సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమన భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.1 శాతం పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 1,48,682 కార్లను విక్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 1,48,682 యూనిట్ల అమ్మకాలు జరిగాయని మారుతి సుజుకి ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశీ కార్ల విక్రయాలు గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 1.6 శాతం తగ్గాయని..అల్టో, వాగనార్, వంటి మినీ కార్ల విక్రయాలు మాత్రం 11.1 శాతం పెరగడం గమనార్హం. ఇక స్విఫ్ట్, బలేనో, ఇగ్నిస్, డిజైర్ వంటి కాంపాక్ట్ సెగ్మెంట్‌లో అమ్మకాలు 3.9 శాతం తగ్గుదల నమోదైంది. ఇక విటారా బ్రెజా, ఎస్ క్రాస్, ఎర్టిగా సేల్స్ గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.5 శాతం మేర పెరిగాయని కంపెనీ తెలిపింది. మరోవైపు ఫిబ్రవరిలో ఎగుమతులు 7.1 శాతం వృద్ధి నమోదు చేశాయని మారుతి సుజుకి వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment