టోక్యో: జపాన్‌కు చెందిన వాహన దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం).. మరో వాహన కంపెనీ సుజుకీ మోటార్ కార్ప్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కోసమే పోటీ కంపెనీలో వాటాను కొనుగోలు చేసి జట్టుకట్టినట్లు వివరించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం.. సుజుకీ మోటార్ కార్ప్‌లో 4.9 శాతం వాటాను (908 డాలర్లు, జపాన్ కరెన్సీ విలువ పరంగా 96 బిలియన్ యెన్) టయోటా కైవసం చేసుకోనుంది. ఇదే క్రమంలో సుజుకీ, టయోటాలో 454 డాలర్లు (48 బిలియన్ యెన్) పెట్టుబడి పెట్టనుంది. కృత్రిమ మేధ వంటి అధునాతన టెక్నాలజీలో ఉండే భారీ వ్యయాలను తట్టుకోవడం కోసం ఇరు సంస్థలు జట్టుకట్టాయి. 2017లో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా.. సుజుకీ బలంగా ఉన్న భారత మార్కెట్లో రెండు సంస్థలు పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment