ఇండియన్ మార్కెట్లో టయోటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు 'FJ క్రూయిజర్ SUV'ని నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
2006లో ప్రారంభమైన ఐకానిక్ ఎఫ్‌జే క్రూయిజర్ ఎట్టకేలకు మరుగునపడనుంది. 2022లో కూడా మిడిల్ ఈస్టర్న్ మార్కెట్‌లో అమ్ముడైన ఈ కారు గతంలో టయోటా 'ఫైనల్ ఎడిషన్' రూపంలో విడుదలైంది. ఇది కేవలం అప్పట్లో 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది.
ల్యాండ్ క్రూయిజర్ నుంచి ప్రేరణ పొందిన ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‌యువి రెట్రో-థీమ్ స్టైలింగ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఉత్తర అమెరికా, జపాన్, మిడిల్ ఈస్ట్ వంటి అనేక దేశాల్లో విజయవంతంగా అమ్ముడైన ఈ కారు కనుమరుగు కావడం గమనార్హం.
(ఇదీ చదవండి: కొత్త మొబైల్ కొనాలకుంటున్నారా? వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్, ఇవే!)
టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ బేజ్ ఎక్స్టీరియర్ షేడ్‌లో ఉంటే.. మిర్రర్స్, గ్రిల్, బాడీ క్లాడింగ్ వంటివి బ్లాక్ షేడ్‌లో ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా ఆకర్షణీయంగా ఉంది. సీట్లు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో, సెంటర్ కన్సోల్ ఇరువైపులా కూడా అదే కలర్ పొందింది.
టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ 4.0 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 270 హెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రాల్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆఫ్-రోడ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఆధార్ అప్‌డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!)
ప్రస్తుతం టయోటా భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, హైరిడర్, వెల్‌ఫైర్, హిలక్స్ పికప్, ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి వాటిని విక్రయమిస్తూ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని మంచి అమ్మకాలను పొందటానికి కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment