Toyota Innova Crysta
-
2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా దేశీయ మార్కెట్లో తన '2023 ఇన్నోవా క్రిస్టా' (2023 Innova Crysta) విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ డిజైన్ ఏంటి, ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ధరలు, వేరియంట్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూడవచ్చు. వేరియంట్స్ & ధరలు: 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా G, GX, VX , ZX అనే నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 19.13 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధరలు రూ. 20.09 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త కారుని కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న ఇన్నోవా హైక్రాస్‌తో పాటు విక్రయించనున్నట్లు సమాచారం. ఎక్స్టీరియర్ డిజైన్: డిజైన్ విషయంలో ఇన్నోవా క్రిస్టా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ కొన్ని సూక్షమైన మార్పులు గమనించవచ్చు. ఇందులో ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ వంటివి పొందుతుంది. కానీ సైడ్ ప్రొఫైల్, రియర్ ఫ్రొఫైల్ మునుపటి మాదిరిగానే ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 ఇన్నోవా క్రిస్టా 7-సీటర్, 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. ఇందులో పవర్డ్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, రెండవ వరుసకు వన్ టచ్ టంబుల్ వంటి ఫీచర్లు ఉంటాయి. అంతే కాకుండా ఇందులోని 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. (ఇదీ చదవండి: బిలినీయర్‌గా మారిన రైతు కొడుకు.. రవి పిళ్ళై సక్సెస్ స్టోరీ!) పవర్‌ట్రెయిన్: గతంలో టయోటా కంపెనీ ఇన్నోవా క్రిస్టాలోని 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ నిలిపివేసింది. ఇది నిలిపివేయడానికి ముందు 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు విడుదలైన లేటెస్ట్ ఇన్నోవా క్రిస్టా 2.4-లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. (ఇదీ చదవండి: మహిళా.. ఇక భయమేల! నీ ఆలోచన ఇలా అమలు చేసేయ్..) సేఫ్టీ ఫీచర్స్: 2023 ఇన్నోవా క్రిస్టా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
సరికొత్త హంగులతో టయోటా ఇన్నోవా..!
Toyota Innova Crysta Limited Edition Launched: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ సరికొత్త హంగులతో ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇన్నోవా క్రిస్టా మోడల్ భారత్ మార్కెట్లలో అధికంగా సేల్ ఐనా ఎమ్‌పీవీ(మల్టీపుల్ పర్పస్ వెహికిల్)గా ప్రజాదరణ పొందింది. ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ ధర ఎక్స్‌షోరూంలో పెట్రోల్ వేరియంట్ ధర రూ.17.18–18.59 లక్షల మధ్య ఉండగా, డీజిల్ వేరియంట్స్ రూ.18.99–20.35 లక్షల కు అందుబాటులో ఉండనుంది. ఇన్నోవా క్రిస్టా లిమిడెట్ ఎడిషన్ మోడల్ 7-సీటింగ్, 8-సీటింగ్ వేరింయట్స్తో అందుబాటులో ఉండనుంది. ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటో హెడ్ ల్యాప్స్, ఆటో క్లైమట్ కంట్రోల్, సెవన్ ఎయిర్‌బ్యాగ్స్ అందుబాటులో ఉండనున్నాయి. భారత్‌లో టయోటా 2005 నుంచి సుమారు 9 లక్షలకు పైగా ఇన్నోవా కార్లను సేల్ చేసింది. చదవండి: అదృష్టం అంటే వీళ్లదే..! పెట్టుబడి రూ.లక్ష..సంపాదన కోటి రూపాయలు కొత్త ఫీచర్స్ ఇవే...! ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్‌లో.. 360 డిగ్రీ కెమెరా, మల్టీ టెరేయిన్ మానిటర్, హెడ్ అప్ డిస్ప్లే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్లెస్ చార్జర్, డోర్ ఎడ్జ్ లైటింగ్ విత్ 16 కలర్ ఆప్షన్స్, ఎయిర్ అయోనైజర్ వంటి హంగులను ఇన్నోవా క్రిస్టాలో టయోటా జోడించింది. ఇంజిన్ విషయానికి వస్తే..! ఇన్నోవా క్రిస్టా లిమిటెడ్ ఎడిషన్ 2.7 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ 164బీహెచ్పీ వద్ద గరిష్టంగా 245ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. 2.4 లీటర్ డిజీల్ ఇంజిన్ వేరియంట్ 148బీహెచ్పీ వద్ద గరిష్టంగా 343ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. చదవండి: మరో అరుదైన ఫీట్‌కు సిద్ధమైన రిషబ్ పంత్..! దినేష్ కార్తీక్ సరసన...! -
రాస్ మహోత్సవ్ : లక్కీ విన్నర్లకు టయోటా, మారుతీ
ప్రతేడాది కృష్ణుడి దైవిక ప్రేమ ఇతివృత్తం ఆధారంగా నిర్వహించే రాస్ మహోత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని సందర్శించే భక్తులను తిరిగి లగ్జరీ కారులో ఇంటికి పంపించనున్నారు. కేవలం మెర్సి సీఎల్ఏ 200 మాత్రమే కాక, లక్కీ విన్నర్లకు టయోటా ఇన్నోవా క్రిస్టా లేదా మహింద్రా ఎక్స్‌యూవీ 500, మారుతీ విటారా బ్రిజా లేదా 11 ఇతర బ్రాండుల్లో ఒక మోడల్‌ను దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అస్సాం బార్పేట జిల్లాలో ఈ మహోత్సవం జరుగుతోంది. ఈ మహోత్సవంలో ఈ కంటెస్ట్ ఒక అంతర్గత భాగం. లక్కీ విన్నర్లకు ఇక కార్లను బహుమతిగా ఇస్తుంటారు. ఈ సారి 1.8 లక్షల టిక్కెట్లను ఆఫర్ చేశారు. గతేడాది కంటే 20వేలు ఎక్కువని రాస్ లాటరీ కమిటీ సెక్రటరీ వివేక్ తలాక్‌దార్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఫెస్టివల్ నవంబర్ 17 వరకు జరుగనుంది. లాటరీ విజేతలను చివరి రోజు ప్రకటించనున్నారు. గతేడాది తొలి బహుమతి ఓ పేద వ్యవసాయదారుడు సొంతం చేసుకున్నారు. ఈ విధానంలో ఎంతో ఆసక్తికర అంశం లాటరీ కూపన్ ధర 100 రూపాయలు. ప్రారంభ ఏడాదిలో తొలి బహుమతి కింద మారుతీ 800 అందించారు. ఈ ఫెస్టివల్‌కు వారం ముందు టిక్కెట్లను విక్రయిస్తారు. 15 రోజులకు కార్లను ప్రదర్శిస్తారు. కొంతమంది వ్యక్తులు కేవలం కార్లను చూడటానికే వస్తారు. కౌంటర్లలో వీటి టిక్కెట్లను విక్రయిస్తారు. ఈ ఏడాది కారు ధర రూ.1.20 కోట్ల వరకు ఉంది. ఈ మహోత్సవానికి ప్రతేడాది సుమారు 30 లక్షల మంది భక్తులు విచ్చేస్తుండగా.. 2016లో ఆఖరి రోజు 5 లక్షల మంది భక్తులు పోటెత్తారు. -
దూసుకెళుతున్న టయోటా ఇన్నోవా 'క్రిస్టా'
హైదరాబాద్ : జపనీస్ ఆటో మొబైల్ సంస్థ టయోటా తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఇన్నోవా 'క్రిస్టా' బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు 18వేలకు పైగా బుకింగ్ లు నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. మార్కెట్లో అందుబాటులో ఉన్నఇన్నోవా మోడళ్ల కంటే తక్కువ ధరకే ఈ కొత్త క్రిస్టాను వినియోగదారుల ముందుకు తీసుకురావడంతో బుకింగ్స్ వెల్లువ కొనసాగుతోంది. వినియోగదారులు ఈ కొత్త క్రిస్టాల్ పై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని.. టాప్ ఎండ్ వెర్షన్ ఎక్కువ డిమాండ్ పలుకుతుందని టయోటా కంపెనీ పేర్కొంది. రూ.13.48 లక్షల నుంచి రూ.20.78లక్షలకు మధ్యలో ఈ కారును ఎక్స్ షోరూం ముంబాయిలో ఉంచినట్టు కంపెనీ చెప్పింది. ప్రస్తుతం టయోటా ఇన్నోవాకు చెందిన వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలుగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు టయోటా తెలిపింది. భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన అనతి కాలంలోనే ఈ వాహనానికి అధిక డిమాండ్ పలుకుతుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ అకితో టాచిబాన అన్నారు. ఇప్పటికే టయోటా కంపెనీకి ఉన్న కస్టమర్లపై ఎక్కువగా దృష్టిపెట్టడంతో పాటు, పోటీని తట్టుకుని నిలబడే శక్తిపై శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించారు. భారత్ నుంచి కేవలం వాహనాలను మాత్రమే ఎగుమతులు చేసుకోమని, నిపుణులను కూడా ఎగుమతి చేసుకుని ఆధునిక టెక్నాలజీతో కార్లను రూపొందిస్తామన్నారు.