2023 Toyota Innova Crysta Launched in India - Sakshi
Sakshi News home page

భార‌త్‌లో 2023 టయోట ఇన్నోవా క్రిస్టా లాంచ్ - ధర ఎంతో తెలుసా?

Published Mon, Mar 20 2023 1:48 PM | Last Updated on Mon, Mar 20 2023 2:13 PM

2023 toyota innova crysta details in telugu - Sakshi

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లో తన '2023 ఇన్నోవా క్రిస్టా' (2023 Innova Crysta) విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు, వేరియంట్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు.

వేరియంట్స్ & ధరలు:

2023 టయోటా ఇన్నోవా క్రిస్టా G, GX, VX , ZX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 19.13 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధరలు రూ. 20.09 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త కారుని కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న ఇన్నోవా హైక్రాస్‌తో పాటు విక్రయించనున్నట్లు సమాచారం.

ఎక్స్టీరియర్ డిజైన్:

డిజైన్ విషయంలో ఇన్నోవా క్రిస్టా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని సూక్షమైన మార్పులు గమనించవచ్చు. ఇందులో ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ వంటివి పొందుతుంది. కానీ సైడ్ ప్రొఫైల్, రియర్ ఫ్రొఫైల్ మునుపటి మాదిరిగానే ఉంటాయి.

ఇంటీరియర్ ఫీచర్స్:

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 ఇన్నోవా క్రిస్టా 7-సీటర్, 8-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. ఇందులో పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రెండవ వరుసకు వన్ టచ్ టంబుల్ వంటి ఫీచర్లు ఉంటాయి. అంతే కాకుండా ఇందులోని 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

(ఇదీ చదవండి: బిలినీయర్‌గా మారిన రైతు కొడుకు.. రవి పిళ్ళై సక్సెస్ స్టోరీ!

పవర్‌ట్రెయిన్‌:

గతంలో టయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టాలోని 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్‌ నిలిపివేసింది. ఇది నిలిపివేయడానికి ముందు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు విడుదలైన లేటెస్ట్ ఇన్నోవా క్రిస్టా 2.4-లీటర్ డీజిల్ ఇంజన్‌ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

(ఇదీ చదవండి: మహిళా.. ఇక భయమేల! నీ ఆలోచన ఇలా అమలు చేసేయ్..

సేఫ్టీ ఫీచర్స్:

2023 ఇన్నోవా క్రిస్టా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్‌ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement