Toyota Rumion: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కంపెనీ త్వరలోనే కొత్త 'రూమియన్' (Rumion) అనే కొత్త ఎమ్‌పివి విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఈ కారు త్వరలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టానికి సిద్ధంగా ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మారుతి ఎర్టిగా బేస్డ్ రూమియన్ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 2021 ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో విడుదలైన ఈ కారు 2023 సెప్టెంబర్ నాటికి భారతీయ గడ్డపై అడుగుపెట్టనుంది. దీని కోసం కంపెనీ ట్రేడ్‌మార్క్‌ను కూడా దాఖలు చేసింది.
ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, వెల్‌ఫైర్ విభాగంలో రూమియన్ నాల్గవ మోడల్ అవుతుంది. త్వరలోనే టయోటా వెల్‌ఫైర్ ఆధునిక అప్డేట్స్ అందుకునే అవకాశం ఉంది. ఈ కొత్త MPV డిజైన్ దాదాపు ఎర్టిగా మాదిరిగా ఉంటుందని సమాచారం. ఇంటీరియర్ కూడా దాదాపు ఆ మోడల్ మాదిరిగానే ఉండవచ్చు.
(ఇదీ చదవండి: నారాయణ మూర్తి లాంటి భర్తకు భార్యగా ఉండటం అంత ఈజీ కాదు!)
ఇంజిన్ పరంగా.. రూమియన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 103 హార్స్ పవర్, 137 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభించనుంది. ఇది CNG వేరియంట్‌లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 2023 సెప్టెంబర్ నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment