car sales in india
-
పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్యాసింజర్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయి. దాంతో రిటైల్ డీలర్ల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు పేరుకుపోతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా డీలర్ల వద్ద పోగైన వాహనాలు ఏకంగా 7 లక్షల యూనిట్లు. వీటి విలువ సుమారు రూ.73,000 కోట్లు ఉంటుందని అంచనా. పండగల సీజన్ రాబోతుండడంతో వీటిలో కొంతమేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయినా క్షేత్రస్థాయిలో ఈ కార్లకు భారీగా డిమాండ్ తగ్గినట్లు పేర్కొంది.ఫాడా తెలిపిన వివరాల ప్రకారం.. రిటైల్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) ప్యాసింజర్ కార్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్వెంటరీను అమ్మే సమయం అధికమైంది. జులై 2024 ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న ఇన్వెంటరీ క్లియరెన్స్ సమయం, ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగింది. దాంతో అమ్ముడవని వాహనాల సంఖ్య అధికమవుతోంది. ఈ వ్యవహారం డీలర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇన్వెంటరీ నిర్వహణ భారంగా మారుతోంది. దాంతో కొన్ని కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు నెలల విక్రయాలకు సమానమైన సుమారు 7 లక్షల యూనిట్ల వాహనాలు పోగయ్యాయి. ఇదిలాఉండగా, రానున్న పండగల సీజన్‌ల్లో విక్రయాలు పెరిగి కొంత ఊరట లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పెరుగుతున్న వాహనాల ఇన్వెంటరీ నేపథ్యంలో మారుతీసుజుకీ కంపెనీ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కంపెనీ అంచనాలకు తగిన అమ్మకాలు నమోదు కావడంలేదు. దాంతో ఇన్వెంటరీ నిర్వహణ భారమవుతుందని ఊహించి ఉత్పత్తిని తగ్గించింది. జులై 2024లో మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏడాది ప్రాతిపదికన 9.65% క్షీణత నమోదైంది.రిటైల్ మార్కెట్లో కార్ల ధరలో రాయితీ ఇచ్చి ప్రముఖ కంపెనీలు వాటి ఇన్వెంటరీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మునుపెన్నడూ లేనంతగా కార్ల ధర తగ్గిస్తున్నాయి. 2023 ఆగస్ట్‌తో పోలిస్తే ఈ సారి డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుందాయ్, టాటా మోటార్స్, స్కోడా, హోండా..వంటి ప్రముఖ కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానం.. కీలకాంశాలు..నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్టర్పై రూ.40,000, ఆల్కజార్‌పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్‌పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్‌పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి. -
వాహన అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా జూన్‌లో ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగా జరిగాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. మొత్తంగా ఈ జూన్‌లో 3,40,784 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,28,710 యూనిట్లతో ఇవి కేవలం 3.67 శాతం అధికం. మారుతీ సుజుకీ, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, కియా మోటార్స్ కంపెనీలు అమ్మకాల్లో వృద్ధిని కనబరిచాయి. టయోటా కిర్లోస్కర్ నెలవారీగా కంపెనీ చరిత్రలో అత్యధికంగా 27,474 వాహనాలకు విక్రయించింది. టాటా మోటార్స్, హోండా కార్స్, హ్యుందాయ్ మోటార్స్ అమ్మకాలు తగ్గాయి. ⇒ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం 21,68,512 వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 తొలి ఆరు నెలల్లో అమ్ముడైన 20,15,033 యూనిట్లతో పోలిస్తే ఇవి 7.6 శాతం అధికం. ఏప్రిల్ పండుగ సీజన్ డిమాండ్ తర్వాత మే, జూన్‌లో వాహన పరిశ్రమ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో క్షీణత చూసింది. సార్వత్రిక ఎన్నికలు, అధిక ఉష్ణోగ్రతలు ఇందుకు కారణాలు. గత రెండు నెలల్లో అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎంక్వెరీలు బలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో విక్రయాలు ఊపందుకునే వీలుంది.– పార్థో బెనర్జీ, మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ హెడ్ -
కొత్త కార్ల పరుగు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో ప్యాసింజర్ వాహన విక్రయాలు 41.08 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఇది 8.3 శాతం అధికం. గతేడాది నమోదైన రికార్డుతో 2024లోనూ అదే ఊపును కొనసాగించాలని ప్యాసింజర్ వాహన తయారీ సంస్థలు ఉవి్వళ్లూరుతున్నాయి. ఈ ఏడాది 100కుపైగా కొత్త మోడళ్లు, వేరియంట్లు రోడ్డెక్కనున్నట్టు మార్కెట్ వర్గాల సమాచారం. వీటిలో అత్యధికంగా ఎస్‌యూవీలు ఉండనున్నాయి. దీనికి కారణం ఏమంటే 2023లో అమ్ముడైన మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 49 శాతం ఉండడమే. అంతకుముందు ఏడాది వీటి వాటా 42 శాతం నమోదు కావడం గమనార్హం. 2024 కోసం తయారీ కంపెనీలు పోటాపోటీగా కొత్త మోడళ్ల రూపకల్పనలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో విజయవంతం అయిన మోడళ్లకు మరిన్ని హంగులు జోడించి ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. మెర్సిడెస్‌తో బోణీ.. ఈ ఏడాది మెర్సిడెస్ బెంజ్ తొలుత బోణీ చేయబోతోంది. జనవరి 8న ఈ కంపెనీ జీఎల్ఎస్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రవేశపెడుతోంది. కియా ఇండియా నుంచి నూతన సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ జనవరి 15న రాబోతోంది. ఆధునీకరించిన క్రెటా వేరియంట్‌ను జనవరి 16న విడుదలకు హ్యుందాయ్ రెడీ అయింది. మారుతీ సుజుకీ నుంచి కొత్త తరం స్విఫ్ట్ ఫిబ్రవరిలో అడుగుపెడుతోంది. మార్చిలో స్విఫ్ట్ డిజైర్ రోడ్డెక్కనుంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్యూవీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఏడు సీట్ల ఎస్యూవీ టైసర్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు టయోటా కసరత్తు ప్రారంభించింది. కొత్త ఫార్చూనర్ సైతం దూసుకుపోనుంది. హ్యుందాయ్ నుంచి క్రెటా ఎన్ లైన్, ఫేస్‌లిఫ్ట్ టక్సన్, ఆల్కజార్ సైతం రానున్నాయి. కొత్తతరం అమేజ్ విడుదలకు హోండా కార్స్ సన్నద్ధం అయింది. ఫోక్స్‌వేగన్, స్కోడా, నిస్సాన్, రెనో, సిట్రోయెన్ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను తేనున్నాయి. ఈవీలు సైతం మార్కెట్లోకి.. ఎలక్ట్రిక్ కార్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కంపెనీలు ఈ విభాగంలో నూతన మోడళ్లను తెచ్చే పనిలో ఉన్నాయి. హ్యారియర్ ఈవీని ఏప్రిల్‌లో తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక చేస్తోంది. 2024 చివరికల్లా టాటా కర్వ్ ఈవీ రానుంది. అలాగే టాటా పంచ్ ఈవీ సైతం పరుగుతీయనుంది. మారుతీ సుజుకీ నుంచి తొలి ఈవీ ఈ ఏడాది భారత రోడ్లపై అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. కియా ఈవీ9 పండుగల సీజన్లో రానుందని సమాచారం. -
2023లో భారీగా పెరిగిన కార్ సేల్స్ - ఆ కంపెనీ కార్లకే డిమాండ్!
భారతదేశంలో రోజు రోజుకి వాహన విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. 2022 కంటే కూడా 2023లో కార్ల అమ్మకాలు 8.3 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనల్లో వివరంగా తెలుసుకుందాం. 2023 లో చిన్న కార్ల అమ్మకాలతో పోలిస్తే ఎస్‌యూవీల అమ్మకాలు బాగా పెరిగాయి. మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి కంపెనీలు మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగాయి. 2022లో సగటున కారు ధర రూ.10.58 లక్షలు పలికితే 2023లో సరాసరి రూ.11.5 లక్షలకు పెరిగింది. మొత్తం అమ్మకాల్లో మారుతి సుజుకి హవా జోరుగా సాగింది. భారతీయ ప్యాసింజర్ వాహనాల పరిశ్రమ చరిత్రలో ఇదొక పెద్ద మైలురాయిగా భావిస్తున్నట్లు.. మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవస్తవ వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: ఈవీ రంగంలో అద్భుతం.. 1000 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ కార్ల అమ్మకాల్లో ఎస్‌యూవీల సేల్స్ 26 శాతం వృద్ధి చెందినట్లు సమాచారం. మొత్తం కార్ల విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 2022లో 42 శాతం ఉంటే.. 2023లో ఈ సంఖ్య 48.7 శాతానికి పెరిగింది. హ్యాచ్‌బ్యాక్ మోడల్ కార్ల అమ్మకాలు 34.8 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. 2023లో సెడాన్స్ విక్రయాలు 11 శాతం నుంచి 9.4 శాతానికి పతనం కాగా, మల్టీ పర్పస్ యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు యధాతథంగా 8.7 శాతం వద్ద కొనసాగాయి. దేశీయ విక్రయాలు మాత్రమే కాకుండా ఎగుమతుల సంఖ్య కూడా బాగా పెరిగింది. గత ఏడాది 2,69,046 యూనిట్లను ఎగుమతైనట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో 7.76 లక్షల కార్లు, ప్రీ-ఓన్డ్ కార్ల విక్రయాలు 4.68 లక్షల యూనిట్లుగా నిలిచాయి. -
మార్కెట్లో పెరిగిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 3,59,228 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9% వృద్ధి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రకారం.. తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన త్రిచక్ర వాహనాల సంఖ్య 2022 ఆగస్ట్‌తో పోలిస్తే గత నెలలో 38,369 నుంచి 64,763 యూనిట్లకు ఎగశాయి. టూ–వీలర్లు 15,57,429 నుంచి 15,66,594 యూనిట్లను తాకాయి. ప్యాసింజర్ వాహన విభాగంలో 16% వృద్ధితో మారుతీ సుజుకీ 1,56,114 యూనిట్ల విక్రయాలను సాధించింది. హుందాయ్ అమ్మకాలు 49,510 నుంచి 53,830 యూనిట్లకు చేరాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడీఏ) ప్రకారం గత నెల రిటైల్‌లో ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 7 శాతం దూసుకెళ్లి 3,15,153 యూనిట్లు నమోదయ్యాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ 11,80,230 నుంచి 12,54,444 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 66% ఎగసి 99,907 యూనిట్లుగా ఉన్నాయి. -
అమ్మకాల్లో అదరగొట్టిన ఎంజీ మోటార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా 2023 జనవరి–జూన్‌లో దేశవ్యాప్తంగా 29,000 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రంగ ప్రవేశం చేసిన హెక్టర్ తదుపరి తరం వేరియంట్‌తోపాటు జడ్ఎస్ ఈవీకి భారీ డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని వెల్లడించింది. కంపెనీ నుంచి అత్యధికంగా 2023 మార్చిలో 6,051 యూనిట్లు రోడ్డెక్కాయి. ఎంజీ మోటార్ ఇండియా భారత్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. హలోల్ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని ఈ ఏడాది 1.5 లక్షల యూనిట్లను చేర్చనుంది. ఈ ప్లాంటు విస్తరణకు రూ.820 కోట్లు వెచ్చిస్తోంది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. 2028 నాటికి దేశంలో కార్యకలాపాల విస్తరణకు రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తోంది. -
అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ రెనో.. భారత మార్కెట్లో 9 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది. 11 ఏళ్లలో ఈ ఘనతను సాధించామని కంపెనీ తెలిపింది. మేడ్ ఇన్ ఇండియా వాహనాల విక్రయాలను రెనో ఇండియా 2012లో భారత్‌లో ప్రారంభించింది. (ఇదీ చదవండి: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! రేపటి నుంచి పెరగనున్న ధరలు) ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ క్విడ్, కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్, మల్టీపర్పస్ వెహికిల్ ట్రైబర్ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ‘టాప్–5 మార్కెట్లలో గ్రూప్ రెనో సంస్థకు భారత్ ఒకటి. భారత్ కోసం స్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకున్నాము. బలమైన ఉత్పత్తి, ప్రణాళికను రూపొందించాము. భవిష్యత్తు ఉత్పత్తుల శ్రేణిలో స్థానికీకరణకు అధిక ప్రాధాన్యతనిచ్చాం’ అని రెనో ఇండియా ఆపరేషన్స్ సీఈవో, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి ఈ సందర్భంగా తెలిపారు. -
వాహన అమ్మకాలు రికార్డ్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో దేశీ వాహన రంగ దుమ్మురేపింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక అమ్మకాలను సాధించాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ 2022–23లో ఎగుమతులు, దేశీయంగా కలిపి మొత్తం 19,66,164 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది (2021–22)లో 16,52,653 యూనిట్లతో పోలిస్తే సేల్స్ 19 శాతం పెరిగాయి. హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు సైతం 18 శాతం ఎగబాకి 7,20,565 యూనిట్లుగా నమోదయ్యాయి. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఒక ఏడాదిలో సాధించిన అత్యధిక విక్రయాలు ఇవేనని హ్యుందాయ్ మోటార్ ఇండియా పేర్కొంది. టాటా మోటార్స్ దేశీయంగా గతేడాది 5,38,640 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 45 శాతం వృద్ధి చెందాయి. పరిశ్రమవ్యాప్తంగా... చిప్ కొరత కారణంగా ఉత్పత్తి కార్యకలాపాలపై ప్రభావం పడుతున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో తాము అత్యధిక విక్రయాలను సాధించామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహన పరిశ్రమ అమ్మకాలు 27 శాతం వృద్ధి చెంది 38.89 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపారు. 2021–22లో సేల్స్ 30.62 లక్షలు. రిటైల్‌గా, మొత్తం విక్రయాల పరంగా చూసినా గతేడాది పరిశ్రమ అత్యధిక అమ్మకాలను నమోదు చేసిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40–41 లక్షల అమ్మకాలను అంచనా వేస్తున్నామన్నారు. మార్చిలో చూస్తే... మారుతీ సుజుకీ మార్చి అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా సేల్స్ 3 శాతం తగ్గి 1,39,952 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ విక్రయాలు మాత్రం 13 శాతం ఎగబాకాయి. టాటా మోటార్స్ దేశీ అమ్మకాలు 3 శాతం పెరిగాయి. ద్విచక్రవాహన సంస్థలు హీరోమోటో, హోండా, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్ మెరుగైన విక్రయాలను నమోదు చేశాయి. -
SIAM Report: కనీవినీ ఎరుగని రీతిలో కార్ల అమ్మకాలు
భారతదేశంలో కార్లను వినియోగించేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది, ఈ కారణంగా రోడ్డుపైన తిరిగే కార్ల సంఖ్య కూడా తారా స్థాయికి చేరుకుంటోంది. మునుపటితో పోలిస్తే సొంతంగా కార్లను కలిగి ఉన్న వారు ఇప్పుడు చాలానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) అందించిన నివేదికల ప్రకారం, 2023 ఫిబ్రవరిలో మాత్రం సుమారు 2.92 లక్షల ప్యాసింజర్ వాహనాలు విక్రయించారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్యాసింజర్ వాహనాలకున్న డిమాండ్ ఇట్టే అర్దమైపోతోంది. నిజానికి గత నెలలో మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,91,928 యూనిట్లు. 2022లో విక్రయించబడ్డ 2,62,984 యూనిట్లతో పోలిస్తే ఈ అమ్మకాలు 11 శాతం పెరిగాయి. ఇందులో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (SUV) కూడా ఉన్నాయి. వ్యాన్ల అమ్మకాలు గత ఫిబ్రవరిలో 11,489 యూనిట్లు. మొత్తం అమ్మకాలలో మారుతి సుజుకి సేల్స్ 1,02,565 యూనిట్లు. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 99,398 యూనిట్లను విక్రయించి, 3 శాతం తగ్గుదలను నమోదు చేసింది. హ్యుందాయ్ కంపెనీ 24,493 యూనిట్లను విక్రయించి భారీ వృద్ధిని కైవసం చేసుకుంది. (ఇదీ చదవండి: టాటా కార్లు కొనేవారికి శుభవార్త.. ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, అంతకుమించిన బెనిఫీట్స్) ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2022లో 10,50,079 యూనిట్లు, కాగా 2023 ఫిబ్రవరిలో ఈ అమ్మకాలు 8 శాతం పెరిగి 11,29,661 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీ వీలర్ సేల్స్ కూడా 86 శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద దేశీయ మార్కెట్లో వాహన అమ్మకాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. -
టయోటా కార్లపై తగ్గని మోజు.. భారీగా పెరిగిన అమ్మకాలు!
టయోటా లగ్జరీ కార్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. వీఐపీలు, రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతోపాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆ కంపెనీ కార్లను కొనడానికి ఇష్టపడతారు. అందుకే వాటి అమ్మకాలు భారీగా పెరిగాయి. తమ కార్ల అమ్మకాలు ఏడాదిలో 75 శాతం పెరిగి 2023 ఫిబ్రవరిలో 15,338 యూనిట్లకు చేరుకున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తాజాగా తెలియజేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ దేశీయ మార్కెట్లో 8,745 కార్లను విక్రయించింది. ‘మా ఉత్పత్తులపై కస్టమర్ల అమితమైన ఆసక్తి కొనసాగుతోంది. దీని ఫలితంగా 2023 ఫిబ్రవరిలో చాలా మంచి వృద్ధి నమోదైంది’ అని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ ఒక ప్రకటనలో తెలిపారు. (ఇదీ చదవండి: సిమ్‌కార్డులతో పనిలేదు.. కొత్తగా ‘ఐ-సిమ్’ టెక్నాలజీ!) ఈ అమ్మకాల వృద్ధిలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ అగ్రగామిగా ఉన్నాయని, కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి తమ భాగస్వాములతో కలిసి మరింతగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రారంభించిన టయోటా హిలక్స్ కోసం బుకింగ్‌లకు మంచి స్పందన వస్తోందని, దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. అలాగే గ్లాంజా, ఫార్చూనర్, లెజెండర్ వంటి వాటికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. (ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!) -
సూపర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న అల్ట్రా లగ్జరీ కార్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్ట్రా లగ్జరీ కార్లు భారత్‌లో కనీవినీ ఎరుగని రీతిలో దూసుకెళ్తున్నాయి. లగ్జరీ కార్లకు మారుపేరైన రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్జిన్, లంబోర్గీని, ఫెరారీ, బెంట్లే, పోర్ష.. అన్నీ కూడా 2022లో అత్యధిక అమ్మకాలను సాధించాయి. భారత్‌లో ఈ కంపెనీలు అల్ టైమ్ హై విక్రయాలను గతేడాది నమోదు చేయడం గమనార్హం. 2023లో సైతం ఇదే స్థాయిలో సేల్స్ ఉంటాయని ధీమాగా ఉన్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో రెండేళ్లుగా విదేశీ టూర్లు వాయిదా వేసుకుని ఇంటికే పరిమితమైన బిలియనీర్లు, మిలియనీర్లు ఖరీదైన ఇళ్లు, వాహనాలను సమకూర్చుకుంటున్నారు. ‘కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. మహమ్మారి చాలా మందికి షాక్ ఇచ్చింది. ధనవంతులుగా చనిపోయే బదులు ధనవంతులుగా జీవించాలని అనుకుంటున్నారు’ అని ఒక డీలర్ వ్యాఖ్యానించారు. కొనడంలో తగ్గేదే లే.. యూఎస్, చైనాతో పోలిస్తే అల్ట్రా లగ్జరీ కార్ల విపణి భారత్‌లో స్వల్పమే. సంపన్నుల నుంచి వీటికి డిమాండ్ నేపథ్యంలో అమ్మకాల వేగం పెరిగింది. విదేశాల్లో లభిస్తున్న మోడళ్లను ఇక్కడి కస్టమర్లు కోరుకుంటున్నారు. లగ్జరీ కార్ల మార్కెట్లో రూ.2 కోట్లు ఆపైన ఖరీదు చేసే అల్ట్రా మోడళ్ల అమ్మకాలు 2022లో 450 యూనిట్లు. ఇప్పటి వరకు భారత్‌లో ఇదే అత్యధికం. 2021లో 300 యూనిట్లు రోడ్డెక్కాయి. అంటే గతేడాది ఈ మార్కెట్ 50 శాతం వృద్ధి సాధించింది అన్నమాట. ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య 30 శాతం వృద్ధితో 580 యూనిట్లు దాటుతుందని మార్కెట్ రిసర్చ్ కంపెనీ టెక్సీ రిసర్చ్ అంచనా. 2018లో భారత్‌లో 325 అల్ట్రా లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. బెంట్లే ఇటీవలే భారత్‌లో సరికొత్త బెంటేగా ఎక్స్టెండెడ్ వీల్‌బేస్ ఎస్యూవీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6 కోట్లు. సుంకాలే అడ్డంకి.. ‘అధిక దిగుమతి సుంకాలు, పన్నుల కారణంగా అల్ట్రా లగ్జరీ కార్లు భారత్‌లో అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే ఇటువంటి కారును కలిగి ఉండటం లగ్జరీ, ప్రతిష్ట అని భావించే వినియోగదారులను అధిక సుంకాలు, పన్నులు నిరోధించలేవు’ అని టెక్సీ డైరెక్టర్ కరన్ ఛేసి వ్యాఖ్యానించారు. ‘దేశంలో అల్ట్రా లగ్జరీ కార్ల విభాగం పెరుగుతోంది. అధిక దిగుమతి సుంకాలు మాత్రమే పరిశ్రమ వృద్ధికి అడ్డంకిగా ఉన్నాయి. క్రమంగా ప్రభుత్వం పన్నులను హేతుబద్ధం చేస్తుందని ఆశిస్తున్నాం. ఇది జరిగితే ఏటా 1,000 యూనిట్లను కూడా విక్రయించగలం’ అని భారత్‌లో బెంట్లే డీలర్ అయిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బగ్లా ధీమా వ్యక్తం చేశారు. ఒకదాన్ని మించి ఒకటి.. సూపర్ లగ్జరీ కార్ల విక్రయంలో ఉన్న కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి భారత్‌లో పోటీపడుతున్నాయి. 2007లో దేశీయ మార్కెట్లో 2007లో లంబోర్గీని ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు భారత్‌లో ఈ కంపెనీ 400 యూనిట్లు విక్రయించింది. గతేడాది 30 శాతం వృద్ధితో 92 లంబోర్గీని కార్లు రోడ్డెక్కాయి. ఈ కంపెనీ అమ్మకాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 25 శాతం ఉందట. 2023లో 100 యూనిట్ల మార్కును చేరుకుంటామని కంపెనీ ధీమాగా ఉంది. లంబోర్గీని కార్ల ఖరీదు రూ.3.8 కోట్లకుపైమాటే. 2022లో పోర్ష 64 శాతం అధికంగా 779 యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2014 నుంచి చూస్తే కంపెనీకి ఇదే అత్యధిక విక్రయాలు. 40 శాతంపైగా వృద్ధితో ఈ ఏడాది 60 యూనిట్ల స్థాయికి చేరుకోవాలని బెంట్లే లక్ష్యంగా చేసుకుంది. -
భవిష్యత్‌లో ఆ కార్లకే డిమాండ్.. వచ్చే ఏడాది పెరగనున్న సేల్స్!
త్వరలో ఆటో మొబైల్ మార్కెట్లో ట్రెండ్‌కు తగ్గట్లు మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొనుగోలు దారుల అవసరాలకు అనుగుణంగా కార్ల మోడళ్లలో కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కార్ల తయారీ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోట్రాఫిక్ రద్దీలో వాహనదారులు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేలా మారుతి సుజుకీ మరిన్ని మోడళ్లలో ‘ఆటో గేర్ షిఫ్ట్ (ఏజీఎస్)’ సిస్టంను అందుబాటులోకి తేనున్నట్లు ఆ సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. ఏజీఎస్ సిస్టమ్ వల్ల డ్రైవర్‌గా గేర్ మార్చాలంటే క్లచ్ నొక్కి బ్రేక్ వేయనవసరం లేదు. అవసరాన్ని బట్టి ఆటోమేటిక్ గేర్ మారుతూ ఉంటుంది. 2013-14లో సెలేరియోతో ఏజీఎస్ సిస్టమ్‌ను ప్రారంభించిన మారుతి సుజుకి.. ఇప్పుడు ఆల్టో కే-10, వ్యాగనార్, డిజైర్, ఇగ్నిస్, బ్రెజా, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, బాలెనో మోడల్ కార్లలో అమర్చింది. వచ్చే ఏడాదిలో ఈ లేటెస్ట్ టెక్నాలజీ కార్ల సేల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీవాత్సవ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంట్రీ లెవల్ కారు మోడళ్లలో సాధారణ ట్రాన్స్మిషన్ లేదా ఏజీఎస్ వేరియంట్ కార్లలో తేడా కేవలం రూ.50 వేలు మాత్రమేనని అన్నారు. ఖర్చు తక్కువ కాబట్టే భవిష్యత్‌లో ఈ కార్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. -
టాప్ గేర్ లో కార్ల అమ్మకాలు.. కారణం ఇదే..
-
సరికొత్త రికార్డ్..దుమ్మురేపుతున్న కియా కార్ల అమ్మకాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా గడిచిన మూడేళ్లలో దేశీయంగా 5 లక్షల యూనిట్ల అమ్మకాలతో కొత్త మైలురాయిని అధిగమించింది. తక్కువ కాలంలో ఈ ఘనతను సాధించిన కార్ల తయారీ కంపెనీ తామేనని కియా వెల్లడించింది. అలాగే గడిచిన నాలుగున్నర నెలల్లోనే ఒక లక్ష కార్లను విక్రయించినట్టు తెలిపింది. ఎగుమతులతో కలిపి ఈ మూడేళ్లలో కంపెనీ 6,34,224 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. సెల్టోస్ మోడల్‌దే ప్రధాన వాటాగా ఉంది. అంతర్జాతీయంగా కియా మొత్తం అమ్మకాల్లో భారత వాటా 6 శాతానికి పైగా ఎగసింది. ‘భారత్‌లో మూడేళ్లలో ట్రెండ్ సృష్టించాం. స్పూర్తిదాయక బ్రాండ్‌గా స్థిరపడటమేగాక నూతన సాంకేతికతలను స్వీకరించడంలో సైతం నాయకత్వం వహించాం’ అని కియా ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 339 నుంచి డిసెంబర్ నాటికి 400లకు చేర్చనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాలో కియా తయారీ కేంద్రం ఉంది. -
సోనెట్ జాదూ ‘కియా’ దూకుడు మామూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా భారతీయ అనుబంధ సంస్థ కియా ఇండియా విక్రయాల్లో దూసుకుపోతోంది. ఇండియాలో వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధిని సాధించింది. 2022, మే నెలలోనే 18,718 యూనిట్లను విక్రయించింది కియా ఇండియా. ఏప్రిల్ నెలలో 19,019 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే పోలిస్తే ఇది కొంచెం తక్కువ. ఈ ఏడాదిలో మే నెలకు సంబంధించిన గణాంకాలను బుధవారం విడుదల చేసింది. తాజా రికార్డు అమ్మకాలతో దేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కార్‌మేకర్ ఘనతను దక్కిచుకుంది. ఈ విక్రయాల్లో అత్యధికంగా అమ్ముడు పోయిన కారుగా సోనెట్ నిలిచింది. 7,899 యూనిట్లను, సెల్టోస్ 5,953 , కేరెన్స్ 4,612 , కార్నివాల్ 239 యూనిట్లను విక్రయించింది. కాగా దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీకార్ల సెగ్మెంట్లో 15 పూర్తి-ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనుంది. యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన పూర్తి-ఎలక్ట్రిక్, కియా ఈవీ6 మోడల్‌ను పరిచయం చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీబుకింగ్స్ ( మే 26, 2022) ఇండియాలో ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 97,796 యూనిట్లను విక్రయించింది.ఇది 19 శాతం పెరుగుదల. ముఖ్యంగా సోనెట్ లాంచ్ తర్వాత మొదటిసారిగా 1.5 లక్షల అమ్మకాలను సాధించిన సంస్థ గత నెలలో 4.5 లక్షల దేశీయ విక్రయాల మైలురాయిని అధిగమించింది. అంతేకాదు ప్రస్తుతం దేశంలో ఐదవ అత్యంత ప్రజాదరణ పొందిన ఆటోమొబైల్ బ్రాండ్‌గా నిలిచింది కియా ఇండియా. అనేక సవాళ్ల మధ్య అమ్మకాల జోరును కొనసాగించడం సంతోషంగా ఉందని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. రికార్డు టైంలో 4.5 లక్షల అమ్మకాలను సాధించాం. కియా బ్రాండ్‌పై భారతీయ కస్టమర్ల విశ్వాసాన్ని తెలియజేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు
ముంబై: పండుగ సీజన్ సెంటిమెంట్ కలిసిరావడంతో ఆగస్టులో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం,హోండా కంపెనీలు అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. చదవండి : ఫెస్టివల్ బొనాంజా ఆఫర్..సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు ఐదు శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,24,624 వాహనాలను విక్రయించింది. అయితే దేశీయ విక్రయాలు 6% తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమికండెక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ 12 శాతం వృద్ధిని సాధించి మొత్తం 59,068 వాహనాలను విక్రయించింది. గతేడాది ఆగస్టులో 35,420 యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్.., ఈ ఆగస్టులో 53 శాతం వృద్ధిని సాధించి 54,190 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. థార్, ఎక్స్‌యూవీ 300, బోలెరో నియో, బొలెరో పిక్–అప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చాయని ఎంఅండ్ఎం కంపెనీ సీఈఓ విజయ్ నాక్రా తెలిపారు. కియా మోటార్స్ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించి మొత్తం 16,750 యూనిట్ల అమ్మింది. గతేడాదిలో ఇదే నెలలో విక్రయాలు 10,845 యూనిట్లు. ‘‘ఆటో కంపెనీలు పండుగ సీజన్‌ను స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి బుక్సింగ్ మరింత పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతున్న వేళ డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను అందుబాటులో ఉంచడం ఆటో పరిశ్రమకు సవాలుగా మారవచ్చు’’ అని నిస్సాన్ మోటార్ ఎండీ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. -
2 లక్షల కార్ల సేల్, ఎక్కువగా అమ్ముడైన కార్ ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా కంపెనీ కియా భారత్‌లో రెండు లక్షల సెల్టోస్ కార్లను విక్రయించినట్టు ప్రకటించింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్లలో 1.5 లక్షల యూనిట్ల కనెక్టెడ్ కార్లను అమ్మినట్టు వివరించింది. ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల పైచిలుకు కార్లు దేశంలోని కస్టమర్లకు చేరాయని తెలిపింది. సెల్టోస్ ఎస్యూవీ అమ్మకాల్లో టాప్ వేరియంట్ల వాటా 58%, ఆటోమేటిక్ ఆప్షన్ 35% ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్ 45% వాటా కైవసం చేసుకుంది. -
ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్ధేశించిన తదుపరి దశ ఉద్గార నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తే.. తయారీ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి వస్తుందని మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ స్పష్టం చేశారు.ఇదే జరిగితే అమ్మకాలు మరింత పడిపోతాయని,పరిశ్రమ ఇప్పటికే తీవ్ర మందగమనంలో కొట్టుమిట్టాడుతోందని గుర్తుచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ధరలు గణనీయంగా పెరగడంతో ప్రజలు కొత్త కార్లను కొనడం కష్టంగా ఉందని అన్నారు. ‘కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫీషియెన్సీ (సీఏఎఫ్ఈ) ప్రమాణాల అమలుకు ఇది సరైన సమయం కాదని నా అభిప్రాయం. పరిశ్రమ వృద్ధి సున్నా స్థాయికి వచ్చింది. కరోనా మహమ్మారి వేళ ప్రజల ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో కార్ల ధర ఇంకాస్త అధికమైతే పరిశ్రమ మరింత దిగజారుతుంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలకు కార్లను కొనే స్తోమత తగ్గింది’ అని పేర్కొన్నారు. బీఎస్–6 ఉద్గార నిబంధనలలో పొందుపరిచిన సీఏఎఫ్ఈ రెండవ దశ ప్రమాణాలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి. అమలు తేదీని 2024 ఏప్రిల్ 1 తేదీకి వాయిదా వేయాల్సిందిగా సియామ్ సైతం ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించింది. సీఏఎఫ్ఈ లక్ష్యాలను చేరుకోవడానికి వాహన సంస్థలు సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిందే. చదవండి: గుజరాత్లో జర్మన్ బ్యాంక్, పెట్టుబడి ఎన్నివేల కోట్లంటే?! -
భారీగా పెరిగిన వాహన విక్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో అమ్మకాలు లేక డీలా పడిన భారత ఆటో పరిశ్రమ తిరిగి గాడినపడుతోంది. గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు పడిపోతున్న క్రమంలో జులైలో 14,64,133 ప్రయాణీకుల వాహన విక్రయాలు జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో వాహన విక్రయాలు 30 శాతం అధికమని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) గణాంకాలు వెల్లడించింది. జూన్‌లో 11,19,048 యూనిట్ల విక్రయాలు సాగాయని ఎస్ఐఏఎం తెలిపింది. అయితే గత ఏడాది జులైతో పోలిస్తే తాజా అమ్మకాలు భారీగా పడిపోయాయి. చదవండి : కరోనా భయం.. కారే నయం! గత ఏడాది జులైలో దేశంలో 17,01,832 వాహన అమ్మకాలు నమోదయ్యాయి. కోవిడ్-19 నేపథ్యంలో గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు భారీగా పడిపోగా జులైలో ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్రవాహన విక్రయాలు పుంజుకోవడం పరిశ్రమ రికవరీకి సంకేతమని ఎస్ఐఏఎం అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. కాగా బీఎండబ్ల్యూ మెర్సిడెస్, టాటా మోటార్స్, వోల్వో ఆటో వంటి బ్రాండ్స్ అమ్మకాల వివరాలు అందుబాటులో లేనందున వాటి వివరాలు ఈ గణాంకాల్లో కలుపలేదని ఎస్‌ఐఏఏం తెలిపింది. ఇక ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే జులైలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 26 శాతం పెరగడం ప్రోత్సాహకరమని ఎస్ఐఏఎం పేర్కొంది. ఇక కార్ల విక్రయాలు అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో 73 శాతం ఎగబాకాయని వెల్లడించింది. -
మారుతి కార్ల విక్రయాలు డౌన్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమన భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.1 శాతం పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 1,48,682 కార్లను విక్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1,48,682 యూనిట్ల అమ్మకాలు జరిగాయని మారుతి సుజుకి ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీ కార్ల విక్రయాలు గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 1.6 శాతం తగ్గాయని..అల్టో, వాగనార్, వంటి మినీ కార్ల విక్రయాలు మాత్రం 11.1 శాతం పెరగడం గమనార్హం. ఇక స్విఫ్ట్, బలేనో, ఇగ్నిస్, డిజైర్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్లో అమ్మకాలు 3.9 శాతం తగ్గుదల నమోదైంది. ఇక విటారా బ్రెజా, ఎస్ క్రాస్, ఎర్టిగా సేల్స్ గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.5 శాతం మేర పెరిగాయని కంపెనీ తెలిపింది. మరోవైపు ఫిబ్రవరిలో ఎగుమతులు 7.1 శాతం వృద్ధి నమోదు చేశాయని మారుతి సుజుకి వెల్లడించింది. చదవండి : కొత్త ఇంజీన్‌తో ఆకర్షణీయంగా మారుతి ఇగ్నిస్ -
‘యువత ఓలా, ఉబర్‌లనే ఎంచుకుంటున్నారు’
చెన్నై : ఆధునిక యువత కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, ఓలా..ఉబర్ క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మిలీనియల్స్ క్యాబ్‌లకే మొగ్గుచూపడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని చెప్పారు.కార్లు, ద్విచక్రవాహన విక్రయాలు ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలసిందే. ఆటోమొబైల్ రంగంలో సంక్షోభాన్ని సమర్ధంగా చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. భారత్ 6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతో పాటు యువత ఎక్కువగా క్యాబ్‌లు, మెట్రో రైళ్లపై ఆధారపడటంతో కూడా ఆటోమొబైల్ రంగంలో సమస్యలు ఎదురవుతున్నాయని వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆటో సంక్షోభం సమసిపోయేందుకు ప్రభుత్వం అన్ని రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందని, ఢిల్లీయే కాకుండా దేశవ్యాప్తంగా సమాచారం క్రోడీకరిస్తోందని తెలిపారు. -
పండుగ సీజన్‌పైనే భారీ ఆశలు
సాక్షి, న్యూఢిల్లీ : కార్ల విక్రయాలు వరుసగా పడిపోతుండటం ఆర్థిక వ్యవస్థ దురవస్థపై గుబులు రేపుతోంది. వడ్డీ రేట్లు తగ్గించినా, కార్ల ధరలు తగ్గించి ఆఫర్లు అందిస్తున్నా ప్రయాణీకుల వాహన విక్రయాలు నేలచూపులు చూస్తుండటం విధాన నిర్ణేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆర్థిక మందగమనానికి సంకేతాలుగా భావిస్తున్న ఆటోమొబైల్ సేల్స్ ఆగస్ట్‌లోనూ దారుణంగా పడిపోయాయి. వాహనాల విక్రయాలు ఇటీవల మందకొడిగా సాగుతున్న క్రమంలో విడుదలైన తాజా గణాంకాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్ట్‌లో మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్, హోండా కార్స్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం కంపెనీల వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని ఈ గణాంకాలు వెల్లడించాయి. పండుగ సీజన్ అయినా అమ్మకాల్లో ఊపును తీసుకువస్తుందని ఆటోమొబైల్ సంస్థలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. గత ఏడాది ఆగస్ట్‌లో మారుతి సుజుకి అన్ని మోడల్స్ కలుపుకుని 1,45,895 వాహనాలను విక్రయించగా ఈ ఏడాది ఆగస్ట్‌లో విక్రయించిన వాహనాల సంఖ్య ఏకంగా 31 శాతం పతనమై 93,173 వాహనాలుగా నిలిచింది. హ్యుండాయ్ మోటార్స్ గత ఏడాది ఆగస్ట్‌లో మొత్తం 45,801 వాహనాలు విక్రయించగా ఇప్పుడు వాటి సంఖ్య 38,205 వాహనాలకు పరిమితమైంది. హోండా కార్స్ గత ఏడాది ఆగస్ట్‌లో 17,020 యూనిట్లను విక్రయించగా ఈ ఏడాది ఆగస్ట్‌లో వాహన విక్రయాల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. ఇక ఎంఅండ్ఎం గడిచిన ఏడాది ఆగస్ట్‌లో 19,578 యూనిట్లను విక్రయించగా ఈ ఆగస్ట్‌లో వాటి సంఖ్య 13,507కు పతనమైంది. మరోవైపు కియా మోటార్స్, ఎంజీ (మోరీస్ గ్యారేజెస్) వంటి నూతన ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలు కొంతమేర ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కియా మోటార్స్ ఆగస్ట్ 22న తన వాహనాన్ని లాంఛ్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆగస్ట్‌లో 6200 సెల్టోలు అమ్ముడవడం గమనార్హం. ఎంజీ మోటార్ సైతం ఆగస్ట్‌లో 2018 హెక్టార్ వాహనాలను విక్రయించింది. ఆటో సేల్స్‌లో మందగమనంతో ఆటోమొబైల్ కంపెనీలన్నీ పండగ సీజన్‌పై ఆశలు పెంచుకున్నాయి. -
టాప్ 10లో ఏడు కార్లు మారుతివే!
జూలై నెలలో కార్ల అమ్మకాలు మంచి జోరుమీద సాగాయి. ప్రధానంగా వర్షాలు బాగా కురవడంతో ఈ అమ్మకాలు పెరిగాయని అంటున్నారు. మొత్తం అమ్మకాల్లో మారుతి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. బాగా అమ్ముడైన టాప్ 10 కార్ల బ్రాండ్లలో ఏడు మారుతివే కావడం గమనార్హం. దాని ప్రధాన పోటీదారు హ్యుందయ్ కార్స్ కూడా గత నెల అమ్మకాల్లో 12.9 శాతం వృద్ధి సాధించింది. మారుతి, హ్యుందయ్లతో పాటు క్విడ్ అమ్మకాల పుణ్యమాని ఫ్రెంచి కార్ల కంపెనీ రెనో కూడా టాప్ 10 జాబితాలో చోటు సంపాదించింది. మారుతి ఆల్టో, డిజైర్, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ బ్రాండ్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. మారుతి కార్లలో మంచి ఆదరణ పొందిన ఆల్టో బ్రాండ్ ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఐదో స్థానంలో హ్యుందయ్ గ్రాండ్ ఐ10 ఉండగా, ఆరో స్థానంలో రెనో క్విండ్ నిలిచింది. మారుతి బాలెనో, హ్యుందయ్ ఇలైట్ ఐ20 బ్రాండ్లు మాత్రం ఏడు, ఎనిమిది స్థానాలకు పరిమితం అయ్యాయి. మారుతి సెలెరియో, సియాజ్ బ్రాండ్లు 9, 10 స్థానాల్లో ఉన్నాయి. టాటా టియాగో అమ్మకాలు కూడా బాగానే ఉన్నా.. అది 11వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జూలైలో వివిధ బ్రాండ్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.. ఆల్టో - 19,844 డిజైర్ - 19,229 వ్యాగన్ ఆర్- 15,207 స్విఫ్ట్ - 13,934 గ్రాండ్ ఐ10- 11,961 క్విడ్ - 9,897 బాలెనో- 9,120 ఇలైట్ ఐ20 - 8,205 సెలెరియో- 7,792 సియాజ్ - 5,162