న్యూఢిల్లీ: దేశంలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా జూన్‌లో ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగా జరిగాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదైంది. మొత్తంగా ఈ జూన్‌లో 3,40,784 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,28,710 యూనిట్లతో ఇవి కేవలం 3.67 శాతం అధికం. మారుతీ సుజుకీ, మహీంద్రాఅండ్‌మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, కియా మోటార్స్ కంపెనీలు అమ్మకాల్లో వృద్ధిని కనబరిచాయి. టయోటా కిర్లోస్కర్ నెలవారీగా కంపెనీ చరిత్రలో అత్యధికంగా 27,474 వాహనాలకు విక్రయించింది. టాటా మోటార్స్, హోండా కార్స్, హ్యుందాయ్ మోటార్స్ అమ్మకాలు తగ్గాయి.
⇒ఈ ఏడాది ప్రథమార్థంలో మొత్తం 21,68,512 వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 తొలి ఆరు నెలల్లో అమ్ముడైన 20,15,033 యూనిట్లతో పోలిస్తే ఇవి 7.6 శాతం అధికం.
ఏప్రిల్ పండుగ సీజన్ డిమాండ్ తర్వాత మే, జూన్‌లో వాహన పరిశ్రమ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో క్షీణత చూసింది. సార్వత్రిక ఎన్నికలు, అధిక ఉష్ణోగ్రతలు ఇందుకు కారణాలు. గత రెండు నెలల్లో అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఎంక్వెరీలు బలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో విక్రయాలు ఊపందుకునే వీలుంది.
– పార్థో బెనర్జీ, మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment