టయోటా లగ్జరీ కార్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. వీఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతోపాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆ కంపెనీ కార్లను కొనడానికి ఇష్టపడతారు. అందుకే వాటి అమ్మకాలు భారీగా పెరిగాయి. తమ కార్ల అమ్మకాలు ఏడాదిలో 75 శాతం పెరిగి 2023 ఫిబ్రవరిలో 15,338 యూనిట్లకు చేరుకున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తాజాగా తెలియజేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ దేశీయ మార్కెట్‌లో 8,745 కార్లను విక్రయించింది.
‘మా ఉత్పత్తులపై కస్టమర్ల అమితమైన ఆసక్తి కొనసాగుతోంది. దీని ఫలితంగా 2023 ఫిబ్రవరిలో చాలా మంచి వృద్ధి నమోదైంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఒక ప్రకటనలో తెలిపారు.
(ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!)
ఈ అమ్మకాల వృద్ధిలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ అగ్రగామిగా ఉన్నాయని, కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి తమ భాగస్వాములతో కలిసి మరింతగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభించిన టయోటా హిలక్స్ కోసం బుకింగ్‌లకు మంచి స్పందన వస్తోందని, దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. అలాగే గ్లాంజా, ఫార్చూనర్, లెజెండర్ వంటి వాటికి కూడా మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందన్నారు.
(ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!)
Comments
Please login to add a commentAdd a comment