టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ఇన్నోవా హైక్రాస్ ZX & ZX (O) మోడళ్ల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే హైక్రాస్ మోడల్‌లో హైబ్రిడ్, గ్యాసోలిన్ మోడళ్ల బుకింగ్‌లను కొనసాగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
దేశీయ మార్కెట్లో గత ఏడాది చివరిలో విడుదలైన హైక్రాస్ మంచి బుకింగ్స్ పొందుతూ, అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఈ కొత్త MPV జి-ఎస్ఎల్ఎఫ్, జిఎక్స్, విఎక్స్, జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో టాప్ వేరియంట్లకు మాత్రమే ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల ప్రస్తుతానికి బుకింగ్స్ నిలిపివేయడం జరిగింది. జెడ్ఎక్స్ కోసం వెయిటింగ్ పీరియడ్ సుమారు 2.5 సంవత్సరాలుగా ఉంది.
ఇన్నోవా హైక్రాస్ ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉండి వెనుక భాగంలో స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇది ఆధునిక డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది.
(ఇదీ చదవండి: చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో సంపన్న భారతీయుడు!)
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని 10.1 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులోని సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చిన్న 4.2 ఇంచెస్ MID స్క్రీన్‌ను పొందుతుంది. ఇది వాహనం గురించి చాలా సమాచారం అందిస్తుంది.
కొత్త హైక్రాస్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి 172 బిహెచ్‌పి పవర్, 205 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే సమయంలో ఇందులోని 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి, 187 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ రెండూ కూడా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది కేవలం 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కొత్త ఇన్నోవా హైక్రాస్ 21.1 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులో అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment