
చెన్నై : ఆధునిక యువత కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, ఓలా..ఉబర్ క్యాబ్స్‌ను ఆశ్రయిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మిలీనియల్స్ క్యాబ్‌లకే మొగ్గుచూపడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని చెప్పారు.కార్లు, ద్విచక్రవాహన విక్రయాలు ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలసిందే. ఆటోమొబైల్ రంగంలో సంక్షోభాన్ని సమర్ధంగా చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. భారత్ 6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతో పాటు యువత ఎక్కువగా క్యాబ్‌లు, మెట్రో రైళ్లపై ఆధారపడటంతో కూడా ఆటోమొబైల్ రంగంలో సమస్యలు ఎదురవుతున్నాయని వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆటో సంక్షోభం సమసిపోయేందుకు ప్రభుత్వం అన్ని రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందని, ఢిల్లీయే కాకుండా దేశవ్యాప్తంగా సమాచారం క్రోడీకరిస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment