ్య స్థాయి కార్లపై జీఎస్టీ రేటు మొత్తం మీద 45 శాతానికి, పెద్ద కార్లపై 48 శాతానికి, ఎస్‌యూవీలపై 50 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.