ప్రతేడాది కృష్ణుడి దైవిక ప్రేమ ఇతివృత్తం ఆధారంగా నిర్వహించే రాస్ మహోత్సవ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని సందర్శించే భక్తులను తిరిగి లగ్జరీ కారులో ఇంటికి పంపించనున్నారు. కేవలం మెర్సి సీఎల్‌ఏ 200 మాత్రమే కాక, లక్కీ విన్నర్లకు టయోటా ఇన్నోవా క్రిస్టా లేదా మహింద్రా ఎక్స్‌యూవీ 500, మారుతీ విటారా బ్రిజా లేదా 11 ఇతర బ్రాండుల్లో ఒక మోడల్‌ను దక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అస్సాం బార్పేట జిల్లాలో ఈ మహోత్సవం జరుగుతోంది. ఈ మహోత్సవంలో ఈ కంటెస్ట్ ఒక అంతర్గత భాగం. లక్కీ విన్నర్లకు ఇక కార్లను బహుమతిగా ఇస్తుంటారు. ఈ సారి 1.8 లక్షల టిక్కెట్లను ఆఫర్ చేశారు. గతేడాది కంటే 20వేలు ఎక్కువని రాస్ లాటరీ కమిటీ సెక్రటరీ వివేక్ తలాక్‌దార్ తెలిపారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ఫెస్టివల్ నవంబర్ 17 వరకు జరుగనుంది. లాటరీ విజేతలను చివరి రోజు ప్రకటించనున్నారు.
గతేడాది తొలి బహుమతి ఓ పేద వ్యవసాయదారుడు సొంతం చేసుకున్నారు. ఈ విధానంలో ఎంతో ఆసక్తికర అంశం లాటరీ కూపన్ ధర 100 రూపాయలు. ప్రారంభ ఏడాదిలో తొలి బహుమతి కింద మారుతీ 800 అందించారు. ఈ ఫెస్టివల్‌కు వారం ముందు టిక్కెట్లను విక్రయిస్తారు. 15 రోజులకు కార్లను ప్రదర్శిస్తారు. కొంతమంది వ్యక్తులు కేవలం కార్లను చూడటానికే వస్తారు. కౌంటర్లలో వీటి టిక్కెట్లను విక్రయిస్తారు. ఈ ఏడాది కారు ధర రూ.1.20 కోట్ల వరకు ఉంది. ఈ మహోత్సవానికి ప్రతేడాది సుమారు 30 లక్షల మంది భక్తులు విచ్చేస్తుండగా.. 2016లో ఆఖరి రోజు 5 లక్షల మంది భక్తులు పోటెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment