మార్కెట్‌లోకి అదిరిపోయే టయోటా ఎస్‌యూవీ! | Unveiled Toyota Urban Cruiser Hyryder | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి టయోటా కిర్లోస్కర్‌ ‘అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌’

Jul 2 2022 7:25 AM | Updated on Jul 2 2022 8:04 AM

Unveiled Toyota Urban Cruiser Hyryder - Sakshi

ముంబై: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ శుక్రవారం కొత్త ఎస్‌యూవీ ‘అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌’’ను ఆవిష్కరించింది. టయోటా డీలర్‌షిప్‌లలో లేదా అధికారిక వెబ్‌సెట్లలో రూ. 25,000 చెల్లించి ముందుస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. వచ్చేనెలలో డెలివరీలు ఉండొచ్చని భావిస్తున్నారు. 

ఇందులో 1.5–లీటర్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇంజిన్‌ 5–స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 6–స్పీడ్‌ ఆప్షనల్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్, హిల్‌–హోల్డ్‌ అసిస్ట్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.

 రియర్‌ ప్యాసింజర్ల కోసం సీట్‌బెల్ట్స్‌ సౌకర్యం ఉంది. దేశీయ మార్కెట్‌లోని టాటా సఫారీ, హ్యుండాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌ తదితర ఎస్‌యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement