cruiser
-
ఈ టయోటా కారు కావాలన్నా కొనలేరు - ఎందుకంటే?
ఇండియన్ మార్కెట్లో టయోటా కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తోంది. అయితే ఇప్పుడు 'FJ క్రూయిజర్ SUV'ని నిలిపివేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2006లో ప్రారంభమైన ఐకానిక్ ఎఫ్‌జే క్రూయిజర్ ఎట్టకేలకు మరుగునపడనుంది. 2022లో కూడా మిడిల్ ఈస్టర్న్ మార్కెట్లో అమ్ముడైన ఈ కారు గతంలో టయోటా 'ఫైనల్ ఎడిషన్' రూపంలో విడుదలైంది. ఇది కేవలం అప్పట్లో 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. ల్యాండ్ క్రూయిజర్ నుంచి ప్రేరణ పొందిన ఈ కారు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఆఫ్-రోడర్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్యువి రెట్రో-థీమ్ స్టైలింగ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఉత్తర అమెరికా, జపాన్, మిడిల్ ఈస్ట్ వంటి అనేక దేశాల్లో విజయవంతంగా అమ్ముడైన ఈ కారు కనుమరుగు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: కొత్త మొబైల్ కొనాలకుంటున్నారా? వచ్చే నెల విడుదలయ్యే కొత్త స్మార్ట్‌ఫోన్స్, ఇవే!) టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ బేజ్ ఎక్స్టీరియర్ షేడ్‌లో ఉంటే.. మిర్రర్స్, గ్రిల్, బాడీ క్లాడింగ్ వంటివి బ్లాక్ షేడ్‌లో ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా ఆకర్షణీయంగా ఉంది. సీట్లు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లో, సెంటర్ కన్సోల్ ఇరువైపులా కూడా అదే కలర్ పొందింది. టయోటా ఎఫ్‌జే క్రూయిజర్ ఫైనల్ ఎడిషన్ 4.0 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 270 హెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో యాక్టివ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రాల్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఆఫ్-రోడ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా..!) ప్రస్తుతం టయోటా భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, హైరిడర్, వెల్ఫైర్, హిలక్స్ పికప్, ల్యాండ్ క్రూయిజర్ 300 వంటి వాటిని విక్రయమిస్తూ మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని మంచి అమ్మకాలను పొందటానికి కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. -
టొయాటో హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీ, వాటికి గట్టిపోటీ
సాక్షి, ముంబై: టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీని శుక్రవారం లాంచ్ చేసింది. వీటి ధరలరూ. 15.11 లక్షల (ఎక్స్-షోరూమ్)గా సంస్థ ప్రకటించింది. నాలుగు వేరియంట్లలో లభ్యం కానున్న దీని టాప్-స్పెక్ నియో డ్రైవ్ (మైల్డ్-హైబ్రిడ్) వేరియంట్ రూ. 17.09 లక్షలు, హై వేరియంట్ ధర రూ. 18,99,000 (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. 2022 జూలైలో దీన్ని తొలిసారి పరిచయం చేసిన సంస్థ దాదాపు రెండు నెలల తర్వాత దీన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్ కోసం అధికారిక బుకింగ్‌లను ప్రారంభించింది. టయోటా ఇండియా డీలర్‌షిప్‌లలోకి రానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే త్వరలోనే ధరను ప్రకటించనున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీకి కూడి ఇది పోటీగా నిలవనుందని అంచనా. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్) S eDrive 2WD హైబ్రిడ్ రూ. 15.11 లక్షలు G eDrive 2WD హైబ్రిడ్ రూ. 17.49 లక్షలు V eDrive 2WD హైబ్రిడ్ రూ. 18.99 లక్షలు V AT 2WD నియో డ్రైవ్ రూ. 17.09 లక్షలు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో బలమైన హైబ్రిడ్ టెక్‌తో e-CVTతో వస్తుంది. ఇది 91 bhp & 122 Nm ఉత్పత్తి చేస్తుంది. అయితే ఎలక్ట్రిక్ మోటార్ 79 bhp, 141 Nm ను ప్రొడ్యూస్ చేస్తుంది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు ఇంత అద్భుతమైన స్పందన లభిస్తోందంటూ వినియోగదారులకు అసియేట్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అతుల్ సూద్ ధన్యవాదాలు తెలిపారు. ఫీచర్లు: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియో డ్రైవ్ , సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులో ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వైర్లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్ప్లే, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, 7అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి టాప్ ఫీచర్లుఇందులోఉన్నాయి. టయోటా iConnect టెక్నాలజీ సహా క్రూయిజ్ కంట్రోల్, 55 ప్లస్ ఫీచర్లు లభ్యం. -
చంద్రుడిపై అడుగు పెట్టేద్దామంటున్న టయోటా? మన కోసం వెహికల్ రెడీ చేస్తోంది!
జాబిల్లి పైకి సామాన్యులను తీసుకెళ్లేలా ఓ క్రూయిజర్ వెహికల్ని తయరుచేసే పనిలో ఉంది టయోటా. జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)తో జాయింట్ వెంచర్‌గా ఈ లూనార్ క్రూయిజర్ వెహికల్ని అభివృద్ధి చేస్తోంది. 2030 చివరినాటికి వాహనం సిద్ధమవుతుందని టయోటా అంటోంది. అంతేకాదు 2040 కల్లా మార్స్ మీదికి కూడా వెళ్లవచ్చని చెబుతోంది. తాము అభివృద్ధి చేసే లూనార్ క్రూయిజర్ వెహికల్ చంద్రుడికి మీదకు తీసుకెళ్లడమే కాదు అక్కడ మనుషులు తిరిగేందుకు అనువైన ఏర్పాట్లు కూడా చేయగలదని హామీ ఇస్తోంది టయోటా. లూనార్ లాండ్ క్రూయిజర్‌లోనే చంద్రుడిపై తిరిగేందుకు , తాత్కాలికంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. స్పేస్ టెక్నాలజీకి సంబంధించి వందేళ్లకు ఓ సారి గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని, ప్రస్తుతం తాము అదే తరహా టెక్నాలజీపై పని చేస్తున్నట్టు టయోటా చెబుతోంది. భూమిపై వాహనాల్లో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లినట్టుగా చంద్రుడిపైకి ప్రయాణాలు చేయించాలన్నది తమ లక్ష్యమని చెబుతోంది. చదవండి:జాబిలి వైపు భారీ రాకెట్.. లాంఛ్ కాదు ఢీ కొట్టడానికి! -
యూఎస్- ఆరో రోజూ అదే జోరు
వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎస్అండ్పీ 23 పాయింట్లు(0.7 శాతం) ఎగసి 3,508 వద్ద నిలవడం ద్వారా వరుసగా ఆరో రోజు చరిత్రాత్మక గరిష్టాన్ని సాధించింది. ఈ బాటలో నాస్డాక్ 70 పాయింట్లు(0.6 శాతం) బలపడి 11,696 వద్ద ముగిసింది. వెరసి 2020లో 40వ సారి సరికొత్త గరిష్ట రికార్డును అందుకుంది. ఇక వీటితో పోలిస్తే కొంత వెనకడుగులో ఉన్న డోజోన్స్ శుక్రవారం 162 పాయింట్లు(0.6 శాతం) పుంజుకుని 28,654 వద్ద స్థిరపడింది. తద్వారా 2020లో ఏర్పడిన నష్టాల నుంచి బయటపడింది. అంటే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 57 శాతం ర్యాలీ చేసింది. వెరసి ఫిబ్రవరిలో సాధించిన రికార్డ్ గరిష్టాన్ని బ్రేక్ చేసేందుకు కేవలం 1,000 పాయింట్ల దూరంలోనిలిచింది. కాగా.. వరుసగా ఐదు వారాలపాటు లాభాల్లో నిలవడం ద్వారా ఎస్అండ్పీ మరో రికార్డును సాధించడం విశేషం! 1984 తదుపరి ఆగస్ట్‌లో ఎస్అండ్పీ, డోజోన్స్ 8 శాత స్థాయిలో లాభపడ్డాయి. కారణాలున్నాయ్ కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ 1.3 ట్రిలియన్ డాలర్ల భారీ సహాయక ప్యాకేజీకి సిద్ధపడుతుండటం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక ఆర్థిక రికవరీని సూచిస్తూ జులైలో వ్యక్తిగత వినియోగ సూచీ దాదాపు 2 శాతం జంప్‌చేయడం కూడా ఇందుకు దోహదపడినట్లు తెలియజేశారు. మరోపక్క జాక్సన్హోల్ వద్ద ప్రసంగంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే అధిక ప్రాధాన్యమివ్వనున్నట్లు స్పష్టం చేయడం ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు వివరించారు. కోక కోలా అప్ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పానీయాల దిగ్గజం కోక కోలా, విమానయాన బ్లూచిప్ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 3 శాతం చొప్పున ఎగశాయి. క్యూ2లో నికర లాభం అంచనాలు మించడంతో డెల్ టెక్నాలజీస్ 6 శాతం జంప్‌చేసింది. క్యూ3పై అంచనాలతో హెచ్‌పీ 6 శాతం పురోగమించింది. వార్షిక సబ్స్క్రిప్షన్లు జోరందుకోనున్నట్లు అంచనాలు ప్రకటించిన వర్క్‌డే ఇంక్ 13 శాతం దూసుకెళ్లింది. టిక్‌టాక్ యూఎస్ యూనిట్ కొనుగోలుకి చేతులు కలిపిన వాల్‌మార్ట్ 2.7 శాతం, మైక్రోసాఫ్ట్ 1 శాతం చొప్పున లాభపడ్డాయి. బెయిన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయనున్న వార్తలతో న్యుటానిక్స్ ఇంక్ 29 శాతం ర్యాలీ చేసింది. నార్వేజియన్ క్రూయిజ్, రాయల్ కరిబియన్, డెల్టా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 6-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. -
‘విరాట్’పై ఆశలు !
►ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు ►రూ.300 కోట్లకు తగ్గనున్న పెట్టుబడి భారం ►మూలకుద్దులో ఏర్పాటుకు నిర్ణయం విశాఖపట్నం: విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌పై అడుగంటిపోయిన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. విరాట్ విశాఖలో ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక యుద్ధనౌకగా గుర్తింపు పొందిన ఈ విరాట్ నేవీ సేవల నుంచి గత ఏడాది నిష్క్రమించింది. దీనిని రాష్ట్రానికి కేటాయించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. దీనిని విశాఖ తీరంలో మ్యూజియం కం స్టార్ హోటల్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఆ మొత్తాన్ని భరించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనికవసరమయ్యే నిధులను కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్నపానికి అటు నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో విరాట్ విశాఖలో ఏర్పాటు సాధ్యం కాదని తేలిపోయింది. మళ్లీ కదలిక నేవీలో మూడు దశాబ్దాల పాటు సేవలందించి ఇటీవలే విరమణ పొందిన టీయూ–142 యుద్ధ విమానాన్ని మ్యూజియంగా ఏర్పాటుచేయడానికి గత శనివారం విశాఖకు తీసుకొచ్చినప్పుడు మళ్లీ విరాట్‌పై కదలిక వచ్చింది. పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఈ విరాట్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుకు సమగ్రంగా వివరించారు. ప్రస్తుత అంచనాలకంటే మూడు వంతుల నిధులు తగ్గేలా ఈ విరాట్ ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖలో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు గురువారం పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్, ప్రాంతీయ డైరెక్టర్ శ్రీరాములునాయుడు, ఇతర అధికారులు ఢిల్లీ పయనమయ్యారు. సాయంత్రం కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి ఎన్కే సిన్హా నేతృత్వంలోని అధికారులతో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా ప్రతిపాదనలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేయడం, అనవసర వ్యయాన్ని తగ్గించడం వంటì అంశాలను కేంద్ర అధికారులకు వివరించారు. వ్యయం రూ.300 కోట్లకు కుదింపు ఈ ప్రాజెక్టు వ్యయం రూ.300 కోట్లు సరిపోతుందన్న అంచనాకు వచ్చారు. ఇందుకవసరమయ్యే సొమ్ములో కొంత కేంద్ర ప్రభుత్వం భరించాలని కోరారు. దీనిపై అటు నుంచి స్పష్టమైన హామీ రాకపోయినా ప్రతికూలంగా మాత్రం స్పందించలేదు. మరోవైపు రాష్ట్రానికి చెందిన పట్టణాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచి కొంత నిధులను సమీకరించాలన్న నిర్ణయానికొచ్చినట్టు తెలిసింది. దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. త్వరలోనే డీపీఆర్‌లకు సంబంధించి టెండర్లు పిలవనున్నారు. తాజాగా ఈ విరాట్‌ను భీమిలి మండలం మూలకుద్దులో ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. అక్కడ సుమారు 500 ఎకారాల్లో స్పెషల్ టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు పర్యాటకాభివృద్ధి సంస్థ ఆర్డీ శ్రీరాములునాయుడు గురువారం రాత్రి ఢిల్లీ నుంచి ‘సాక్షి’కి చెప్పారు. అటు కేంద్రం కొంత ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇటు అంచనా వ్యయం తగ్గించడంతో విరాట్ విశాఖలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తూర్పు నౌకాదళంలోకి కమోర్తా
రేపు ప్రారంభించనున్న రక్షణ మంత్రి విశాఖపట్నం: జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్ఎస్ కమోర్తా తూర్పు నౌకాదళం అమ్ములపొదిలోకి చేరనుంది. శనివారం ఈ నౌకను రక్షణ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేవల్ డాక్‌యార్డులో ప్రారంభించనున్నారు. కొల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌యార్డ్‌లో దీనిని నిర్మించారు. ఇలాంటివి నాలుగు నిర్మించాలని నిర్ణయించగా అందులో తొలి నౌక కమోర్తా. ఈ యుద్ధనౌకల ప్రాజెక్ట్ డిజైను పూర్తికి నాలుగేళ్లు పట్టింది. గతేడాది జూన్‌లో కమోర్తా సీ ట్రయిల్స్ పూర్తిచేసుకుంది. భారత నావికా దళానికి నిర్మాణ సంస్ధ ఈఏడాది జూలై12నఅప్పగించారు. ఉన్నతశ్రేణికి చెందిన స్టీల్‌తో నౌక నిర్మితమైంది. ఇదీ స్వరూపం 13 మీటర్ల భీమ్‌ను కలిగి ఉండే కమోర్త నౌక 110 మీటర్ల పొడవుంటుంది. 25 నాటికన్ మైళ్ళ వేగంతో దూసుకుపోగలదు. 3500 నాటికన్ మైళ్ళ పాటు నిరంతర పయనం సాగించగలదు. పూర్తి ఆయుధ సామగ్రిని కలిగి సెన్సార్ల పరిజ్ఞానంతో అత్యంత ఆధునికత సంతరించుకుంది. భారీ టోర్పడేలు,ఎఎస్‌డబ్ల్యు రాకెట్స్,మధ్యంతర స్థాయి గన్,మరోరెండు మల్టీ బారన్ గన్లు ఈయుద్ధ నౌక సాధనసంపత్తి. 200 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సయితం గుర్తించగలదు. ఎఎస్‌డబ్ల్యు హెలికాఫ్టర్‌ను సయితం తీసుకుపోగలదు. 13 మంది అధికారులు173మంది నావికులతో కమోడార్ మనోజ్ ఝా నేతత్వంలో సేవలందించనుంది. ఈస్ట్రన్ ఫ్లీట్‌కే ఈ యుద్ధ నౌక చేరి ప్రత్యేకతను చాటుకోనుంది.