టాటా సన్స్ కు వేల కోట్ల భారీ జరిమానా | Tata Sons ordered to pay $1.17 billion to Japan's NTT DoCoMo for breaching agreement | Sakshi
Sakshi News home page

టాటా సన్స్ కు వేల కోట్ల భారీ జరిమానా

Published Fri, Jun 24 2016 1:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

టాటా సన్స్ కు వేల కోట్ల  భారీ జరిమానా

టాటా సన్స్ కు వేల కోట్ల భారీ జరిమానా

టోక్యో: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్  మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్ కి లండన్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది.  జపాన్‌కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్‌టీటీ) డొకోమో  వివాదంలో  సుమారు ఎనిమిదివేల కోట్ల   రూపాయల బారీ జరిమానా విధించింది. 79 వేల 531 వేల కోట్ల రూపాయల(1.17 బిలియన్ డాలర్ల) నష్టపరిహారాన్ని  చెల్లించాలని  లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించింది.  డొకొమో తో  చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై సానుకూలంగా స్పందించిన  కోర్టు ఈ మొత్తాన్ని డొకొమోకు నష్టపరిహారంగా  చెల్లించాలంటూ టాటా సన్స్ కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయాన్ని టాటా  సన్స్  ప్రతినిధి కూడా ధృవీకరించారు.. కోర్టు ఆదేశాలకు తమకు చేరాయని దీనిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.  టాటా సన్స్ ఎల్లప్పుడూ  చట్టానికనుగుణమైన పద్ధతిలో  ఒప్పంద బాధ్యతలు నిర్వర్తించేందుకు కట్టుబడి ఉందని  ..దీనిపై ఇపుడే వ్యాఖ్యానించలేమన్నారు.

కాగా టాటా టెలిలో తనకున్న 26.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా సంయుక్త భాగస్వామ్యం నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు 2014 ఏప్రిల్‌ లో డొకోమో ప్రకటించింది. ఈ వాటాలను రూ.7,250 కోట్లకు కొనుగోలు చేసేందుకు తొలుత అంగీకరించిన టాటా సన్స్ ఆ తరువాత వెనుకడుగు వేసింది. టాటా సన్స్ తో కలసి తాము ఏర్పాటు చేసిన టాటా టెలి సర్వీసెస్‌ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది  ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్‌లోని  కోర్టులో గత ఏడాది జనవరి లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement