త్వరలో ఆటో మొబైల్ మార్కెట్‌లో ట్రెండ్‌కు తగ్గట్లు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొనుగోలు దారుల అవసరాలకు అనుగుణంగా కార్ల మోడళ్లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల తయారీ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోట్రాఫిక్ రద్దీలో వాహనదారులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా మారుతి సుజుకీ మరిన్ని మోడళ్లలో ‘ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్)’ సిస్టంను అందుబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
ఏజీఎస్ సిస్టమ్ వల్ల డ్రైవర్‌గా గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కి బ్రేక్ వేయనవసరం లేదు. అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గేర్ మారుతూ ఉంటుంది. 2013-14లో సెలేరియోతో ఏజీఎస్ సిస్టమ్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి.. ఇప్పుడు ఆల్టో కే-10, వ్యాగనార్, డిజైర్, ఇగ్నిస్, బ్రెజా, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బాలెనో మోడల్ కార్లలో అమర్చింది. వచ్చే ఏడాదిలో ఈ లేటెస్ట్ టెక్నాలజీ కార్ల సేల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీవాత్సవ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎంట్రీ లెవల్ కారు మోడళ్లలో సాధారణ ట్రాన్స్‌మిషన్ లేదా ఏజీఎస్ వేరియంట్ కార్లలో తేడా కేవలం రూ.50 వేలు మాత్రమేనని అన్నారు. ఖర్చు తక్కువ కాబట్టే భవిష్యత్‌లో ఈ కార్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment